
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై సెప్టెంబర్ 1న జరగనున్న పూర్తిస్థాయి కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. బోర్డు భేటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. బోర్డు సమావేశంలో చర్చకు రాబోయే ఎజెండాలోని అంశాలపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన నీటి వాటా కోసం కృష్ణా బోర్డు, ట్రిబ్యునళ్లు సహా అన్ని రకాల వేదికలపై బలమైన వాదనలు వినిపించాలన్నారు.
బోర్డు సమావేశంలో సాధికారిక సమాచారంతో సమర్థంగా వాదనలు వినిపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మాజీ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో సీనియర్ న్యాయవాది రవీందర్‌రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ కోటేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment