Nov 28th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases Petitions And Political Updates 28 November | Sakshi
Sakshi News home page

Nov 28th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Tue, Nov 28 2023 6:53 AM | Last Updated on Tue, Nov 28 2023 5:01 PM

TDP Chandrababu Cases Petitions And Political Updates 28 November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

3:00 PM, Nov 28, 2023
సెక్షన్‌ 17aపై ఇప్పటివరకు ఏ కోర్టు ఏమి చెప్పింది?

పట్నా హైకోర్టు 

  • ‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు.
  • అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు.
  • అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్‌ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’
     

కర్ణాటక హైకోర్టు

  • ‘సెక్షన్‌ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు.
  • అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ 
  • (డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది)

సెక్షన్‌ 17aను కోర్టులు ఏ రకంగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాయి?

  • ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్‌ 17ఏ రక్షణ కల్పించదు
  • సీఐడీ న్యాయవాదుల వాదనలను పట్నా, కర్ణాటక కేసులు బలపరుస్తున్నాయి
  • చంద్రబాబు ఈ సెక్షన్‌ ద్వారా రక్షణ పొందడానికి ఎందుకు అర్హులు కారో సులభంగా అర్థం చేసుకోవచ్చు
  • కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్‌ 17ఏ వర్తించదని పట్నా కోర్టు చెప్పింది.
  • స్కిల్‌ స్కామ్‌లో కూడా ప్రజాధనం రూ.371 కోట్లు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది.
  • నకిలీ ఇన్వాయిస్‌లతో ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా దారిమళ్లించారని కేంద్ర జీఎస్టీ అధికారులు నిగ్గు తేల్చారు.
  • కాబట్టి చంద్రబాబుకు సెక్షన్‌ 17ఏ కింద రక్షణ పొందలేరు
  • స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు పూర్తి అవగాహనతోనే అవినీతికి పాల్పడ్డారు.
  • ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు.
  • ప్రైవేటు వ్యక్తి గంటా సుబ్బారావుకు నాలుగు కీలక పోస్టులు కట్టబెట్టారు.
  • నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తూ నోట్‌ ఫైళ్లపై 13 సంతకాలు చేశారు.
  • సెక్షన్‌ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్‌ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది.
  • ఏపీ ఏసీబీకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది.
  • అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఆయన ప్రభు­­త్వం ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది.
  • కాబట్టి ఈ కేసులో సెక్షన్‌ 17 ఏ వర్తించదు ఆన్నది కర్ణాటకలో డీకే శివకుమార్‌ కేసు ద్వారా స్పష్టమైంది.
  • స్కిల్‌ స్కామ్‌లో అప్పటి సీఎం చంద్ర­బాబుతో పాటు ప్రైవేటు వ్యక్తులు కూడా నిందితులుగా ఉన్నారు.
  • ప్రైవేటు వ్యక్తులతో కలిపి ప్రజాప్రతినిధిపై కేసు పెట్టడం చెల్లదన్న డీకే శివకుమార్‌ వాదనను కూడా కోర్టు తిరస్కరించింది. 
  • స్కిల్‌ స్కామ్‌లో చంద్ర­­బాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ పూర్తిగా అసంబద్దమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   

2:50 PM, Nov 28, 2023
సెక్షన్‌ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం

  • సెక్షన్‌ 17aతో ముడిపడి ఉన్న చంద్రబాబు కేసులు
  • స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం
  • స్కిల్‌ కేసులో అరెస్ట్‌ కాగానే సెక్షన్‌ 17a రాగం అందుకున్న చంద్రబాబు
  • తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తీసుకోవాలంటూ మెలిక
  • నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోని చంద్రబాబు
  • సుప్రీంకోర్టులో సెక్షన్‌ 17aపై సుదీర్ఘ వాదనలు
  • CID తరపున ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • వేర్వేరు కేసుల్లో సెక్షన్‌ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించిన ఇరు పక్షాలు
  • సెక్షన్‌ 17aను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్న రాజ్యాంగ నిపుణులు
  • చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన తప్పించుకునే అవకాశం ఉండరాదంటున్న నిపుణులు
  • సెక్షన్‌ 17aపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి వేర్వేరు కేసుల్లో ముందడుగు

