Nov 29th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌ | TDP Chandrababu Cases, Petitions And Political Updates 29 November | Sakshi
Sakshi News home page

Nov 29th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Published Wed, Nov 29 2023 6:55 AM | Last Updated on Wed, Nov 29 2023 6:55 PM

TDP Chandrababu Cases Petitions And Political Updates 29 November - Sakshi

TDP Chandrababu Cases Petitions And Political Updates..

6:42 PM, Nov 29, 2023
బయటపడ్డ పచ్చ పార్టీ బాగోతం

  • దొంగ ఓట్లతో గెలుపొందాలనే కుట్రకు వైసీపీ చెక్
  • ఏకంగా 16 లక్షల ఓట్లను రీఎన్‌రోల్ మెంట్ చేయించిన టీడీపీ
  • తెలంగాణాలోని వారి ఓట్లు ఏపీలోనూ నమోదు
  • సైకిల్ పార్టీ కుట్రలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన మంత్రులు
  • ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
  • రాజ్యాంగం ప్రకారం పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి
  • చంద్రబాబు మాత్రం 16 లక్షల మంది ఓట్లను రెండు రాష్ట్రాల్లో నమోదు చేయించారు
  • ఒక్క తెలంగాణా, ఏపీలో రెండు చోట్ల నమోదయిన ఓట్లే 16 లక్షలు
  • మరికొన్ని లక్షల ఓట్లు కర్ణాటక, తమిళనాడులో నమోదై కూడా ఉన్నాయి. మరీ విచిత్రం ఏంటంటే.. ఎప్పుడో దేశాన్ని
  • వదిలేసి వెళ్లి వేరే దేశంలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడిన వారి ఓట్లను కూడా ఏపీలో నమోదు చేయించారు

6:22 PM, Nov 29, 2023
బీటెక్‌ రవికి బెయిల్‌

  • బీటెక్ రవికి బెయిల్ మంజూరు చేసిన కడప కోర్టు
  • పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవిని పాత కేసులో ఈ నెల 14న అరెస్ట్ చేసిన పోలీసులు
  • నారా లోకేష్‌ పర్యటనలో పోలీసులపై దౌర్జన్యం చేసిన బీటెక్‌ రవి
  • బీటెక్‌ రవి దాడిలో ఓ పోలీసు కాలుకు గాయం, ఫ్యాక్చర్‌
  • క్రికెట్‌ బెట్టింగ్‌ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీటెక్‌ రవి
  • ఎమ్మెల్సీగా గెలిచిన సమయంలో సింహాద్రిపురంలో బీటెక్‌ రవి వివాదస్పద వ్యాఖ్యలు
  • "జూదం మా బ్లడ్‌లోనే ఉంది" అంటూ నాడు బీటెక్‌ రవి వ్యాఖ్యలు
  • టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీటెక్‌ రవి దందాలు, దౌర్జన్యాలు

6:15 PM, Nov 29, 2023
ఎస్సీలంతా YSRCPకే ఓటేస్తే పరిస్థితి ఎలా?

  • గుంటూరు తెదేపా కార్యాలయంలో ఎస్సీ విభాగం సమావేశం
  • తెలుగుదేశం కార్యాలయంలో భేటికి హాజరైన టిడిపి, జనసేన నేతలు
  • ఎస్సీల ఓట్లన్నీ YSRCPకే పడతాయని ప్రచారం జరుగుతోంది
  • తెలుగుదేశం, జనసేన ఉధృతంగా ప్రచారం చేయాలి
  • మరో సారి ఎస్సీలంతా YSRCPకే అవకాశం ఇస్తే మన పరిస్థితి ఏంకావాలి?
  • తెలుగుదేశం, జనసేన పొత్తు జయప్రదం చేయడానికైనా ఎస్సీలు కలిసిరావాలి
     

5:45 PM, Nov 29, 2023
రేపు తిరుపతికి చంద్రబాబు

  • అమరావతి : రేపు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు
  • డిసెంబర్ 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు
  • దర్శనం తర్వాత తిరుపతి నుంచి విజయవాడకు చంద్రబాబు

5:20PM, Nov 29, 2023
చంద్రబాబు చరిత్ర అంతా నేరాల మయమే : అనిల్‌కుమార్‌ యాదవ్‌

  • కృష్ణాజిల్లాలో మాట్లాడిన మాజీ మంత్రి,అనిల్ కుమార్ యాదవ్
  • సామాజిక సాధికార యాత్ర ఎందుకో రాష్ట్రమంతా పర్యటించి తెలియజేస్తున్నాం
  • బిసిలను గుండెల్లో పెట్టుకుని చూస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పాడు
  • చెప్పిన మాట ప్రకారం ప్రతీ పదవుల్లో 50% శాతం అవకాశం కల్పించారు
  • 40 ఏళ్లుగా టీడీపీ నేతల గుండెల్లో బిసిలమైన మేము సున్నాలమే 
  • మీ దృష్టిలో సున్నాలమైన మమ్మల్ని జగన్ మోహన్ రెడ్డి నాయకులను, మంత్రులను చేశారు
  • మన తరాలు...తలరాతలు మారాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
  • చంద్రబాబు గతంలో ఎంతమందికి కత్తెరలు,ఇస్త్రీపెట్టెలు ఇచ్చాడు
  • ఓ పది వేల మందికి కత్తెరలు, ఇస్త్రీపెట్టెలతో మసిపూసి మారేడుకాయ చేశారు
  • నేను మీకు మంచి చేస్తేనే ఓటేయండని చెప్పే ధైర్యం జగనన్నకు తప్ప ఎవరికైనా ఉందా
  • ప్రజలను ముంచేందుకు మళ్లీ తండ్రీ కొడుకులు రెఢీ అవుతున్నారు
  • చంద్రబాబు మత్స్యకారుడిని తోలుతీస్తానన్నాడు
  • జగన్ మోహన్ రెడ్డి మత్స్యకారుడిని రాజ్యసభకు పంపించారు
  • రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నారు
  • విశాఖలో బోట్లు తగలబడితే కేవలం నాలుగు రోజుల్లో వారికి సాయం అందించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
  • 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం
  • కులం పేరుతో ఒకాయన పార్టీ పెట్టాడు
  • చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తానంటున్నాడు
  • కాపులంతా ఆలోచన చేయాలి
  • రాబోయే ఎన్నికలు బక్కవాడికి...బలిసినోడికి మధ్య యుద్ధం
  • తండ్రిని అరెస్ట్ చేస్తే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్
  • స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఒక్క బిసి మంత్రి కూడా లేడు
  • కానీ జగన్ మోహన్ రెడ్డి ఒక బిసినైన నన్ను మంత్రిని చేశారు
  • గొర్రెలు,పశువులు కాసేవాడికి పదవులిచ్చారని టీడీపీ నేతలు ఎగతాళి చేశారు
  • ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా గొర్రెలు,పశువుల కాపరే
  • ఏసు ప్రభువు పుట్టింది కూడా పశువుల పాకలోనే
  • మాలాంటి గొర్రెలు,పశువులు కాసే వ్యక్తులు పాలు పితికి ఇస్తే...వాటి పై సంపాదించిన వేలకోట్లే మీ హెరిటేజ్ ఆస్తి

4:50PM, Nov 29, 2023
లోకేష్ పై మంత్రి అంబటి ఫైర్

  • తూర్పు గోదావరి : లోకేష్ పాదయాత్ర ఓ కామెడీ షో
  • ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నారు
  • టీడీపీ కి లోకేష్ శనిలా దాపురించారు : అంబటి

4:05PM, Nov 29, 2023
YSRCPది నమ్మకం, TDPది మోసం

  • కురుపాంలో వైఎస్సార్‌సిపి బస్సు యాత్ర
  • ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్ : వైసీపీ నేతలు
  • హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబువి గోబెల్స్‌ ఆలోచనలైతే ... సీఎం జగన్‌వి గ్లోబల్ ఆలోచనలు
  • రాష్ట్రంలో ఎవరిని అడిగినా జగనన్నే భవిష్యత్తు అంటున్నారు
  • బాబూ.. మీదంతా నాటకం అంటున్నారు
  • అర్హులైన అందరికీ సంక్షేమ పధకాలు అందించిన నాయకుడు జగన్
  • చంద్రబాబు మాటలు నమ్మితే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టే
  • నిజం చెప్పే అలవాటు చంద్రబాబుకు లేదు
  • చంద్రబాబు మేనిఫెస్టో వెబ్ సైట్ లో ఉండదు
  • మా పాలనలో మేలు జరిగితేనే ఓటు వేయండని జగన్ చెబుతున్నారు
  • జగన్‌ను ఓడిస్తామంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు
  • జగన్ ఢీ కొట్టేందుకు వీరంతా ఒక్కటవుతున్నారంటేనే అయన బలం అర్ధమవుతుంది
  • వైఎస్ జగన్ కు జనబలమే ఆయుధం
     

3:45PM, Nov 29, 2023

  • మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్‌కు సీఐడీ జారీ చేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌
  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో ఏ-19గా ఉన్న వరుణ్‌
  • కౌంటర్‌ దాఖలు చేయటానికి సమయం కోరిన సీఐడీ
  • తదుపరి విచారణ డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా

3:40PM, Nov 29, 2023

  • ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
  • తదుపరి విచారణ శుక్రవారం(డిసెంబర్‌1కి)వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

3:30PM, Nov 29, 2023

  • స్కిల్‌ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
  • కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసిన ఉండవల్లి
  • కొందరికి మాత్రమే నోటీసులు అందాయన్న పిటిషనర్‌ తరఫు లాయర్లు
  • తదుపరి విచారణ డిసెంబర్‌ 30కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

3:20PM, Nov 29, 2023
చంద్రబాబు కేసు : సుప్రీంకోర్టులో వాయిదా

  • చంద్రబాబుకు ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
  • తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసిన ధర్మాసనం
  • చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌
  • కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్‌
  • తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా

3:10PM, Nov 29, 2023
నారాయణ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా

  • అసైన్డ్‌ భూముల కుంభకోణంలో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
  • మాజీ మంత్రి నారాయణ ఆయన బినామీలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
  • తదుపరి విచారణ డిసెంబర్‌ 11కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

1:56 PM, Nov 29, 2023
పవన్‌ కళ్యాణ్‌ను రాజకీయనాయకుడిగా లెక్కలోకి తీసుకోవడం లేదు

  • విజయవాడలో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
  • ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో  పాటే జరుగుతాయి
  • అట్టడుగు వర్గాల రాజకీయ  సాధికారత సాధించడమే  సీఎం  జగన్ లక్ష్యం
  • అవకాశాలు  పెరుగుతున్నప్పుడు సాంకేతికత  వచ్చినపుడు  కులవృత్తులు  కూడా  మారుతాయి.
  • కత్తెర్లు, ఇస్త్రిపెట్టెలు ఇచ్చి సరిపెట్టుకోమంటున్న చంద్రబాబుకు  మద్దతు ఇవ్వాలా?
  • లేక ఉన్నత చదువు.. మారుతున్న  భవిష్యత్  వైపు  అడుగులు  వేయిస్తున్న జగన్ కావాలా? అనేది ఆలోచించాలి
  • ఎన్నికల  సమయంలో  చంద్రబాబు ఒకటి కాదు  మూడు  చేస్తామని  చెప్తాడు
  • జగన్  రూపాయి చేస్తే  చంద్రబాబు  పది  చేస్తానంటారు
  • ప్రభుత్వం వల్ల  మేలు  జరిగింది  అని  నమ్మితేనే  ఓట్లేయమబే నాయకుడు జగన్ మాత్రమే
  • ఇలాంటి వారిని రాజకీయాలలో ఎప్పుడైనా చూశారా?
  • బిసిల  అభ్యున్నతికి జగన్ ఏం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
  • అట్టడుగు వర్గాలు సొంతంగా ఎదగాలనేది సీఎం జగన్ ఆలోచన.
  • అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చేలా చేయూత ఇస్తున్నారు.
  • ఎన్నికలప్పుడు చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారు
  • స్వార్థపూరిత ఆలోచనలతో హామీలు ఇస్తున్నారు
  • ఎన్నికలప్పుడు చిల్లర వేషాలు వేసే నాయకులు కావాలా?
  • పూర్తి స్థాయి చేయూత అందించే వారు కావాలా?
  • జగన్ రూపాయి చేస్తే నేను 10 రూపాయలు చేస్తా అని చంద్రబాబు అంటున్నారు
  • 2014-19 మధ్యలో ఎందుకు చేయలేదు?
  • నావల్ల మేలు జరిగితేనే ఓటు వేయండి అని జగన్ అడుగుతున్నారు
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం
  • పవన్ కళ్యాణ్ ను మేము లెక్కల్లోకి తీసుకోవడం లేదు
  • చంద్రబాబు కావాలా? జగన్ కావాలా? తేల్చుకోవాలి

1:56 PM, Nov 29, 2023
చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కలవకూడదని YSRCP ప్రయత్నించింది: లోకేష్‌
పాదయాత్రలో లోకేష్‌ చేసిన ప్రకటన వెనక అసలు వాస్తవాలేంటీ?

అయ్యా.. లోకేషం.. కళ్లు తెరువు నాయనా : YSRCP

  • మీ టాలెంట్‌పై మీ నాన్నకే నమ్మకం లేదని ఇంకెప్పుడు మీకు అర్థమవుతుంది?
  • కొడుకు లోకేష్‌కు అంత సత్తా లేదని చంద్రబాబుకు అర్థమయ్యాకే దత్త పుత్రుడు పవన్‌కళ్యాణ్‌ను పట్టుకున్నారు
  • పవన్‌కళ్యాణ్‌ సపోర్ట్‌ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసే సీన్‌ లేదని తెలిసే పొత్తు నాటకం ఆడుతున్నారు
  • నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కడతారని మీరు భావిస్తే.. సింగిల్‌గా ఎందుకు పోటీ చేయరు?
  • మీకు పవన్‌ కళ్యాణ్‌, జనసేన సపోర్ట్‌ ఎందుకు?
  • నిటారుగా నిలబడే శక్తి లేక.. సపోర్ట్‌ స్టిక్‌గా పవన్‌ కళ్యాణ్‌ను పట్టుకున్నారా?
  • పైగా మీకు మరో సపోర్ట్‌ బీజేపీ కావాలా?
  • పోటీ చేయాలంటే మీకు ఇన్ని సాయాలు కావాలా?
  • ఇంకొకరిమీద నిందలేసేకంటే మీ ఇల్లు చక్కదిద్దుకోండి
  • మీ పార్టీ మీద ఇప్పటికైనా మనసు పెట్టండి
  • భవిష్యత్తులోనైనా ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన తెచ్చుకోండి
  • లోకేష్‌.. మీరు కళ్లు తెరవకపోతే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా పవన్‌ కళ్యాణ్‌కు కట్టబెట్టేస్తారు మీ నాన్న చంద్రబాబు
  • నాయకుడిగా ఎదగకపోతే మీకెప్పటికీ విశ్వసనీయత ఉండదు


(ఇటీవల సమన్వయ కమిటీ సమావేశంలో పవన్‌ మాట్లాడుతుండగా అలకిస్తోన్న లోకేష్‌)

1:06 PM, Nov 29, 2023
ఓటుతో తెలుగుదేశం దుర్మార్గ రాజకీయాలు: మంత్రి జోగి రమేష్

  • ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ వాళ్లు మాపై ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు
  • లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు చెబుతారు
  • లక్షల ఓట్లు చేర్పించారని ఇంకోరోజు రాయిస్తారు
  • ఎలాగో ఓడిపోతామని తెలిసే ఇలాంటి రాతలు రాయిస్తున్నారు
  • ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని మేం మొదటి నుంచి చెబుతున్నాం
  • ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం
  • తెలుగుదేశం దురుద్దేశపూర్వకంగా కొందరికి రెండు, మూడు చోట్ల ఓట్లు చేర్పించినట్టు తెలిసింది
  • తెలంగాణలో ఉన్నవారి ఓట్లను కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు
  • ఈ అక్రమాలకు పక్కా ప్లాన్‌తో టిడిపి చేయిస్తోంది
  • వీటిపై మళ్లీ పచ్చమీడియాలో వార్తలు రాయిస్తోంది
  • ఎన్నికల సంఘం విచారణలో ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి
  • ప్రతీ ఓటును ఆధార్‌తో లింకు చేస్తే తెలుగుదేశం దుర్మార్గాలన్నీ బయటకు వస్తాయి
  • 70 రోజులు పారిపోయిన లోకేష్.. మంత్రులకు భయం చూపుతాడా?
  • వచ్చే ఎన్నికల్లో మేమే లోకేష్‌ రాజకీయ భవిష్యత్తుకు పుల్‌స్టాప్‌ పెడతాం

12:39 PM, Nov 29, 2023
చంద్రబాబు, లోకేష్‌లకు అడ్డం తిరిగిన టిడిపి ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్‌

  • తెలుగుదేశం పార్టీని నమ్మి ఎవరూ మోసపోవద్దు.: శ్రవణ్‌
  • అసలు అమరావతి పేరిట రైతులను నట్టేట ముంచింది తెలుగుదేశం పార్టీనే
  • భూములిచ్చిన రైతులను ఘోరంగా మోసం చేసింది తెలుగుదేశం పార్టీనే
  • 28వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాగేసుకున్నారు..
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాల రైతుల కన్నీళ్లకు కారణమైన దానికి మొదటి ముద్దాయి చంద్రబాబే
  • ఏ మేధావి వచ్చినా నేను  చర్చకు సిద్ధం : జడ శ్రవణ్‌
  • అమరావతిని నాశనం చేసింది తెలుగుదేశమే : జడ శ్రవణ్‌
  • రాజధాని పేరిట అన్ని అరిష్టాలకు, దరిద్రాలకు కారణం చంద్రబాబు, తెలుగుదేశమే
  • లోకేష్‌.. నీకు బుద్దుందా? : జడ శ్రవణ్‌
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఓటేసిందని శ్రీదేవిని స్టేజీ ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుంటారా?
  • మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ ఇన్‌ఛార్జీని బకరా చేస్తారా?
  • ఇదా తెలుగుదేశం నైజం.?
  • సిగ్గుండాలి.. మీకు.. పైకి మీరు చెప్పేది నిష్పక్షపాత రాజకీయమా?
  • రాజకీయాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి వ్యభిచారమైనా చేస్తారా?
  • తండ్రీ కొడుకులు రాజకీయ వ్యభిచారంలో గిన్నీస్‌ బుక్‌ ఎక్కుతారు..!
  • వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో అన్నదానికి తెలుగుదేశం ప్రత్యక్ష ఉదాహరణ
  • డబ్బుతోనే మీ రాజకీయం నడుపుదామనుకుంటే.. మీరసలు నాయకులే కాదు
  • రాజకీయం అంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి
  • మీకు అసలు మీ పార్టీ క్యాడర్‌ ఎవరో తెలుసా? కార్యకర్తలెవరో తెలుసా?


(ఫైల్‌ ఫోటో : ఇటీవల లోకేష్‌తో జడ శ్రవణ్‌)

12:19 PM, Nov 29, 2023
వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌.. కాదని చెప్పలేరు.! అవునని చెప్పలేరు..!

  • చంద్రబాబుకు ఇరకాటంగా మారిన ఓటుకు కోట్లు కేసు
  • ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు, విచారణ జనవరి రెండోవారానికి వాయిదా
  • ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్
  • కేసు దర్యాప్తును CBIకి బదిలీ చేయాలని మరొక పిటిషన్
  • విచారణ జరిపిన జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్  ధర్మాసనం
  • ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులోనూ చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావన
  • "మనోళ్లు బ్రీఫ్డ్‌ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
  • ఇప్పటివరకు ఈ వాదనను ఖండించని చంద్రబాబు
  • "నేను నిప్పు" అంటారు తప్ప "వాట్‌ ఐ యామ్‌ సేయింగ్‌" గురించి చెప్పని చంద్రబాబు
  • "మా నాన్న తప్పు చేయలేదు, మా మీద రాజకీయ కక్ష" అని లోకేష్‌ అంటారు కానీ, ఓటుకు కోట్లు కేసును జాగ్రత్తగా ప్రస్తావించకుండా పక్కకు తప్పుకుంటోన్న లోకేష్‌
  • ఇప్పటివరకు ఒక్క బహిరంగసభలోనూ ఈ విషయంపై మాట్లాడని తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌
  • బాలకృష్ణ చేసిన "అన్‌స్టాపబుల్‌ బాలయ్య" ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ వెన్నుపోటు గురించి చర్చించారు కానీ, ఓటుకు కోట్లును దాచిపెట్టిన బావ, బావమరుదులు
  • అసలు నిజాలు దాచి పెట్టి "నేను నిప్పు" అంటే ఎలా? జనమంతా మిమ్మల్ని "మీరు తుప్పు" అని ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర చెప్పుకోడానికి ఏమి లేదా?

12:01 PM, Nov 29, 2023
నారాయణ పిటిషన్‌ వాయిదా

  • అసైన్డ్ భూముల కేసులో మాజీమంత్రి నారాయణ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
  • నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లపై విచారణ వాయిదా

11:55 AM, Nov 29, 2023
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమ మలుపుల కేసు @ హైకోర్టు

  • ఐఆర్‌ఆర్ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా
  • ఐఆర్‌ఆర్ మాస్టర్‌ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు
  • చంద్రబాబు తరపున ఇప్పటికే వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది నాగముత్తు
  • విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు
  • CID అభియోగాల్లో ముఖ్యమైన అంశాలు
  • టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణమే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు
  • కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే
  • లింగమనేని కుటుంబంతో క్విడ్‌ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌లో భూములు
  • స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మూడుసార్లు మార్పు 
  • అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్‌ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకో
  • 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు 
  • అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం
  • ఇన్నర్‌రింగ్‌ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలో అలైన్‌మెంట్‌
  • కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబుకు అప్పగించిన లింగమనేని
  • కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం
  • లింగమనేని రమేశ్‌ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఏడేళ్లుగా నివాసం
  • సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు

11:23 AM, Nov 29, 2023
 స్కిల్‌ కేసులో ఉండవల్లి పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

  • స్కిల్‌ స్కాం కేసులో మరింత లోతుగా విచారణ జరిపించడంతో పాటు సీబీఐకి ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్‌
  • కొందరికే నోటీసులు అందాయని, మరి కొందరికి అందలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన పిటిషనర్ తరఫున న్యాయవాదులు
  • 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చాం
  • మిగతా వారి అడ్రస్‌లు తప్పుగా ఉండటంతో అవి చేరలేదని కోర్టుకు తెలిపిన రిజిస్ట్రార్
  • వీరికి పర్సనల్ నోటీసులు ఇవ్వటానికి అనుమతి కోరిన పిటిషనర్
  • కొత్త అడ్రసులతో మళ్లీ ఫ్రెష్ నోటీసులు ఇవ్వటానికి అనుమతి ఇచ్చిన కోర్టు
  • తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా వేసిన హైకోర్టు

11:03 AM, Nov 29, 2023
చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు.. విచారణ వాయిదా

  • చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో సుప్రీంకోర్టులో విచారణ
  • తదుపరి విచారణ జనవరి రెండోవారానికి వాయిదా వేసిన ధర్మాసనం
  • ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ 
  • కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ 
  • "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
  • ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో  చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి 
  • కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది
  • ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్‌లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి 
  • అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లో వినతి

10:54 AM, Nov 29, 2023
చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ
  • అసైన్డ్‌ భూముల కుంభకోణంలో మాజీ మంత్రి నారాయణ, ఆయన బినామిలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ

10:06 AM, Nov 29, 2023
నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ

  • ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ 
  • కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ 
  • విచారణ చేయనున్న జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్  ధర్మాసనం
  • "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదే అని ఇదివరకే నిర్ధారించిన ఫోరెన్సిక్
  • ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో  చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి 
  • కానీ చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది
  • ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్‌లో పేర్కొన్న రామకృష్ణారెడ్డి 
  • అందుకే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లో వినతి

9:23 AM, Nov 29, 2023
తెలుగుదేశం హామీలు, వాగ్దానాలంటే ఇలా ఉంటాయి మరి.!

  • చంద్రబాబు అరెస్ట్ అయితే 150 మంది చనిపోయారు అని చెప్పినారు అని పచ్చ మీడియాలో తెగ ప్రచారం చేశారు.
  • వాళ్లకు భువనేశ్వరి చనిపోయిన కుటుంబాలను పరామర్శ చేసి ఆర్ధిక సాయం చేస్తారని దండోరా వేశారు
  • నిజం గెలవాలి అని భువనేశ్వరీని రంగంలోకి దింపారు
  • 3 కుటుంబాలకు చెరో మూడు లక్షలు ఇవ్వగానే ఖర్చు పెరిగిపోయిందని గుర్తొచ్చింది
  • మిగిలిన 147 మంది సంగతి వ్యూహాత్మకంగా మరిచిపోయారు
  • బెయిల్‌ వచ్చింది కాబట్టి మిగతా వాళ్ల సంగతి ఆక్‌..పాక్‌..కరివేపాక్‌..!
  • అంతేలే.. వాళ్ల ఘన చరిత్ర తెలియంది కాదు
  • 2014లో అయితే ఏకంగా మ్యానిఫెస్టో మాయం చేశారు
  • ఎన్నో చెబుతారు.. అన్నీ సందర్భాన్ని బట్టి మరిచిపోతారు.. జనం కూడా మరిచిపోయారనుకుని మళ్లీ మాయమాటలు చెబుతున్నారు

7:38 AM, Nov 29, 2023
సెక్షన్‌ 17aతో ముడిపడిన చంద్రబాబు భవితవ్యం

  • సెక్షన్‌ 17aతో ముడిపడి ఉన్న చంద్రబాబు కేసులు
  • స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం
  • స్కిల్‌ కేసులో అరెస్ట్‌ కాగానే సెక్షన్‌ 17a రాగం అందుకున్న చంద్రబాబు
  • తప్పు చేయలేదని చెప్పకుండా.. అరెస్ట్‌ చేయాలంటే గవర్నర్‌ అనుమతి తీసుకోవాలంటూ మెలిక
  • నేరం జరిగింది, దర్యాప్తు మొదలయింది 17a కంటే ముందే అని చెప్పిన వినిపించుకోని చంద్రబాబు
  • సుప్రీంకోర్టులో సెక్షన్‌ 17aపై సుదీర్ఘ వాదనలు
  • CID తరపున ముకుల్‌ రోహత్గీ, చంద్రబాబు తరపున హరీష్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • వేర్వేరు కేసుల్లో సెక్షన్‌ 17aకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించిన ఇరు పక్షాలు
  • సెక్షన్‌ 17aను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశం ఉందంటున్న రాజ్యాంగ నిపుణులు
  • చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన తప్పించుకునే అవకాశం ఉండరాదంటున్న నిపుణులు
  • సెక్షన్‌ 17aపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి వేర్వేరు కేసుల్లో ముందడుగు

7:09 AM, Nov 29, 2023
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన

  • ముఖ్య నేతల అపాయింట్‌మెంట్లు లేక నిరాశతో తిరుగు ప్రయాణం
  • ఢిల్లీలోని జాకీర్‌హుస్సేన్‌ మార్గ్‌లో ఉన్న ప్రముఖ హోటల్‌లో బస చేసిన చంద్రబాబు
  • మంగళవారం ఉదయం టీడీపీ ఎంపీలు కనక­మేడల రవీంద్రకుమార్, కేశినేని నాని, రామ్మో­హన్‌నాయుడులతో భేటీ
  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • అనంతరం సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయ­వాదులు గుంటూరు ప్రభాకర్, గుంటూరు ప్రమోద్, ప్రేరణ తదితరులు కలిశారు.
  • సుప్రీంకోర్టులో ఉన్న స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ కేసు, ఫైబర్‌నెట్‌ కేసులపై న్యాయ­వాదులతో చర్చ
  • సోమవారం మధ్యా­హ్నం తన సతీమణితో కలిసి ఢిల్లీకి వచ్చిన చంద్ర­బాబు
  • సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమా­రుడి వివాహ విందుకు హాజరు
  • ఈ పర్యటనలో పలువురు ముఖ్య నేతలను ఆయన కలుస్తారనే ప్రచారం జరిగింది
  • కానీ, ఎవరి అపాయింట్‌మెంట్లు లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన చంద్రబాబు

7:01 AM, Nov 29, 2023
లోకేష్‌ చెబుతున్నదేంటీ? వాస్తవాలేంటీ?

  • లోకేష్‌ : స్కిల్‌ కేసులో ఒక్క ఆధారమైనా చూపించారా? మా పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా?
  • వాస్తవాలు:
  • 3300  కోట్ల ‘స్కిల్‌’ ప్రాజెక్టుతో మాకు సంబంధం లేదు అని  సీమెన్స్‌ కంపెనీ చెప్పింది
  • ఆ పేరుతో టెండర్ లేకుండా రూ.371  కోట్లు పక్కదారి పట్టించారు
  • ఈ స్కిల్ కుంభకోణం లో కేంద్ర సంస్థ ED నలుగురిని అరెస్ట్ చేసింది
  • చెన్నప్ప అనే వ్యక్తి ద్వారా సుమన్‌ బోస్‌కు డబ్బు చేరినట్టు ఆధారాలు సేకరించింది
  • వారి మధ్య కోడ్‌ భాషలో నిధుల హవాలా జరిగినట్టు తేల్చింది
  • రూ.371 కోట్ల స్కిల్ కుంభకోణంలో రూ.241 కోట్లు హవాలా మార్గంలో 6  షెల్ కంపెనీల ద్వారా  మళ్లీ బాబుకు చేరినట్టు తేల్చింది
  • ఈ స్కిల్‌ కుంభకోణం డబ్బులో  రూ.65.86 కోట్లు టీడీపీ ఖాతాలకు చేరాయి
  • ఒకసారి అమరావతి కాంట్రాక్టర్లు కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకో లోకేష్‌
  • అమరావతి కాంట్రాక్టర్ల నుంచి రూ.600 కోట్ల సచివాలయం బిల్డింగ్ నిర్మాణ వ్యయంలో (20 శాతం) రూ.119 కోట్లు ముడుపులు బాబు  పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరి కి ఇచ్చానని కాంట్రాక్టర్ అయిన  షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెప్పాడు.
  • ఆగష్టు 4న  కేంద్ర సంస్థ ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు ఇచ్చింది
  • బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపినపుడు(ఫిబ్రవరి 13 ,2020) రూ.2 వేల కోట్ల అక్రమలావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు లబ్యమయ్యాయని ఫిబ్రవరి 17,2020 న ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ప్రెస్ నోట్ విడుదల చేశారు.
  • ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పడం లేదేందుకు లోకేష్‌?

6:59 AM, Nov 29, 2023
చంద్రబాబుకు ‘సుప్రీం’ నోటీసులు 

  • బెయిల్‌ రద్దుపై డిసెంబర్‌ 8లోగా లిఖితపూర్వక కౌంటరు దాఖలు చేయండి 
  • స్కిల్‌ కేసులో క్వాష్‌ పిటిషన్‌ తీర్పు తర్వాతే బెయిల్‌ రద్దుపై విచారణ 
  • జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టీకరణ 
  • తదుపరి విచారణ 11వ తేదీకి వాయిదా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement