ignore
-
తెలంగాణ సర్కార్‌కు పట్టని కేఆర్ఎంబీ ఆదేశాలు
సాక్షి, గుంటూరు: నాగార్జునసాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలంటూ తెలంగాణకు కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసిందని సాగర్ ఈఈ శ్రీహరి తెలిపారు. కేఆర్ఎంబీ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ‘‘విద్యుత్ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌లో రోజుకు 30 వేల క్యూసెక్కులను టీఎస్ సర్కార్ వాడుకుంటోంది. ప్రాజెక్టులో నీరు నిండుగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కానీ ఇప్పుడు ప్రాజెక్టులో తక్కువగా నీరు ఉన్నా తెలంగాణ అధికారులు విద్యుత్ పంపిణీ చేపట్టారని’’ ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లాలో రైతులు ఇబ్బందులు పడతారని శ్రీహరి తెలిపారు. -
కూరలో కరివేపాకులా!
► మంత్రులంటే లెక్కలేదు ► ఏ సమాచారమూ వారికుండదు ► జిల్లాల్లో కొందరిదే పెత్తనం ► ఒక సామాజిక వర్గానికే పెద్దపీట ► రగులుతున్న ఇతర ప్రజాప్రతినిధులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని ప్రజాప్రతినిధులకు మంత్రులంటే లెక్కలేదా.. వారిని కూరలో కరివేపాకులా తీసి పక్కన పెడుతున్నారా.. ఇటీవల చోటుచేసుకుంటున్న వరస ఘటనలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకే పెద్ద పీట వేస్తున్నారు. ఆ వర్గం వారికే స్థాయికి మించిన ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ సమావేశాలు ఏర్పాటు చేసే సందర్భంలో మంత్రులు అందుబాటులో ఉంటారా లేదా కనుక్కుని వారి షెడ్యూల్‌కు అనుగుణంగా తేదీలు ఖరారు చేయడం ఆనవాయితీ. ప్రతి జిల్లాలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యహరిస్తున్నారు. బీజేపీ తరఫున గెలిచి మంత్రి పదవి చేపట్టిన పూడికొండల మాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కనుక ఆయనతో సంప్రదించే అవకాశమే లేదు. మరో మంత్రి పీతల సుజాత దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మొదటి నుంచీ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జెడ్పీ చైర్మన్ స్పందించకపోయినా జెడ్పీ సీఈవో లేదా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని జెడ్పీ సమావేశం తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ జరగడం లేదు. దీంతో అందరితోపాటే మంత్రులకూ సమావేశ ఆహ్వానం, అజెండా కాపీ అందుతోంది. ముందుగానే వారికి ఇతర కార్యక్రమాలు ఉండటంతో వారు సమావేశానికి రాలేని పరిస్థితి ఉంటోంది. జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న నిర్ణయాలు, ఇతర విషయాలను మంత్రులే వివరిస్తారు. జిల్లాలో ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. మంత్రుల తరఫున కూడా దుందుడుకు ఎమ్మెల్యే అధికారులపై పెత్తనం చేసేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే ఫోన్ ఎత్తకపోవడంపై డీఎంహెచ్‌వోపై అధికార పార్టీ నేతలు గురువారం జరిగిన జెడ్పీ సమావేశంలో విరుచుకుపడ్డారు. మహిళ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా దురుసుగా మాట్లాడటంతోపాటు ఇక్కడ తాము చెప్పిందే చేయాలని.. లేకపోతే వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. వీరి వైఖరి కారణంగా జిల్లాలో ఏ అధికారి కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది. ఆహ్వానమే లేదు పట్టిసీమ నుంచి గోదావరి జలాలను కష్ణా జిల్లాకు పంపిస్తున్న సందర్భంగా పెదవేగి మండలం జానంపేట వద్ద గురువారం చేపట్టిన కార్యక్రమానికి జిల్లా మంత్రులతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపించలేదు. కష్ణా జిల్లాలో తోటపల్లి ప్రాజెక్ట్ నీటి విడుదల కార్యక్రమంలో మంత్రి మణాళినితో పాటు ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. ఇక్కడ మాత్రం దెందులూరు ఎమ్మెల్యే ఒక్కరే తన సొంత కార్యక్రమంలా దీన్ని నిర్వహించడం, పొరుగున ఉన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జిని మాత్రం ఆహ్వానించి ఇతర ప్రజాప్రతినిధులను పిలవకపోవడంపై ఇతర ఎమ్మెల్యేలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాత్రమే కాదని, అందరికి ప్రాధాన్యత ఉండాలని మిగిలిన ఎమ్మెల్యేలు ఆంతరంగికుల మధ్య వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా వారికే వత్తాసు పలకడంపై అసంతప్తి వ్యక్తం అవుతోంది. వీరి వ్యవహార శైలిని ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు -
వైద్యుల నిర్లక్షంతో గర్భిణి మృతి
-
గ్రామీణ వైద్యులపై ప్రభుత్వం చిన్నచూపు
సాక్షి, మంచిర్యాల : గ్రామీణ వైద్యుల(ఆర్ఎంపీ)ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. పల్లెల్లో ఎవరికి ఏ జబ్బు వచ్చినా, ప్రమాదం జరిగినా పరుగెత్తుకెళ్లి వైద్యం అందించే వీరికి ప్రభుత్వ గుర్తింపు కరువైంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వ్యాప్తి చెందుతున్న కొత్త జబ్బులపై అవగాహన, ప్రాథమిక చికిత్సలు, సలహాలు, సూచనలు అందించేందుకు ఆర్ఎంపీలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. శిక్షణ పొందిన వీరికి ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలతోపాటు ఆరు నెలలకోసారి శిక్షణ కూడా ఇవ్వాలని సంకల్పించారు. ఈ క్రమంలో జిల్లాలో 200 మందికి రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మరో 1,900 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా అంతలోనే వైఎస్సార్ అకా ల మరణం చెందారు. అనంతరం కిరణ్ ప్రభుత్వం నాలుగేళ్లుగా శిక్షణ కార్యక్రమాలను నిలిపి వేసింది. ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్న ప్రజలు జిల్లాలో 27 లక్షలకుపైగా జనం నివసిస్తున్నారు. వీరికి చికిత్స అందించడం కోసం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 469 ఆరోగ్య ఉప కేంద్రాలు, 17 సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రాలు, ఆరు ప్రాంతీయ ఆస్పత్రులు ఉన్నాయి. వైద్యాధికారుల మొదలు హెల్త్ ఎడ్యుకేటర్ల వరకు మొత్తం 1,697 పోస్టులు ఉండగా, ఇందులో 422 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతోపాటు చాలా ప్రాంతాల్లో వైద్య సి బ్బంది స్థానకంగా ఉండకుండా విధులకు ఎగనా మం పెడుతున్నారు. సర్కారు వైద్యంపై ఉన్న అపనమ్మకం, అక్కడక్కడా అందని వైద్యంతో ప్రజలు గ్రామీణ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జ్వరమొచ్చి నా, నొప్పొచ్చినా స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయించే ప్రజలు లక్షల సంఖ్యలో ఉంటారు. వీరు ప్రభుత్వం గుర్తించకున్నా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. జబ్బులపై మెరుగైన శిక్షణ ఇస్తే బావుంటుందని ఆర్ఎంపీలు కోరుతున్నారు. వైఎస్ ఉంటే గుర్తింపు లభించేది.. వైఎస్ రాజ శేఖరరెడ్డి ఉన్నప్పుడు వ్యాధులపై మాకు శిక్షణ ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం శిక్షణ కార్యక్రమాలు నిలిపేశారు. పెద్దాయన ఉంటే మాకు గుర్తింపు లభించేది. - చందు, చింతపల్లి ఆర్ఎంపీ, దండేపల్లి శిక్షణ ఎందుకు నిలిపేశారో తెలియదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఆర్ఎంపీలకు వ్యాధులపై శిక్షణ ఇచ్చారు. కానీ ఆయన మరణించిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. శిక్షణ కార్యక్రమాలు జరగలేదు. - డాక్టర్ అరవింద్. సూపరింటెండెంట్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రి -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
నిర్మల్, న్యూస్‌లైన్ : రైతుల సమస్యలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన ధర్నాలో భాగంగా పార్టీ నిర్మల్ నియోజకవర్గశాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పంట లు నీట మునిగి రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సర్వేలు చేయక, పరిహారం రాక, ఆర్థిక ఇబ్బందులతో కలత చెంది ఎందరో రైతులు ఆ త్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అరుునా ప్రభుత్వం రైతు కుటుంబాలను ఆదుకోవడంలేదని విమర్శించారు. మరోవైపు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల ధరలు పెరగడంతో రైతు ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాడని తెలిపారు. చేతి కొచ్చే కొద్దిపాటి పంటకైనా మద్దతు ధర కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిం చారు. ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.7 వేలు, సోయాకు రూ.3,500 మద్దతు ధర కల్పించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, వారి పిల్లలకు ఉన్నత చదువులు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ రావుల రాంనాథ్, నాయకులు ఆడెపు సుధాకర్, పాకాల రాంచందర్, ఒడిసెల శ్రీనివాస్, మెడిసెమ్మ రాజు, పంతికె ప్రకాశ్, అయ్యన్నగారి రాజేందర్, రచ్చ మల్లేశ్, అయిండ్ల రమేశ్, రాజేశ్వర్‌రెడ్డి, నరేందర్, పంతికె నారాయణ, హరీశ్, సుధాకర్, మనోహర్, ఎస్పీ.రవి పాల్గొన్నారు.