2:40 PM, Nov 28, 2023
చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు

  • CID దాఖలు చేసిన పిటిషన్‌లో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు
  • ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలు
  • డిసెంబర్‌ 8వ తేదీకి విచారణ వాయిదా
  • బెయిల్‌ కండిషన్లు అన్నీ యథాతధం
  • స్కిల్‌ కుంభకోణం కేసు గురించి చంద్రబాబు ప్రకటనలు చేయొద్దు
  • కేసు వివరాలపై బహిరంగంగా ప్రకటనలు చేయొద్దు
  • ర్యాలీలు నిర్వహించడం, రాజకీయ కార్యకలపాల్లో పాల్గొనడంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి
     

2:30 PM, Nov 28, 2023

సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌

  • సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన  పిటిషన్‌పై విచారణ
  • జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు విచారణ
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు  బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ  స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

పిటిషన్‌లో CID వాదనలు

  • చంద్రబాబుకు బెయిల్‌ విషయంలో పరిధి దాటింది
  • సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించింది
  • కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్‌ చిట్‌ ఇచ్చే ప్రయత్నం చేసింది
  • ట్రయల్‌ కోర్టును ప్రభావితం చేసేలా ఆ తీర్పు ఉంది
  • మినీ ట్రయల్‌ నిర్వహణ.. 39 పేజీల తీర్పే ఇందుకు నిదర్శనం
  • దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయి
  • అందుకు పూర్తి ఆధారాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు
  • చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉంది.. సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారు
  • హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధం

1:30 PM, Nov 28, 2023
బీసీలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు : YSRCP

  • ఏలూరు జిల్లా : కైకలూరులో YSRCP బస్సుయాత్రలో మంత్రి,కారుమూరి నాగేశ్వరరావు
  • జగన్ మోహన్ రెడ్డి చెప్పినవి...చెప్పనివి చేస్తున్న గొప్ప మనిషి
  • క్యాబినెట్ లో 70% బిసి,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు
  • అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయంతో అధికారం కట్టబెట్టిన ఆ సామాజికవర్గానికి మేలు చేశారు
  • చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బిసిలకు ఏం చేశాడు?
  • చంద్రబాబు.. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించావా?
  • వందల కోట్లకు చంద్రబాబు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నాడు
  • ఎమ్మెల్సీలను సైతం కౌంటర్లు పెట్టుకుని చంద్రబాబు అమ్మేసుకున్నాడు
  • ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు మా వాళ్లకే పనులు చేయండని కలెక్టర్లకు చెప్పాడు
  • జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఓటేసినా ..వేయకపోయినా అందరికీ మంచి చేయమని చెప్పారు
  • రాజకీయంగా ఇక చంద్రబాబు పనైపోయింది
  • ఈ ప్రభుత్వం పై కుళ్లుతో చంద్రబాబు,ఎల్లో మీడియా బురద జల్లుతున్నారు
  • సామాజిక న్యాయం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డే మళ్లీ కావాలని ప్రజలు కోరుతున్నారు
  • జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేక ఓటనేదే లేదు, పవన్ కళ్యాణ్ చీల్చడానికి ఏమీ లేదు

12:00 PM, Nov 28, 2023
లోకేశ్‌, చంద్రబాబుకు విజయసాయి కౌంటర్‌

  • ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర. నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్. 
  • గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు.
  • ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి.

  • RBI నివేదిక ప్రకారం రాష్ట్ర స్థూల వార్షిక ఉత్పత్తి (GSDP) పెరిగింది.
  • చంద్రబాబు హయాంలో (2018-19) కంటే ఇప్పుడు రెట్టింపై రూ.13.2 లక్షల కోట్లకు పెరిగింది. 
  • దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి ఐదో స్థానంలో వెలుగులీనుతోంది.
  • గతంలో 15వ స్థానంలో పాతాళంలో ఉండేది. 
  • పచ్చ కళ్లద్దాల వల్ల మీకు ఈ అభివృద్ధి కనిపించడం లేదు కదా పురంధేశ్వరి గారూ!
     

11:09 AM, Nov 28, 2023
లోకేష్‌ చెబుతున్నదేంటీ? వాస్తవాలేంటీ?

లోకేష్‌ : స్కిల్‌ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా?

  • వాస్తవాలు :
  • 3300  కోట్ల ‘స్కిల్‌’ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదు అని  సీమెన్స్‌ కంపెనీ చెప్పింది
  • ఆ పేరుతో టెండర్ లేకుండా రూ.371  కోట్లు పక్కదారి పట్టించారు
  • ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది
  • చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్‌ బోస్‌కు డబ్బు చేరినట్టు ఆధారాలు సేకరించింది
  • వారి మధ్య కోడ్‌ భాషలో నిధుల హవాలా జరిగినట్టు తేల్చింది
  • రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో రూ.241 కోట్లు హవాలా మార్గంలో 6  షెల్ కంపెనీల ద్వారా  మళ్లీ బాబుకు చేరినట్టు తేల్చింది
  • ఈ స్కిల్‌ కుంభకోణం డబ్బులో  రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి
     
  • ఒకసారి అమరావతి కాంట్రాక్టర్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో లోకేష్‌
  • అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ నిర్మాణ వ్యయంలో (20 శాతం) రూ.119 కోట్లు ముడుపులు బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని కాంట్రాక్టర్ అయిన  షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పాడు.
  • ఆగష్టు 4న  కేంద్ర సంస్థ ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు ఇచ్చింది
  • బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) రూ.2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లబ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు.
  • ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పడం లేదేందుకు లోకేష్‌?

10:52 AM, Nov 28, 2023
తెలుగుదేశం హామీలు, వాగ్దానాలంటే ఇలా ఉంటాయి మరి.!

  • చంద్రబాబు అరెస్ట్ అయితే 150 మంది చనిపోయారు అని చెప్పినారు అని పచ్చ మీడియాలో తెగ ప్రచారం చేశారు.
  • వాళ్లకు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేసి ఆర్ధిక సాయం చేస్తారని దండోరా వేశారు
  • నిజం గెలవాలి అని భువనేశ్వరీని రంగంలోకి దింపారు
  • 3 కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వగానే ఖర్చు పెరిగిపోయిందని గుర్తొచ్చింది
  • మిగిలిన 147 మంది సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయారు
  • బెయిల్‌ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ల సంగతి ఆక్‌..పాక్‌..కరివేపాక్‌..!
  • అంతేలే.. వాళ్ల ఘన చరిత్ర తెలియంది కాదు
  • 2014లో అయితే ఏకంగా మ్యానిఫెస్టో మాయం చేశారు
  • ఎన్నో చెబుతారు.. అన్నీ సందర్భాన్ని బట్టి మరిచిపోతారు.. జనం కూడా మరిచిపోయారనుకుని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు
     

10:33 AM, Nov 28, 2023
మా పాదయాత్రకు బ్రేక్‌ పడింది.. సారీ.. మళ్లీ వస్తున్నా

  • 79 రోజుల సుదీర్ఘ విరామం తరువాత కొనసాగుతున్న యువగళం
  • బ్రేక్‌ విషయాన్ని కవర్‌ అప్‌ చేసేందుకు ప్రచారం పెంచాలని అడుగుతోన్న లోకేష్‌
  • అన్ని కులాలు, కుల సంఘాలు, కార్మిక సంఘాలతో భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్లు
  • నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు టార్గెట్‌లు పెడుతోన్న టిడిపి అధిష్టానం
  • లోకేష్‌ను అన్ని కులాల వారి దగ్గరకు తీసుకెళ్లాలని ఆదేశం
  • ఇవ్వాళ బీసీ సంఘాల నేతలతో లోకేష్‌ సమావేశం
  • అనంతరం చేనేత కార్మికులతో లోకేష్‌సమావేశం
  • ఆ తర్వాత దివ్యాంగులతో లోకేష్‌ భేటీ
  • ఆ తర్వాత గంగిరెడ్డి సామాజికవర్గీయులతో లోకేష్‌ భేటీ
  • మధ్యాహ్నం కాపులతో లోకేష్‌ సమావేశం
  • భోజనం సమయంలో ఎస్సీలతో లోకేష్‌ భేటటీ
  • ఆ తర్వాత కొందరు యువకులు, విద్యార్థులతో మాట, ముచ్చట
  • సాయంత్రం గున్నేపల్లిలో స్థానికులతో లోకేష్‌ సమావేశం
  • రాత్రి ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి సమీపంలో లోకేష్‌ బస
  • ఎల్లో మీడియాలో ప్రచారం బాగా రావాలని సూచించిన లోకేష్‌

10:33 AM, Nov 28, 2023
చంద్రబాబు కేసు @ ఐటం నెంబర్‌ 64

  • ఢిల్లీ: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన  పిటిషన్ పై విచారణ
  • విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం
  • ఐటెం నెంబర్ 64 గా లిస్ట్ అయిన కేసు
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు  బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ  స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌
  • ఈ ఎస్‌ఎల్‌పీ తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని వినతి

10:14 AM, Nov 28, 2023
క్షమించడానికైనా ఓ లెక్క ఉండాలప్ప.!

  • క్షమించాలి... ప్లీజ్‌.. నన్ను క్షమించాలి : లోకేష్‌
  • యువగళం పాదయాత్రకు విరామం ఇచ్చినందుకు క్షమించాలి
  • నిజాలు ఎప్పుడు చెబుతావు లోకేష్‌ ? : YSRCP
  • తండ్రి జైలుకు వెళ్లగానే అరెస్ట్‌ చేస్తారన్న భయంతో ఢిల్లీ పారిపోయావు
  • అరెస్ట్‌ చేయబోమని కోర్టులో CID చెప్పిన తర్వాతైనా పాదయాత్ర ప్రారంభించలేదు.!
  • పాదయాత్ర చేయకపోతే పరువు పోతుందని పార్టీ సీనియర్లు చెప్పినా వినలేదు.!
  • నేను నడవను గాక.. నడవనంటూ హైదరాబాద్‌కు పరిమితమయ్యావు
  • శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు నడవమని చంద్రబాబు చెబితే వినలేదు.!
  • విశాఖతో సరిపెడతానంటూ పేచి పెట్టిన విషయం ప్రజలకెందుకు చెప్పలేదు?
  • పార్టీకి ఏం ప్రయోజనం ఉంటే నాకెందుకు? నేనేందుకు నడవాలని గొడవ పెట్టుకున్న విషయం ఎందుకు చెప్పలేదు?
  • చేసిందంతా చేసి.. ఇప్పుడు జనం మధ్యలోకొచ్చి క్షమించమని అడుగుతున్నావా?

8:55 AM, Nov 28, 2023
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ

  • విచారణ చేయనున్న జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం
  • ఐటెం నెంబర్ 64 గా లిస్ట్ అయిన కేసు

పిటీషన్‌లో  కీలక అంశాలు:

  • బెయిల్‌ మంజూరు విషయంలో సుప్రీంకోర్టు పదేపదే ఇచ్చిన ఆదేశాల పరిధిని హైకోర్టు అతిక్రమించింది: ఏపీ ప్రభుత్వం
  • పిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది
  • హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది
  • కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి, ఆధారాలదర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే వ్యాఖ్యానించింది
  • దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం రాళ్లు వేస్తూనే ఉన్నారు
  • ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది
  • సీడీఐ కోరిన సమాచారాన్ని ఇప్పటివరకూ టీడీపీ ఇవ్వనే లేదు
  • కేసుల మూలాల గురించి హైకోర్టు తీర్పులో పేర్కొనడం ట్రయల్‌ కోర్టు అధికారాలను హరించడమే
  • ఇది చాలా ఆందోళనకరమైన విషయం, బెయిల్‌ దశలోనే న్యాయ పరిధిని మీరడమే అవుతుంది
  • బెయిల్‌ సందర్భంగా సీఐడీ అభ్యంతరాలపై తిరిగి పిటిషనర్‌ ఎలాంటి వాదనలు చేయలేదు
  • దర్యాప్తు సమయంలో బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా హైకోర్టు తీరు అనూహ్యమైనది

ఇదీ చదవండి: స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 

8:49 AM, Nov 28, 2023
చంద్రబాబు సచ్చీలుడని కోర్టు చెప్పలేదు: ఎంపీ మార్గాని భరత్‌

  • స్కిల్‌ స్కాం కేసులో ఏసీబీ కోర్టు అన్ని విషయాలను పరిశీలించింది
  • తప్పు జరిగిందని నిర్ధారించుకున్నాకే చంద్రబాబుకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది
  • న్యాయస్థానాలేమీ చంద్రబాబు సచ్చీలుడని బెయిల్‌ ఇవ్వలేదు
  • స్కిల్‌ స్కాం జరిగింది కాబట్టే సెంట్రల్‌ జైలులో 52 రోజులు రిమాండ్‌లో ఉన్నారు
  • స్కిల్‌ స్కామ్‌ జరగలేదని స్పష్టంగా ఎక్కడా చంద్రబాబు తరఫు న్యాయవాదులు చెప్పడం లేదు
  • చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో ప్రజాధనం రూ.375 కోట్లను అడ్డదార్లలో ఇంటికి సూట్‌ కేసుల ద్వారా రప్పించుకున్నది వాస్తవం కాదా?
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో తామేమీ ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ కంపెనీ స్పష్టంగా చెప్పింది

7:11 AM, Nov 28, 2023
నేడు సుప్రీంకోర్టు ముందుకు స్కిల్‌ స్కాం కేసు

  • స్కిల్‌ స్కాంలో ఇప్పటివరకు ఏం జరిగింది?
  • టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్‌ స్కాం
  • నిరుద్యోగులకు శిక్షణ పేరిట తెరపైకి ఓ ఒప్పందం
  • జర్మనీ కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ సీమెన్స్‌తో ఒప్పందం అంటూ ప్రచారం
  • సీమెన్స్‌ 90% ఇస్తుందని, తాము కేవలం 10% మాత్రమే చెల్లించాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్రచారం
  • ఆఘామేఘాల మీద 10% వాటా కింద రూ.371 కోట్లు మధ్యవర్తి కంపెనీలకు చెల్లింపు
  • అధికారులు అంగీకరించకపోయినా బలవంతం చేసిన చంద్రబాబు, స్వయంగా 13 చోట్ల సంతకాలు, ఇదే విషయాన్ని ఫైళ్లలో రాసిన అధికారులు
  • షెల్ కంపెనీల ద్వారా  రూ 241 కోట్ల పక్కదారి
  • విచారణలో అసలు తమకు ఒప్పందంతో సంబంధమే లేదని లిఖిత పూర్వకంగా తెలిపిన సీమెన్స్‌
  • పన్ను చెల్లించకపోవడంతో కుట్రను గమనించిన డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్)
  • ఆధారాలు సేకరించి నాటి చంద్రబాబు ప్రభుత్వానికి కుంభకోణం జరిగిందని తెలిపిన GST
  • విషయం బయటకు రావడంతో తేలు కుట్టిన దొంగలా చంద్రబాబు
  • స్వయంగా దర్యాప్తు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన GST శాఖ
  • నిధులన్నీ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పక్కదారి పట్టాయని గుర్తించిన ఇన్‌కమ్‌టాక్స్‌ శాఖ
  • కొల్లగొట్టిన సొమ్ములో రూ. 27 కోట్లు నేరుగా టీడీపీ బ్యాంకు ఖాతాకు చేరినట్టు బ్యాంకు స్టేట్‌మెంట్లను గుర్తించిన CID
  • రికార్డులను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడి
  • ఈ కుంభకోణంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ విచారణ చేపట్టి పలువురి అరెస్ట్
  • చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 and 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు
  • సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) కింద నోటీస్ ఇచ్చిన సీఐడీ
  • 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద సెప్టెంబర్‌ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు
  • సెప్టెంబర్‌ 10న రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలింపు
  • ఐదు పర్యాయాలు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు
  • రిమాండ్‌ ఖైదీగా 7691 నెంబర్‌తో 52 రోజులపాటు చంద్రబాబు
  • కంటికి శస్త్ర చికిత్స అభ్యర్థన మేరకు మానవతా దృక్ఫథంతో అక్టోబర్‌ 31వ తేదీన నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • నవంబర్‌ 20న రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు
  • హైకోర్టు బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేసిన CID
  • నేడు విచారణకు రానున్న CID పిటిషన్‌
     

7:00 AM, Nov 28, 2023
ఢిల్లీలో దిగగానే రాజకీయం షురూ.!
ఢిల్లీకి చంద్రబాబు రాగానే ఎయిర్‌పోర్టుకు వచ్చేసిన రఘురామ కృష్ణరాజు
హైదరాబాద్‌లోనూ చంద్రబాబును కలిసిన రఘురామ కృష్ణరాజు
వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తోన్న రఘురామ కృష్ణరాజు
గత కొన్నాళ్లుగా తెలుగుదేశం ఎజెండాను ఫాలో అవుతోన్న రఘురామ కృష్ణరాజు
ఎల్లోమీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేయడంలో సిద్ధహస్తుడైన రఘురామ
అబద్దాలు, అసత్యాలు, నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్న రఘురామ
చంద్రబాబు కోసం ఢిల్లీలో లాయర్ల ఆఫీసులు తిరిగిన రఘురామ
లోకేష్‌ ఢిల్లీలో ఉన్నన్నాళ్లు కావాల్సిన ఏర్పాట్లు చేసిన రఘురామ

6:59 AM, Nov 28, 2023
ఢిల్లీకి చంద్రబాబు

  • టిడిపి లాయర్‌ సిద్ధార్థ లుథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు
  • చంద్రబాబుతో పాటు వెంట వెళ్లిన నారా భువనేశ్వరి
  • రేపు సుప్రీంకోర్టు ముందుకు బెయిల్‌ రద్దు పిటిషన్‌
  • ఇదే వారంలో సుప్రీంకోర్టు ముందుకు సెక్షన్‌ 17ఏ కేసు
  • క్వాష్‌ పిటిషన్‌పై కోటి ఆశలు పెట్టుకున్న చంద్రబాబు
  • ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు స్వాగతం పలికిన కనకమేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రఘురామకృష్ణంరాజు, రామ్మోహన్ నాయుడు తదితరులు

6:56 AM, Nov 28, 2023
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ 

  • జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ
  • స్కిల్ కేసులో బాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
  • ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన సీఐడీ
  • బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్

6:53 AM, Nov 28, 2023
ఈనెల 30న తిరుమల వెళ్లనున్న చంద్రబాబు

  • డిసెంబర్ 1న ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • అదే రోజు అమరావతి తిరిగిరానున్న చంద్రబాబు
  • తర్వాత రోజుల్లో విజయవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న చంద్రబాబు
  • సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లనున్న చంద్రబాబు
  • డిసెంబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాలకు చంద్రబాబు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement