
సాక్షి, అమరావతి: కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మార్చి 4న పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. స్పిల్ వే, స్పిల్ చానల్, ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ డయా ఫ్రమ్ వాల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పరిశీలించనున్నారు.
చదవండి: కొత్త జిల్లాల ప్రక్రియ వేగవంతం
తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి.. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చే నెల 4న ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు.