![Harish Rao Strong Counter To Union Minister Gajendra Singh Shekhawat - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/18/Harish-Rao.jpg.webp?itok=Chj7dRCb)
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. గురువారం ఆయన టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాళేశ్వరంపై కేంద్రమంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతిచ్చింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీవి బురద చల్లే రాజకీయాలంటూ దుయ్యబట్టారు.
చదవండి: కేసీఆర్ చేసింది పెద్ద రిస్కే.. ఇది ఆషామాషీ విషయం కాదు
కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో షెకావత్ మెచ్చుకోలేదా?. కేంద్రానికి నచ్చితే నీతి, నచ్చకుంటే అవినీతా?. మెచ్చుకున్న నోటితోనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణపై బురద చల్లేందుకు కేంద్రమంత్రులు ప్రయత్నిస్తున్నారు. కాళేశ్వరం ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అని కేంద్రమే చెప్పింది. కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే మాపై ఆరోపణలు’’అంటూ హరీష్‌రావు నిప్పులు చెరిగారు.
చదవండి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కేంద్రమంత్రి షెకావత్ షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment