
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని సీఎం జగన్ కోరగా, త్వరలోనే పోలవరం పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అలాగే గోదావరి-కావేరి నధుల అనుసంధానంపైన కూడా చర్చ జరిగింది. నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్‌కు జలశక్తి మంత్రి షెకావత్ సూచించారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా 2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. (ఏపీకి నిధులు ఇవ్వండి)
కాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం హోం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై చర్చించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితోపాటు దిశ చట్టం, శాసన మండలి రద్దు.. చట్ట రూపు దాల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment