సాక్షి, న్యూ ఢిల్లీ: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్ర మంత్రికి విన్నపించారు. 2017-18 సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద అంచనాల పెంపు వ్యవహారం పెండింగ్‌లోఉందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రి నిర్మలా సీతారామన్‌ను పలుమార్లు కలిసి అంచనాల పెంపుపై చర్చించినట్లు ఏపీ మంత్రులు పేర్కొన్నారు. చదవండి: పోలవరం ఓ చిరకాల స్వప్నం
Comments
Please login to add a commentAdd a comment