సాక్షి, గుంటూరు: నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కేఆర్‌ఎంబీ ఆదేశాలు జారీ చేసిందని సాగర్ ఈఈ శ్రీహరి తెలిపారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌లో రోజుకు 30 వేల క్యూసెక్కులను టీఎస్ సర్కార్ వాడుకుంటోంది. ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నా తెలంగాణ అధికారులు విద్యుత్ పంపిణీ చేపట్టారని’’ ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడతారని శ్రీహరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment