Nov 30th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases, Petitions And Political Updates 30 November | Sakshi
Sakshi News home page

Nov 30th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Thu, Nov 30 2023 7:15 AM | Last Updated on Thu, Nov 30 2023 7:53 PM

TDP Chandrababu Cases, Petitions And Political Updates 30 November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

4:02 PM, Nov 30, 2023
ఓడినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు : మల్లాది విష్ణు

  • విజయవాడ: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి
  • 2019లో చంద్రబాబు ఘోర పరాజయం పొందినా బుద్ధి రాలేదు : మల్లాది
  • ఆంధ్ర రాష్ట్రంలో అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, లోకేష్ గోబెల్స్ కు వారసులు
  • ఎల్లో మీడియాలో నీచ రాతలు రాయించుకొని టిడిపి నేతలు ఆనందాన్ని పొందుతున్నారు
  • సీఎం జగన్ సంక్షేమ పథకాలన్నీ కాపీ కొడతారు
  • మా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను చూసి చంద్రబాబు   ఏడుపే ఏడుపు
  • టీడీపీ నేతలు ప్రతిరోజు టన్నుల టన్నుల బురద జల్లుతున్నారు
  • గోబెల్స్‌లా విష ప్రచారం చేస్తున్నారు
  • విజయవాడలో దేవాలయాలను కూల్చివేసింది చంద్రబాబే
  • రాజమండ్రి పుష్కరాల్లో 30 మందిని చంపింది చంద్రబాబే
  • చంద్రబాబుకి జైల్లో ఉంటే అన్ని రోగాలు గుర్తుకొస్తాయి
  • చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో తిరగాలంటే ముందు దేవాలయాలకు క్షమాపణ చెప్పాలి
  • విజయవాడలో ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చి ఆంజనేయస్వామిని ట్రాక్టర్లో తీసుకువెళ్లారు
  • ఐదు జిల్లాల కలెక్టర్ల పై చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చాడు
  • టిడిపి మంత్రులు అధికారంలో ఉన్నప్పుడు గాడిదలు కాశారా?
  • ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రతిపక్షంగా ఎప్పుడైనా వ్యవహరించిందా

4:02 PM, Nov 30, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు డిసెంబర్‌ 12కి వాయిదా

  • ఏపీ హైకోర్టు: ఇసుక కేసు వాయిదా
  • ఇసుక కుంభకోణంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్‌
  • చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ
  • తదుపరి విచారణ వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు

2:02 PM, Nov 30, 2023
ఫైబర్‌ గ్రిడ్‌ కేసు డిసెంబర్‌ 12కి వాయిదా

  • ఢిల్లీ: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • ఫైబర్ నెట్ కేసు ను డిసెంబర్ 12 తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం
  • కేసు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల ధర్మాసనం
  • డిసెంబర్‌ 12 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేస్తామన్న న్యాయస్థానం

1:52 PM, Nov 30, 2023
హస్తినలో కిం కర్తవ్యం?

  • చంద్రబాబు అధ్యక్షతన రేపు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం
  • పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ
  • పార్లమెంట్‌లో ఏ ఏ అంశాలు చర్చించాలన్నదానిపై చంద్రబాబు బ్రీఫింగ్‌
  • డిసెంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 22 వరకు జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు
  • అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జరగనున్న పార్లమెంటు సమావేశాలు
  • అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవాలని భావిస్తోన్న తెలుగుదేశం
  • తెలంగాణలో కాంగ్రెస్‌ కోసం సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబు, తెలుగుదేశం
  • అయిదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితేనే.. చక్రం తిప్పేందుకు అవకాశం ఉంటుందని చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశలు
  • పార్లమెంటులో బీజేపీని ఇప్పటికిప్పుడు ఏం అనొద్దు, అదే సమయంలో తెర వెనక కాంగ్రెస్‌తో మంతనాలు కొనసాగించాలని చంద్రబాబు వ్యూహం

1:33 PM, Nov 30, 2023
తిరుమలకు చంద్రబాబు

  • హైదరాబాద్ నుంచి తిరుపతి పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు
  • కుటుంబసభ్యులతో రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • రాత్రికి తిరుమలలో బస చేయనున్న చంద్రబాబు
  • రేపు మధ్యాహ్నం అమరావతికి రానున్న చంద్రబాబు
  • డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు
  • డిసెంబర్ 3న విశాఖకు రానున్న చంద్రబాబు
  • డిసెంబర్ 3న సింహాచలం అప్పన్నను దర్శించుకోనున్న చంద్రబాబు
  • డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు

12:05 PM, Nov 30, 2023
ఆ సలహా ఇచ్చింది ఎవర్రా?

