
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరంలో అవినీతి హద్దులు దాటిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సరైన అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మించారన్నారు.
చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు
భారీ వర్షాలకు 3 పంప్‌హౌజ్‌లు మునిగిపోయాయన్నారు. పంప్‌లను టెక్నికల్‌గా సరైన పద్దతిలో అమర్చలేదని, ప్రాజెక్టు నిర్మించినప్పుడే వేలకోట్ల అవినీతి జరిగిందని గజేంద్ర సింగ్ షెకావత్ దుయ్యబట్టారు. పంప్‌ల రిపేర్లలోనూ అవినీతికి ఆస్కారం ఉందన్నారు. మోటార్లు బిగించిన సంస్థకు టెక్నికల్ సామర్థ్యం లేదని కేంద్రమంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment