Apex Committee
-
పీఏసీఎల్ కేసులో రిఫండ్స్ షురూ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్‌లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్లను చేపట్టనున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్ల ప్రాసెస్‌ను దశలవారీగా చేపట్టింది. అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పీఏసీఎల్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో పీఏసీఎల్ (పెరల్ గ్రూప్) పబ్లిక్ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది. -
అపెక్స్ కౌన్సిల్ భేటీ మరోసారి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం మరోసారి వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల కమిటీ భేటీ వాయిదా పడిందని సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామని కేంద్ర జలశక్తి శాఖ ఆదివారం ఓ ప్రకటన చేసింది. కాగా కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం కావాల్సి ఉంది. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మంగళవారం జరగాల్సిన భేటీ వాయిదా పడింది. -
దోషిగా ఆరేళ్లు.. నిర్దోషిగా 15 ఏళ్లు
న్యూఢిల్లీ : మన దేశ జనాభాకు తగ్గట్టుగా కోర్టుల సంఖ్య లేదననేది వాస్తవం. ఏళ్ల తరబడి పేరుకుపోయిన కేసుల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. అందుకు న్యాయస్థానాలు, న్యాయవాదుల సంఖ్య ఓ కారణమైతే సరైన సమయంలో స్పందించకుండా తప్పించుకు తిరిగే పౌరులు కూడా మరో కారణం. అదే కోవలో మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కకుండా మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతూ, కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నాడు ఓ నేరస్తుడు. మధ్యప్రదేశ్‌కు చెందిన భోలా మహర్ 1993లో ఓ హత్య కేసులో గ్వాలియర్ కోర్టు అతన్ని 1999లో దోషిగా నిర్దారించింది. ఆరేళ్ల శిక్ష అనంతరం అతను మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద, సరైన ఆధారాలు లేవనే కారణంతో అతనికి కేసు నుంచి విముక్తి లభించింది. అయితే 2015లో మహర్‌ను నిర్దోషిగా ఎలా నిర్దారించారో చెప్పాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. అప్పీలు స్వీకరించిన సుప్రీం కోర్టు జులై 10, 2015న మహర్‌కు నోటీసులు జారీ చేసింది. అప్పటినుంచి ఈ మూడేళ్లలో కేసు ఐదుసార్లు విచారణకు వచ్చింది. కానీ మహర్ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. అతని ఆచూకీ కనుక్కోవటంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలం కావటంతో పాత కథే పునరావృతమైంది. దీంతో కేసులో భాగమైన ప్రతివాది స్పందించలేదనే కారణంతో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని సర్వోన్నత న్యాయస్ధానం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఎస్పీని ఆదేశించింది. -
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. కాగా కృష్ణానదీ జలాల్లో వాటాల కేటాయింపులు, వాటి ఆధారంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కేంద్రానికి పరస్పర ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అపెక్స్ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. కాగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలుపై కేసీఆర్ ఢిల్లీ నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ప్రజలుకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ప్రారంభమైన అపెక్స్ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. శ్రమశక్తి భవన్‌లోని ఉమాభారతి చాంబర్లో ఈ భేటీ జరుగుతోంది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కింద తమకు దక్కే వాటాలపై గళమెత్తేందుకు ఇటు తెలంగాణ.. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై నిలదీసేందుకు అటు ఏపీ సిద్ధమయ్యాయి. ఇది ఎజెండా: అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో కేంద్రం ఐదు ప్రధాన అంశాలను చేర్చింది. ఈ మేరకు కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ నరేశ్‌కుమార్ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపారు. 21వ తేదీ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు శ్రమశక్తి భవన్‌లోని కేంద్రమంత్రి ఉమాభారతి చాంబర్లో సమావేశం జరుగుతుందని వివరించారు. ఎజెండాలోని అంశాలను నోటీస్‌లో వివరించారు. సుప్రీంకోర్టు పరిష్కరించాలని సూచించిన పాలమూరు, డిండి ప్రాజెక్టులను తొలి అంశంగా చేర్చారు. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి తాత్కాలిక విధానం, రిజర్వాయర్ల పరిధిలో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో లెక్కలు పారదర్శకంగా ఉండేందుకు టెలీమెట్రీ విధానం, ఒక వాటర్ ఇయర్లో నీటి వాటాల్లో హెచ్చుతగ్గులుంటే వాటి సర్దుబాటు, గోదావరి నుంచి కృష్ణా బేసిన్‌కు నీటి తరలిస్తూ చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చారు. వీటితో పాటు ఏవైనా ఇతర అంశాలుంటే కేంద్రమంత్రి సమ్మతితో చేపట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ఒక్కో రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో కూడిన ఐదుగురు ప్రతినిధుల బృందం హాజరు కావాలని సూచించారు. -
రూ.526 కోట్లతో కాఫీ ప్రాజెక్టు
2025 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్ విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో తలపెట్టిన కాఫీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మరో అడుగు పడింది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాడేరు ఐటీడీఎ పరిధిలో సుమారు లక్ష ఎకరాల్లో రూ. 526 కోట్ల 16 లక్షలతో ఈ ప్రాజెక్టు తలపెట్టారు. 2015-16 నుంచి 2024-25ల మధ్య ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహాయం చేయనుండగా, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ నుంచి ట్రైబల్ సబ్‌ప్లాన్ కాంపొనెంట్ కింద రాష్ర్టం తన వాటాను సమకూర్చనుంది. ఏజెన్సీ పరిధిలోని కాఫీ ప్లాంటేషన్‌పై ఆధారపడే ప్రతీ గిరిజన కుటుంబానికి ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి కనీసం రూ.లక్ష ఆదాయం సమకూర్చేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాఫీని గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేయనుంది. అలా సేకరించిన కాఫీని వేలం పాటల ద్వారా విక్రయించనుంది. దీంట్లో కనీసం 50 శాతం మొత్తాన్ని కాఫీ గ్రోయిర్స్కు అందజేయనుంది. ఇందుకోసం డెరైక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రతిపాదనల మేరకు ఎపెక్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కార్‌ను ఆదేశించింది. ట్రైబల్ వెల్ఫేర్ డెరైక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీకి పాడేరు ఐటీడీఎ పీవో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ట్రైకార్ మేనేజింగ్ డెరైక్టర్, కాఫీ బోర్డు నుంచి అగ్రిఎకనామిస్ట్, జీసీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్లు సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ సీజన్‌కు కనీసం రెండుసార్లు సమావేశమవుతూ కాఫీ పిక్కల సేకరణ, ధరలను నిర్ణయిస్తుంది. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది. ఎపెక్స్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ విద్యాసాగర్ గురువారం రాత్రి ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. -
టీఎంసీ సరిహద్దుల పెంపునకు యూడీడీ పచ్చజెండా
నాసిక్: త్రయంబకేశ్వర్ మున్సిపాలిటీ సరిహద్దు పరిధి పెంపునకు పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ) ఆమోదం తెలిపింది. కుంభమేళా సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, తగు సేవలు అందించేందుకుగాను సరిహద్దుల పెంపునకు అనుమతించాలని కోరుతూ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ (టీఎంసీ) కొద్దిరోజుల క్రితం ఓ ప్రతిపాదనను పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ)కి పంపిన సంగతి విదితమే. ఇందుకు ఆమోదం తెలిపిన యూడీడీ దానిని న్యాయమంత్రిత్వ శాఖకు పంపించింది. న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఓ ప్రకటన చేయనుంది. ఈ విషయమై టీఎంసీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ అపెక్స్ కమిటీలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుంభమేళాకు సంబంధించి 90 శాతం పనులను పూర్తిచేశామన్నారు. తమ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే టీఎంసీ సరిహద్దు పరిధి 1.89 కిలోమీటర్లనుంచి 11.794 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొ చ్చన్నారు. టీఎంసీ చుట్టుపక్కల గ్రామాలు రెవె న్యూ విభాగం పరిధిలో ఉన్నాయని, ఏ గ్రామపంచాయితీ పరిధిలో లేవన్నారు. అందువల్ల ప్రతి చిన్నపనికీ కలెక ్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. అయితే తమ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. వారు తమను నేరుగా సంప్రదించే వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈ పరిస్థితి మారిపోతుందన్నారు.