  • తెలుగుదేశంలో చర్చనీయాంశంగా మారిన లోకేష్‌ అంశం
  • లోకేష్‌కు ఎవరు సలహాలు ఇస్తున్నరన్నదానిపై చర్చ
  • 40% ఓటు బ్యాంకు ఉందని చెప్పుకుంటున్న మనం పక్కచూపులెందుకు చూడాలి?
  • పవన్‌ కళ్యాణ్‌కు జై కొట్టమని లోకేష్‌కు సలహా ఇచ్చింది ఎవరు?
  • తనకు తానే గొయ్యి తీసుకుంటున్న విషయం లోకేష్‌కు అర్థమవుతోందా?
  • తన కెరియర్‌తో పాటు పార్టీని కూడా భూస్థాపితం చేయాలనుకుంటున్నాడా?
  • ఇప్పుడు కాపుల కోసం పవన్‌కు జై కొడితే రేపు కోస్తా, సీమల్లో ఏం చెబుతాం?
  • అసలు పవన్‌కళ్యాణ్‌కే క్రెడిబిలిటీ లేనప్పుడు లోకేష్‌కు ఏం లాభం?
  • పైగా పవన్‌ను దూరం చేసే ప్లాన్‌ జరుగుతుందని బహిరంగ సభల్లో చెప్పుకునే దౌర్భాగ్యమెందుకు?

11:45 AM, Nov 30, 2023
ఆడలేక మద్దెల ఓడు చందాన టిడిపి తీరు

  • ఏపీలో ఎన్నికలపై తప్పుడు ప్రచారం
  • సోషల్‌మీడియాలో తెలుగుదేశం దుష్ప్రచారం
  • ఏపీలో ఎన్నికలు ముందస్తుగా వస్తాయని తెగ పోస్టులు
  • ఎల్లో మీడియాలోనూ అవే సంకేతాలిస్తూ వార్తలు
  • ముందస్తుకు అవకాశం లేదని స్పష్టంగా చెబుతోన్న ప్రభుత్వం
  • ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి : సజ్జల
  • లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు : సజ్జల
  • ఎన్నికలు ఎప్పుడొచ్చినా YSRCP సిద్ధంగా ఉంది: సజ్జల
  • టిడిపి, జనసేన చేసే ప్రచారం నమ్మొద్దని సూచన

10:50 AM, Nov 30, 2023
చంద్రబాబు కేసు సుప్రీంలో ఎప్పుడంటే.?

  • ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
  • ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు
  • చంద్రబాబు పిటిషన్ ను విచారించనున్న జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది
  • మధ్యాహ్నం 2 తర్వాత బెంచ్‌ మీదకు చంద్రబాబు పిటిషన్ వచ్చే అవకాశం
  • (చదవండి.. ఫైబర్‌గ్రిడ్‌ కేసులో నిధులెలా పక్కదారి పట్టించారు?)

10:45 AM, Nov 30, 2023
చంద్రబాబు తిరుమల పర్యటన

  • ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో చంద్రబాబు పర్యటన
  • మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న చంద్రబాబు
  • తిరుమలలో రాత్రి బస చేయనున్న చంద్రబాబు నాయుడు
  • రేపు ఉదయం శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోనున్న చంద్రబాబు

10:32 AM, Nov 30, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు డిసెంబర్‌ 5కు వాయిదా

  • ఐఆర్ఆర్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ పై విచారణ
  • చంద్రబాబును కస్టడీకి కోరుతూ గతంలో పీటీ వారెంట్ వేసిన సీఐడీ
  • విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసిన న్యాయస్థానం
  • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

10:14 AM, Nov 30, 2023
తెలుగుదేశం, జనసేన పొత్తుల వెనక పాలిట్రిక్స్‌ ఏంటీ? :
YSRCP

  • చంద్రబాబు, లోకేష్.. ఇద్దరూ జై పవన్ కల్యాణ్ అని ఎందుకు అంటున్నారు?
  • లోకేష్‌కు ఇంకా రాజకీయం ఒంటబట్టలేదు
  • ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు
  • చంద్రబాబు పెట్టుకున్న ఆశల్లో పది శాతం కూడా చేరలేకపోయాడు
  • మిగిలింది పార్టీ కాడి మోసేవారొకరు కావాలి
  • అందుకే 40 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ పరువును తాకట్టు పెట్టేశారు
  • తనకు సరిసాటి అయిన పవన్‌ కళ్యాణ్‌ను ఎంచుకున్నాడు
  • రెండు చోట్ల పోటీ చేసి.. ఒక్క చోట కూడా గెలవని పవన్‌.. ఇప్పుడు లోకేష్‌కు ఆశ, భరోసా
  • తెలంగాణలో బీజేపీతో పవన్‌ ఉంటాడు..!!
  • టీడీపీ ఏమో కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు..
  • ఏపీలో మాత్రం మళ్లీ టీడీపీ - జనసేన స్నేహం..!!
  • అసలు వీళ్లు రాజకీయం చేస్తున్నారా..? వ్యభిచారం చేస్తున్నారా...?
  • 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు 38 శాతం.
  • జనసేనకు వచ్చిన ఓట్లు 5 శాతం..
  • వైఎస్ఆర్‌ సీపీకి వచ్చిన ఓట్లు 50 శాతం.
  • టీడీపీ - జనసేన ఓట్లు కలిపినా.. వైఎస్‌ఆర్‌ సీపీకి వచ్చిన ఓట్లు అన్ని లేవు.
  • 2024లో టీడీపీ బీసీ ఓటు బ్యాంకుకు.. మరింత దెబ్బ పడబోతుంది...!!!
  • ఇప్పటివరకు ఏ బీసీ ఓట్ల మీదయితే టిడిపి నమ్మకం పెట్టుకుందో..ఆ బీసీ ఓట్లు వైఎస్ఆర్‌ సీపీకి పడబోతున్నాయి.
  • ఈ భయంతోనే ... పవన్ కల్యాణ్ పాట అందుకున్నారు..
  • చంద్రబాబు , లోకేష్...!!!!
  • రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు.. పాదయాత్రలో లోకేష్..
  • వారాహి ఎక్కి పవన్‌ ప్రజలకు ఏం చెబుతారు..?
  • మేం నీతిమంతులమని చెబుతారా..? మేం నిప్పులమని చెబుతారా..?
  • మేం స్కామ్‌లు చేయలేదని చెబుతారా..?
  • మీరు నీతిమంతులైతే.. మీరు స్కామ్‌లు చేయకపోతే..
  • మీరు నిప్పులే అయితే.. ధీమాగా సింగిల్‌గా పోటీ చేయండి

10:04 AM, Nov 30, 2023
నమ్మకం లేకే పొత్తులు పెట్టుకున్నారు.. దమ్ముంటే సింగిల్‌గా రండి : YSRCP

40 ఏళ్ల చరిత్ర... 25 ఏళ్ల అధికారం.. కానీ.. జనసేనకు జై అంటోన్న టీడీపీ..!!!
దీని అర్ధం ఏమంటే.. దుకాణం మూసేయడానికి టీడీపీ సిద్దంగా ఉందని..!!

  • తెలుగోడి ఆత్మగౌరవం నుంచి.. పుట్టిన పార్టీ టీడీపీ
  • జాతీయ స్థాయిలో... లోక్ సభలో ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ
  • ఎన్టీఆర్‌ నాయకత్వంలో .. కాంగ్రెస్‌ పునాదులను కదిలించిన పార్టీ టీడీపీ.
  • 1983-89, 1994-2004, 2014-19లో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ..!!!!
  • 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీ.. ఇప్పుడు 5 శాతం ఓటు బ్యాంక్‌ ఉన్న జనసేనకు.. జై కొడుతోంది....!!!!
  • ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. పార్టీని, ప్రభుత్వాన్ని లాక్కున్న తరువాత..
  • పార్టీ కార్యకర్తల చేతుల్లోంచి.. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి .. పోవడం దీనికి ప్రధాన కారణం.

చంద్రబాబు ప్రజలను నమ్ముకోకుండా.. మీడియా నమ్ముకోవడం.. టీడీపీ ప్రస్తుత దుస్థితికి కారణం.

  • 1994లో ఎన్టీఆర్ నాయకత్వంలో.. టీడీపీ అధికారంలోకి వచ్చింది.
  • 1995లో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. చంద్రబాబు సీఎం సీటు ఆక్రమించాడు.
  • 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకుని.. ఉమ్మడి ఏపీలో 185 సీట్లు గెల్చుకున్నాడు.
  • 2004లో వైఎస్ఆర్‌ ప్రభంజనంలో .. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ కొట్టుకుపోయింది. 47 సీట్లకు పరిమితమైంది.
  • 2009లో చంద్రబాబు గ్రాండ్ అలయన్స్‌.. ఏర్పాటు చేసినా వైఎస్ఆర్‌ సునామీలో.. కొట్టుకుపోయాడు.
  • 2009లో వైఎస్‌ఆర్‌ అకాల మరణంతో.. చంద్రబాబు రాజకీయంగా బతికాడే కానీ.. లేకపోతే చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండ్‌ కార్డ్‌ పడేది
  • 2014లో విభజిత ఏపీలో.. చంద్రబాబు బీజేపీ, పవన్‌ కల్యాణ్‌లను పక్కన .. పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే... టీడీపీ గెల్చిన సీట్లు 102...!!
  • 2019లో టీడీపీ ఘోరంగా ... 23 సీట్లకే పరిమితమైంది..!!!

08:54 AM, Nov 30, 2023
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్‌
పాదయాత్రలో లోకేష్‌ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ?

అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP

  • మీ టాలెంట్‌పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది?
  • కొడుకు లోకేష్‌కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పట్టుకున్నారు
  • పవన్‌కళ్యాణ్‌ సపోర్ట్‌ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్‌ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు
  • నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయరు?
  • మీకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన సపోర్ట్‌ ఎందుకు?
  • నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్‌ స్టిక్‌గా పవన్‌ కళ్యాణ్‌ను పట్టుకున్నారా?
  • పైగా మీకు మరో సపోర్ట్‌ బీజేపీ కావాలా?
  • పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా?
  • ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి
  • మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి
  • భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి
  • లోకేష్‌.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్‌ కళ్యాణ్‌కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు
  • నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు

07:54 AM, Nov 30, 2023
చంద్రబాబు పిటీ వారెంట్‌పై విచారణ వాయిదా

  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబుపై పిటీ వారెంట్‌పై విచారణ
  • విజయవాడ ఏసీబీ కోర్టు డిసెంబర్‌ 5కు వాయిదా
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారులో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ భూ దోపిడీకి పాల్పడిన కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు
  • ఇందులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణతోపాటు పలువురిపై కేసు నమోదు
  • ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌

07:43 AM, Nov 30, 2023
నోటీసులు అందని వారికి మీరే అందజేయండి

  • చంద్రబాబు ‘స్కిల్‌’ కేసులో ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు హైకోర్టు వెసులుబాటు
  • విచారణ డిసెంబర్‌ 13కి వాయిదా
  • స్కిల్‌ స్కాం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పిటిషన్‌
  • నోటీసులు అందని వారికి వాటి­ని ఆయనే అందజేయవచ్చని హైకోర్టు వెసులుబా­టు
  • నోటీసులు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలనుకుంటే దాఖలు చేయవచ్చు
  • న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు
  • చంద్రబాబు హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో అనేక క్లిష్టమైన అంశాలు
  • సీబీఐ దర్యాప్తు చేయడమే సబబుగా ఉంటుందంటూ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పిటిషన్‌
  • సరైన చిరునామాలు లేకపోవడం వల్ల పలువురికి నోటీసులు అందలేదని తెలిసిన ధర్మాసనం

07:27 AM, Nov 30, 2023
వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..!

  • చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు
  • ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
  • ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
  • కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్
  • విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్  ధర్మాసనం
  • ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన
  • "మనోళ్లు బ్రీఫ్డ్‌ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
  • ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు
  • "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌" గురించి చెప్పని చంద్రబాబు
  • "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్‌ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్‌
  • ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌
  • బాలకృష్ణ చేసిన "అన్‌స్టాపబుల్‌ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు
  • అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా?
     

07:20 AM, Nov 30, 2023
నేడు తిరుపతికి చంద్రబాబు

  • అమరావతి : నేడు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు
  • శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు
  • దర్శనం తర్వాత తిరుపతి నుంచి విజయవాడకు చంద్రబాబు

07:15 AM, Nov 30, 2023
బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం

  • దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్
  • ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్‌రోల్ మెంట్ చేయించిన టీడీపీ
  • తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు
  • సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు
  • ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
  • రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి
  • చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు
  • ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు
  • మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని
  • వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement