
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు శుక్రవారం సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు గంటకుపైగా కొనసాగింది. కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి మూడురోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. శనివారం పౌరవిమానయాన, హౌసింగ్‌శాఖల మంత్రి హర్దీప్‌సింగ్ పురితో భేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment