
విజయవాడ: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైఎస్సార్‌సీపీని కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం ఖండించింది. అదే సమయంలో ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అధిష్టానం.. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు విషయంలో క్లారిటీ ఇచ్చింది.
‘రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు కోరలేదని సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవం. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని బీజేపీ అధిష్టానం కోరింది. ఈ విషయంలో సీఎం జగన్‌తో వ్యక్తిగత సంప్రదింపులు కూడా జరిపింది. నామినేషన్ దాఖలు సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా హాజరై మద్దతు తెలిపారు’ అని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు. ఈ మేరకు సత్యకుమార్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని షెకావత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment