కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని దుస్థితి కూటమి సర్కారుది
వంద రోజుల్లో చంద్రబాబు తెచి్చన అప్పులు ఆ పత్రికలకు కనిపించవా?
చంద్రబాబు హయాంలోనే పోలవరానికి నష్టం
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: వంద రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికే సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దీనస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, సూపర్ సిక్స్ అమలు గురించి మహిళలు, వృద్ధులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం గ్రామాల్లో పారీ్టల పేరుతో దాడులు చేయడానికే సమయాన్ని వృథా చేసిందన్నారు.
పచ్చ మీడియా పక్షపాతం
ఏపీ అప్పుల విషయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పక్షపాత కథనాలు ఇస్తున్నాయని బుగ్గన ధ్వజమెత్తారు. వంద రోజుల్లో చేసిన అప్పులను ఎందుకు రాయడం లేదని ప్రశి్నంచారు. పోలవరానికి రూ.12,500 కోట్ల అదనపు నిధులు రావడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేక విధాల కృషి చేసిందని, ఈ ఫలితాలను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా చెప్పుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును 2016 వరకూ నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. 2014 నాటి ధరలకు ఒప్పుకున్నారని, కొత్త భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాసం గురించే ఆలోచించలేదని, కేవలం సాగు, తాగునీటి కోసం లెక్కలు వేసి, కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు వచ్చాయని బుగ్గన తెలిపారు. రూ.55 వేల కోట్ల అవసరం ఉంటే.. రూ.20 వేల కోట్లకే పోలవరం చేపడతామని కేంద్రంతో అప్పటి చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుందన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ హయాంలో జరిగిన కృషిని బుగ్గన ఈ దిగువ విధంగా వివరించారు.
వైఎస్ జగన్ పోలవరానికి చేసింది ఇదీ
⇒ పోలవరం ప్రాజెక్టుకు ముందు రాష్ట్రం డబ్బులు పెడితే, కేంద్రం తిరిగి చెల్లిస్తుంది. టీడీపీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు.. ఈ లెక్కలు పోలవరం అధారిటీకి వెళ్లేవి. అథారిటీ పరిశీలించి, జలశక్తికి పంపాలి. అక్కడి నుంచి ఆరి్థక శాఖకు, ఆర్‌బీఐకి వెళ్లి.. తిరిగి రాష్ట్రానికి నిధులు రావడానికి కొన్ని నెలలు పట్టేది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంతో మాట్లాడిన తర్వాత స్పెషల్ అసిస్టెంట్ ద్వారా నేరుగా నిధులు రావడానికి వైఎస్ జగన్ కృషి చేశారు.
⇒ పోలవరానికి సాగు, తాగునీరు రెండు కాంపొనెంట్లు ఇవ్వాలని 12–6–2021, 16–7–2021, 20–7–2021 తేదీల్లో కేంద్రానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లేఖలు రాసింది. ఈ కారణంగానే రూ.7 వేల కోట్లు కేంద్రం ఇవ్వబోతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఒత్తిడివల్లే పోలవరం అనుమతులు, అదనపు ఖర్చులు వస్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ గొప్పతనమేమీ కాదు.
⇒ 11.5.2022లోనే సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాయి. 10–4–2023 జలశక్తిలోనే పోలవరం అదనపు ఖర్చు గురించి వివరాలు ఇవ్వమని కోరింది. 36 గ్రామాల పునరావాస వివరాలను 4–5–2023న జగన్ సర్కారు పంపింది. వరద వల్ల జరిగిన నష్టంతోపాటు అదనంగా కావల్సిన రూ.12,911 కోట్లకు కేబినెట్ నోట్ పంపమని కేంద్రం 5–6–2023లోనే జగన్ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల వల్ల ఆగిపోయిన కేబినెట్ నోట్ ఇప్పుడు అమలులోకి వస్తే ఈ ఘనత తమదేనని చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరం.
Comments
Please login to add a commentAdd a comment