సాక్షి, ఢిల్లీ : ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలవరం ప్రాజెక్టకు సంబంధించి పలు కీలక అంశాలను ఆయన వద్ద ప్రస్తావించినట్లు మీడియా సమావేశంలో తెలిపారు. పోలవరంపై 2017లో చంద్రబాబు వేసిన చిక్కుముడులను విప్పుతున్నామన్నారు. ఈ సందర్భంగా పోలవరం సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి మెమెరాండం ఇచ్చామని పేర్కొన్నారు. పోలవరం అంశంపై మంత్రి షెకావత్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని.. పోలవరాన్ని సందర్శించాలని కోరగా.. 15 రోజులలోపే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..మూడు రోజులుగా వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు, అధికారులతో సమావేశమయ్యాం.నేడు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి సీఎం వైయస్ జగన్ ఇచ్చిన రిప్రజెంటేషన్ అందజేశాం. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని కేంద్రమంత్రికి తెలిపాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2017లో(చంద్రబాబు హయాంలో) జరిగిన పొరపాటును, ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇబ్బందులను కేంద్ర మంత్రికి వివరించాం. పోలవరం ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి ఏదైతే కాంపోనెంట్ తీసేశారో, దానిని కూడా చట్టంలోని 14-యాక్ట్ ప్రకారం మనకున్న హక్కు ప్రకారం ఇవ్వాలని కోరినట్లు 'అనిల్ తెలిపారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ గారితో డిటైల్డ్ గా చర్చించడం జరిగింది. ఏపీ విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని పూర్తి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు హయాంలో స్పెషల్ ప్యాకేజీ పేరుతో సెప్టెంబర్8, 2016న ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోవడం వల్ల, ఒరిజనల్ గా ఉన్న ఫెసిలిటీస్ అన్నీ మార్చడం జరిగింది. చంద్రబాబు హయాంలో క్రియేట్ చేసిన సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా చిక్కుముడిని విడదీస్తున్నామని' బుగ్గన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment