Khaidi Number 7691: కస్టడీ పిటిషన్‌ వాదనలు రేపటికి వాయిదా | AP CID Petition On Chandrababu Amaravati Inner Ring Road Alignment Updates | Sakshi
Sakshi News home page

ఖైదీ నెంబర్‌ 7691.. బాబు కస్టడీ పిటిషన్‌ వాదనలు రేపటికి వాయిదా

Published Tue, Sep 12 2023 7:23 AM | Last Updated on Tue, Sep 12 2023 9:27 PM

AP CID Petition On Chandrababu Amaravati Inner Ring Road Alignment Updates - Sakshi

Updates..

09.12pm
రేపు సీఐడీ కస్టడీ పిటిషన్‌ విచారణ
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో.. ప్రధాన నిందితుడు చంద్రబాబు నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు(బుధవారం) ACB కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. చంద్రబాబు లాయర్లు ఈ పిటిషన్‌పై ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు.

08.32PM
అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు తరపున దాఖలైన పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. లిస్టింగ్‌లో ఈ పిటిషన్‌ మెన్షన్‌ చేసి ఉంది. ఈ స్కాంలో ఏ1గా చంద్రబాబు పేరు ఉన్న సంగతి తెలిసిందే.

07.38pm
క్వాష్‌తో పాటు హైకోర్టులో మరో రెండు!

► స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయడం, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను సస్పెండ్ చేయడం, ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్
► క్వాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో A1 గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ కోరుతూ మరో పిటిషన్
► అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఇంకొక పిటిషన్
► రేపు చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు


07.20pm
రేపు ఏ కోర్టులో ఏంటీ?

► ACB కోర్టు - చంద్రబాబు కస్టడీ కోరుతూ CID పిటిషన్‌
► హైకోర్టు - స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో తనను తప్పించాలంటూ చంద్రబాబు స్క్వాష్‌ పిటిషన్‌

07.15pm
చంద్రబాబు కేసు పత్రాలు చూసుకోవచ్చు

► చంద్రబాబు కేసు పత్రాలని పరిశీలించేందుకు ఆయన తరపు న్యాయవాదులకి అనుమతినిచ్చిన ఎసిబి కోర్టు
► CRPCలో 207 సెక్షన్ కింద నిన్న పిటిషన్ వేసిన చంద్రబాబు న్యాయవాదులు
► సరైన రూపంలో పిటిషన్ వేయాలన్న ACB కోర్టు, ఈ రోజు మరోసారి‌ పిటిషన్‌ దాఖలు
► కేసుకి సంబంధించిన పత్రాలని చూసేందుకు అనుమతించిన ACB కోర్టు

07.00pm
రేపు విజయవాడలో లాయర్ల సమ్మె

► రేపు విజయవాడ కోర్టులలో విధులు బహిష్కరిస్తున్న న్యాయవాదులు
► రేపు బెజవాడలోని అన్ని కోర్టులలో కార్యకలపాలు నిలిపివేయాలని లాయర్ల డిమాండ్‌
► రేపు అన్ని కేసుల విచారణపై లాయర్ల సమ్మె ప్రభావం ఉండే అవకాశం

06.15pm

ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కి భద్రత పెంపు

► ACB కోర్టు న్యాయమూర్తికి  4+1 ఎస్కార్ట్ భద్రత
► చంద్రబాబు కేసు విచారణతో భద్రత పెంచిన ఏపీ ప్రభుత్వం

05.54pm
ఇవాళ ఏసీబీ కోర్టుకు రాని చంద్రబాబు లాయర్‌ లూద్రా

► ఈ రోజంతా హైకోర్టులో స్వ్కాష్ పిటిషన్ పైనే దృష్టి పెట్టిన సిద్దార్ద లూద్రా
► హౌస్ రిమాండ్‌ పిటిషన్ తీర్పు సమయంలోనూ ఏసీబీ కోర్టుకి రాని వైనం

05.52pm

సీఐడీ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి.. !

► సీఐడీ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు
► స్క్వాష్ పిటీషన్ రూపంలో హైకోర్టుని ఆశ్రయించిన చంద్రబాబు న్యాయవాదులు
► చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని.. అత్యవసరంగా విచారించాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు
► రేపు విచారిస్తామన్న హైకోర్టు
► స్క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగితే ఏసీబీ కోర్టులో కస్టడీ పిటీషన్‌పై కౌంటర్ దాఖలు చేయకుండా సాగదీయాలని చంద్రబాబు తరపు న్యాయవాదుల ఆలోచన
► హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ సాకుగా చూపి.. రేపు ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్‌పై వాదనలు వాయిదా వేయించాలనే ఆలోచన

05.39pm
క్యాష్ పిటిషన్ చేసిన చంద్రబాబు లాయర్లు

► చంద్రబాబు అరెస్టుపై హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు తరఫున న్యాయవాదులు
► స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయడం, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ను సస్పెండ్ చేయడం, ఈ కేసులో స్టే ఇవ్వాలంటూ క్యాష్ పిటిషన్
► క్యాష్ పిటిషన్ తో పాటు హైకోర్టులో మరో రెండు పిటిషన్లు దాఖలు
► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణంలో A1 గా ఉన్న చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు
► అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం దాఖలైన మరొక పిటిషన్
► రేపు చంద్రబాబుకు సంబంధించిన మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ!

5.25pm
సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత

► రాజమండ్రి జైలు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు
► చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్యారక్‌లో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు
► జైలు పరిసర ప్రాంతాల్లో బ్యారీకేడ్లు ఏర్పాటు
► ఉదయం సాయంత్రం చంద్రబాబుకు వైద్య పరీక్షలు
► 24 గంటలు  పర్యవేక్షణలోనే చంద్రబాబు

5.15pm

చట్టంలో రెండు కస్టడీలు మాత్రమే ఉన్నాయి: ఏఏజీ సుధాకర్‌రెడ్డి
► చట్టంలో జ్యుడీషియల్, పోలీస్‌ కస్టడీ మాత్రమే ఉన్నాయి. 
► హౌస్‌ కస్టడీ అనేది CRPCలో లేనే లేదు
► ప్రైవేట్‌ హౌజ్‌లో.. జైలును మించిన భద్రత ఉండదు. 
► చంద్రబాబుకి జైలులో ఏ ఇబ్బంది ఉండదు

5.00pm
చంద్రబాబు హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌పై ACB కోర్టు తీర్పు సందర్భంగా.. 

► ఒకసారి కోర్టు రిమాండ్‌ విధించింది అంటే.. అది వ్యవస్థ బాధ్యత
► హౌస్ అరెస్ట్ కావాలని అడుగుతున్నారు. అక్కడ ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత ?
► ఇంట్లో వుండే భద్రత కంటే జైల్లో వుండే భద్రత ఎక్కువ
► జైల్లో భద్రత, సౌకర్యాలపై అన్ని అంశాలు స్పష్టంగా సిఐడి చెప్పిందన్న న్యాయమూర్తి
► జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తులకు NSG సెక్యూరిటీ ఇవ్వాలనే అంశాన్ని కోర్టులో చూపలేదు
► హౌస్ కస్టడీలో ఉంచేదుకు చట్టపరమైన  నియమ నిబంధనలను కోర్టు ఎదుట చూపలేదు
► ఈ కారణాలతో హౌస్ అరెస్టుకు సంబంధించిన పిటిషన్ కొట్టివేస్తున్నాం : ఏసీబీ కోర్టు

04.45PM
బాబు కట్టిన బ్లాక్‌లో బాబునే పెట్టారు: నారా భువనేశ్వరి

► ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మాది
► ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ కోసం కుటుంబం ఏకంగా ఉంటుంది
► ఆ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నాను
► చంద్రబాబు వయసు, హోదాకు గౌరవం ఇవ్వలేదు
► పెళ్లిరోజు చూసుకుని మరీ చంద్రబాబును అరెస్టు చేశారు
► కేసులో నిజంగా ఆధారాలు దొరికితే రెండున్నర ఏళ్లు ఎందుకు ఆగారు?
► రాజమండ్రి జైల్లో చంద్రబాబు కట్టిన బ్లాక్‌లోనే చంద్రబాబును పెట్టారు
► చన్నీళ్లతో స్నానం చేయాల్సి వస్తుందని చంద్రబాబు చెప్పారు
► చంద్రబాబు భోజనం సంగతి బాబు లోకేష్‌ చూసుకుంటున్నారు
► నా ఆరోగ్యం బాగుంది, మీరెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు చెప్పారు

04.38PM
చంద్రబాబు హౌజ్‌ కస్టడీ పిటిషన్‌ కొట్టివేత
స్కిల్‌ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు హౌజ్‌రిమాండ్‌ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. 
చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. 
సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బాబు తరపు న్యాయవాదులు వేసిన హౌజ్‌ రిమాండ్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

4:23PM
చంద్రబాబు రిమాండ్‌ కోసం జైలా? ఇల్లా?

► చంద్రబాబును ఇంట్లోనే ఉంచాలని.. వర్క్‌ఫ్రమ్‌ హోం తరహాలో.. రిమాండ్ చేయాలని హౌజ్‌ కస్టడీ పిటిషన్‌ వేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.
► ఏపీ సీఐడీ ఈ విజ్ఞప్తిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబుకు జైలే పదిలమని, ప్రభుత్వం ఆయన కోసం ప్రత్యేక సదుపాయాలు, చర్యలు తీసుకుంటోందని అంటోంది.

4:23PM
కాసేపట్లో హౌజ్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై విచారణ

► ఏసీబీ బెంచ్‌ మీదకు వచ్చిన న్యాయమూర్తి
► మరికాసేపట్లోనే చంద్రబాబు హౌజ్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై వివచారణ
► ఇరు పక్షాల వాదనలు ఇప్పటికే వినేసిన న్యాయమూర్తి

4:00PM
చంద్రబాబుపై నమోదైన 4 కేసులను కలిపి బెయిల్ పిటిషన్లు 
► చంద్రబాబుపై 4 కేసుల్లో  ఎఫ్ఐఆర్ లు నమోదు
► ఈ 4 కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని ఏపి హైకోర్టులో పిటిషన్లు 
► పిటిషన్లు దాఖలు చేసిన చంద్రబాబు తరపు లాయర్లు 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం
స్కిల్‌ కేసులో ఏ1గా 
అంగళ్లులో అల్లర్ల ఘటనపై నమోదుచేసిన కేసులో ఏ1
విజయనగరంలో నమోదయిన 307 సెక్షన్ కేసు

3.58PM
చంద్రబాబుతో కుటుం సభ్యుల ములాఖత్‌

స్కిల్‌ స్కాంలో ముద్దాయి చంద్రబాబు నాయుడిని ములాఖత్‌లో భాగంగా కలిసేందుకు కుటుంబ సభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌, కోడలు బ్రహ్మణి చంద్రబాబును కలిశారు.

3.47PM

మరికాసేపట్లో చంద్రబాబు హౌస్ రిమాండ్‌ పిటిషన్‌పై విచారణ

► ఏసీబీ కోర్టుకి చేరుకున్న అడిషనల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ జిపి వివేకానంద

3.40PM
కాసేపట్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్‌

► రాజమండ్రి జైలుకు వెళ్లిన వారు.. చంద్రబాబు భార్య భువనేశ్వరీ,  కొడుకు నారాలోకేష్‌, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి. తొలిరోజు ములాఖత్‌కు ముగ్గురికే అవకాశం ఇచ్చారు జైలు అధికారులు.

3.20pm
బాబు భద్రతపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు

► చంద్రబాబు భద్రత ఏపీ ప్రభుత్వానిది 
► ప్రత్యేక పర్యవేక్షణలో చంద్రబాబు ఉన్నారు. 
► రాజమండ్రి జైల్లో మావోయిస్టులు ఉన్నా.. చంద్రబాబు భద్రతలో ఇబ్బందులు లేవు
► మావోయిస్టుల్లో కొంత పరివర్తన వచ్చింది
► మావోయిస్టుల బ్లాక్..చంద్రబాబు బ్లాక్ కు చాలా దూరంలో ఉంది 
► చంద్రబాబును కలవాలనుకున్న వాళ్లనే అనుమతిస్తున్నాం:తానేటి వనిత

3.10pm
లోకేష్ తో భేటీ అయిన కుటుంబసభ్యులు

► చంద్రబాబుతో ములాఖత్‌ ముందు నారా లోకేష్‌తో కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు.

► సాయంత్రం 4 గంటలకు చంద్రబాబును కలవనున్న కుటుంబసభ్యులు

► లోకేష్‌తో మాట్లాడిన వారిలో తల్లి భువనేశ్వరీ, భార్య బ్రాహ్మణి ఉన్నారు.

3.00pm
చంద్రబాబుకు ఇంటి భోజనం

► రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు.. ఈవెనింగ్ స్నాక్స్ గా ఫ్రూట్ సలాడ్, బ్లాక్ కాఫీ, వేడి నీళ్లు పంపారు కుటుంబ సభ్యులు

► మధ్యాహ్నం లంచ్ కోసం రెండు పుల్కాలు పప్పు, వేడి నీళ్లు పంపిన కుటుంబ సభ్యులు

2.45pm
చంద్రబాబుతో ఫ్యామిలీ ములాఖత్‌

► మరికొద్ది సేపట్లో చంద్రబాబును కలవడానికి సెంట్రల్ జైలుకు రానున్న లోకేష్ ,భువనేశ్వరి ,బ్రాహ్మణి
► చంద్రబాబుతో ములాఖత్  కోసం నాలుగు గంటలకు  అనుమతి ఇచ్చిన జైలు అధికారులు
► ఇప్పటికే చంద్రబాబును కలిసిన హైకోర్టు లాయర్ లక్ష్మీనారాయణ
► మూడున్నరకే సెంట్రల్ జైలుకు చేరుకోనున్న  కుటుంబ సభ్యులు

2.55pm
చంద్రబాబు పిటిషన్‌పై సాయంత్రం విచారణ
►చంద్రబాబుకు హౌజ్‌ రిమాండ్‌ ఇవ్వాలన్న పిటిషన్‌ను సాయంత్రం విచారించనున్న ఏసీబీ కోర్టు
►చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదంటూ అడ్వొకేట్‌ జనరల్‌కు లేఖ రాసిన ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌
►చంద్రబాబుకు జైల్లో కోర్టు ఆదేశాల మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేశామని వెల్లడి
►చంద్రబాబుకు జైల్లో పూర్తి భద్రత కల్పించామని వెల్లడించిన ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌

2.48pm
CID కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా

చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై వాదనలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇప్పటి వరకు కౌంటర్ పిటీషన్ ఎందుకు వేయలేదని ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు తరపు లాయర్లను ప్రశ్నించింది. దీంతో.. రేపు వేస్తామని కోర్టుకు తెలిపారు వాళ్లు. రేపు.. కౌంటర్ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చంద్రబాబును ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే.

2.37pm
► సాయంత్రం 4 గంటలకు కోర్టు ముందుకు చంద్రబాబు హౌజ్‌ అరెస్ట్‌ కస్టడీ పిటిషన్‌
భద్రతా కారణాల దృష్ట్యా చంద్రబాబు హౌజ్‌ అరెస్ట్‌ను రిమాండ్‌గా పరిగణించాలని చంద్రబాబు లాయర్లు వాదించగా, చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని.. బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం‌ పిటిషన్‌కి విచారణ అర్హత లేదని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు ఏఏజీ సుధాకర్ రెడ్డి. 

2.30pm
రాజమండ్రి జైల్లో.. చంద్రబాబును కలిసిన హైకోర్టు అడ్వకేట్ లక్ష్మీనారాయణ. చంద్రబాబుతో సెల్ లో  లీగల్ ఇంటర్వ్యూ కోసం కలసిన అడ్వకేట్. ముందస్తు అనుమతి ప్రకారమే ములాఖత్‌ అవకాశం కల్పించిన జైలు అధికారులు

2.20pm
సీఐడీ FIR పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ 

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు..
FIR లో చంద్రబాబు పేరు లేకుండా అరెస్ట్ చేశారు
2022 లోనే చంద్రబాబు పేరు బయటకు వచ్చింది కానీ 2023 సెప్టెంబర్ 8న అరెస్ట్ చేయాలని భావించారు
రిమాండ్ రిపోర్ట్ లో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు
చంద్రబాబు పై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమే
ఒక తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్ 
► FIR క్వాష్ చేసేందుకు గ్రౌండ్స్ ను ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలు

1:48 PM
► చంద్రబాబుతో అడ్వకేట్‌ లక్ష్మీనారాయణ ములాఖత్‌. 
► కేసుకు సంబంధించిన విషయాలపై చంద్రబాబుతో చర్చ. 
► ముందస్తు అనుమతి ప్రకారమే అవకాశం కల్పించిన అధికారులు. 

1.45pm
చంద్రబాబుకి బెయిల్ ఇవ్వాలని టీడీపీ కార్యకర్త మహేష్‌రెడ్డి పిటిషన్ 
చంద్రబాబు తరపున తను సంతకం పెడుతున్నట్టు తెలిపిన మహేష్‌రెడ్డి 
చేతిరాతతో కూడిన పిటిషన్ దాఖలు చేసిన లాయర్ చెన్నకేశవులు 
ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసిన కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బరావు
పిటిషన్‌ వేసిన వారిని పిలిచి అడిగిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి 
ఫైనల్‌గా ఎవరి పేరుతో పిటిషన్ వేస్తారో తెలపాలన్న న్యాయమూర్తి

1:25 PM
► రాజమండ్రి చేరుకున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి 
► రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ములాఖత్‌ ద్వారా చంద్రబాబును కలవనున్న కుటుంబసభ్యులు. 

12.30pm

AAG పొన్నవోలు సుధాకర్ రెడ్డి
చంద్రబాబుకి పూర్తి భద్రత ఉంది
జైలులో ఖైదీలు ఉండక స్వామిజీలు ఉంటారా..?
చంద్రబాబుకి ఇంటి భోజనం, మందులు కూడా ఇస్తున్నారు
పివి రమేష్‌ని అప్పుడే  ప్రలోభపెట్టేసారా..?
పివి రమేష్ జడ్జ్ ముందు ఇచ్చిన స్టేట్ మెంట్ మర్చిపోయారా..?
చంద్రబాబుని అరెస్ట్ చెయ్యడం సమంజసం కాదని ఆయానేలా చెప్తారు
పివి రమేష్ ఇన్నాళ్లు నిద్రపోయారా..?
లోకేష్ ఆధారాలు లేవని ఎలా అంటారు
షెల్ కంపెనీలు ద్వారా డబ్బులు చేరాయని విచారణ లో తేలింది
ఆర్డర్  చంద్రబాబుకి అనుకూలంగా రాకపోతే న్యాయ వ్యవస్థను నిందిస్తారా..?
చంద్రబాబుకి అనుకూలంగా వస్తేనే న్యాయవ్యవస్థ బాగున్నట్టా
కొన్ని వ్యవస్థలకు చంద్ర గ్రహణం ఇప్పుడు వీడింది
నన్ను ఎంత టార్గెట్ చేసిన నేను భయపడను
భయం అన్నది నా బ్లడ్‌లోనే లేదు
వాళ్ళ లానే నేను ఈ డైలాగ్ చెప్తున్నా
చంద్రబాబు ఈ కేసులో అన్ని ఆధారాలతో దొరికారు

12.15pm
విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి బయల్ధేరిన భువనేశ్వరి, బ్రాహ్మణి
సాయంత్రం 4 గంటలకు చంద్రబాబును కలవనున్న కుటుంబ సభ్యులు
ములాఖత్‌ కోసం జైలు అధికారులకు విజ్ఞప్తి ఇవ్వనున్నట్టు సమాచారం

11: 30AM
చంద్రబాబు రిమాండ్‌పై లంచ్ మోషన్ పిటిషన్ వేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ 
రిమాండ్ చెల్లదంటూ పిటిషన్‌లో పేర్కొన్న దమ్మాలపాటి శ్రీనివాస్ 
పిటిషన్‌ను అనుమతించిన ఏపీ హైకోర్టు 
రేపు విచారణకు వచ్చే అవకాశం

11:15 AM
చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు: జైళ్ల శాఖ

► రాజమండ్రి జైలులో చంద్రబాబుకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్టు జైళ్ల శాఖ పేర్కొంది. చంద్రబాబు కోసం ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. చంద్రబాబు కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లను కోర్టుకు జైళ్ల శాఖ తెలిపింది. చంద్రబాబు కోసం ఓ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. జైలు ప్రధాన బ్లాక్‌తో సంబంధం లేకుండా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశాం. 

► భద్రత దృష్ట్యా బ్లాక్‌ అన్ని వైపులా బలగాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ వార్డుల్లోకి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరూ ప్రవేశించాలన్నా.. ప్రత్యేక అనుమతులు అవసరం. చంద్రబాబు అనుమతితోనే ములాఖత్‌కు అనుమతిస్తాం. రాజమండ్రి సూపరింటెండెంట్‌ సహా అధికారులు అందుబాటులో ఉంటారు. 24 గంటలపాటు ఈ వార్డు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. 

10: 45 AM
► చంద్రబాబు రిమాండ్‌ను చాలెంజ్‌ చేస్తూ హైకోర్టులో మెన్షన్‌ చేసిన  ఆయన తరుఫు లాయర్లు. రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. 

రెండోరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు

యోగా, వాకింగ్ చేసి న్యూస్ పేపర్స్ చదివిన చంద్రబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలుకి కిలోమీటర్ దూరంలో టీడీపీ క్యాంప్
అత్యంత పటిష్టమైన నిఘాలో స్నేహ బ్లాక్ - స్నేహ బ్లాక్ మొత్తం చంద్రబాబుకే కేటాయింపు

ములాఖత్ కోసం అనుమతులు కోరిన బాబు కుటుంబం
సాయంత్రం 4 గంటలకు బాబుతో ఫ్యామిలీ ములాఖత్
మధ్యాహ్నం రాజమండ్రికి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి -

8:30 AM

► రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబును నేడు నారా లోకేశ్‌, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కలవనున్నారు. 

► నేడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో బాలకృష్ణ మాట్లాడతారు. 

► టీడీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన కుంభకోణాలపై దృష్టి సారించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు పీటీ వారంట్‌ కోరుతూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

► చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్‌పై నేటి మధ్యాహ్నం తర్వాత తీర్పు వెలవరించనున్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి. నిన్న సాయంత్రం వరకు  న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించిన ఇరుపక్షాలు. 

► చంద్రబాబు తరఫున వాదన వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్రా. ఏపీ సీఐడీ తరఫున వాదన వినిపించిన ఏజీ శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. 

► చంద్రబాబుకు ప్రాణహాని ఉందంటూ ప్రధానంగా పేర్కొన్న లూద్రా. ఎన్‌ఎస్‌జీ భద్రత, వీవీఐపీ, 73 ఏళ్ల వయస్సు, ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుని హౌస్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. 

► చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ‌ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, వ్యక్తిగత సహాయకుడిని కల్పించామని, చంద్రబాబు బయట ఉంటే సాక్షులని ప్రభావితం చేసే అవకాశముందని.. గృహ నిర్బంధం‌ పిటిషన్‌కి విచారణ అర్హత లేదని.. పిటిషన్ తిరస్కరించాలని సీఐడీ తరఫున గట్టి వాదనలు వినిపించారు సుధాకర్ రెడ్డి. 

► చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో నిన్న సీఐడీ పిటిషన్‌ దాఖలు. కౌంటర్ దాఖలు చేయాలని  చంద్రబాబు న్యాయవాదులకు సూచించిన న్యాయమూర్తి. నేడు కౌంటర్ దాఖలు చేస్తామన్న సిద్ధార్థ లూద్రా. 

ఏ1గా చంద్రబాబు, ఏ2 నారాయణ, ఏ6 లోకేష్..
► ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్‌ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో  ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్‌ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది. 

► ఈ కేసులో చంద్రబాబును విచారించాలని కోరిన ఏపీ సీఐడీ. 

► ఇన్నర్ రింగ్ రోడ్డుపై 2022లోనే చంద్రబాబుపై కేసు నమోదు. 

► ఇక, చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణను నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: ‘జైల్లో ఉండను మా ఇంట్లో ఉంటా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement