హైదరాబాద్, సాక్షి: పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు?. 2005లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టుకు అనుమతులు తీసుకున్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కేంద్రం పోలవరం బాధ్యతలు తీసుకుంది. పోలవరం పూర్తైతే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది. పోలవరం ఆపేసి చంద్రబాబు పట్టిసీమ ఎందుకు కట్టారు?.
..ఆనాడు కేంద్రంతో టీడీపీ చేసుకున్న ఒప్పందంతో ఎన్నో ఇబ్బందులున్నాయి. 2013 భూసేకరణ చట్టాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. మా ప్రభుత్వ హయాంలో పోలవరం ముఖ్యమైన పనులు పూర్తిచేశాం. వైఎస్సార్‌సీపీ హయాంలో కోవిడ్ కాలంలోనూ పోలవలం పనులు చేశాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు.
..పోలవరం ఎత్తు తగ్గింపు మా హయాంలోనే జరిగిందని టీడీపీ తప్పడు ప్రచారం చేస్తోంది. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రాయానాయుడు తప్పడు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సరిదిద్దింది. కోవిడ్ సంక్షోభం లేకుంటే మిగిలిన పనలు పూర్తి చేసేవాళ్లం. స్పిల్ వే కట్టిన తర్వాత అప్పర్ కాఫర్, లోయర్ కాఫర్ డ్యాం కట్టాలి. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాతే డయాఫ్రంవాల్ కట్టాలి. ప్రతీ సోమవారం పోలవరం అని చంద్రబాబు భ్రష్టుపట్టించారు’’ అని అన్నారు.
హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలపై బుగ్గన రియాక్షన్..
‘‘డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎవరిని ప్రశ్నిస్తున్నారు?. పవన్ కూడా ప్రభుత్వంలోనే ఉన్నారు కదా?. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా ఇంకా ప్రశ్నించడమేనా? మీరు ఉపముఖ్య మంత్రి కూడా. మీరు కూటమికి కారణం కూడా. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారు. ఈరోజు మళ్లీ హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నట్లు మిమ్మల్ని మీరే ప్రశ్నిచుకుంటున్నారా?.
మీ ప్రభుత్వం వచ్చాక క్రైం జరుగుతున్నా.. మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారో అర్ధం కావట్లేదు. మీరు అధికారంలో ఉండికూడా ప్రశ్నిచడం ఏమిటి?. సమాధానం చెప్పాల్సిన మీరు హోమ్ మినిస్టర్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు పాలనాపైన ఓరియెంటేషన్ అవసరం ఉంది. అదృశ్యమైన 30 వేల మంది ఆడపిల్లల జాడేదీ?. ’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment