
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల కమిటీ భేటీ వాయిదా పడిందని సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. కాగా కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం జరగాల్సిన భేటీ వాయిదా పడింది.