
తెలంగాణకు 3 టీఎంసీలు: కృష్ణాబోర్డు
విద్యుత్ ఉత్పత్తి కోసం నవంబర్ రెండో తేదీ వరకు 3 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా వాటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై నవంబర్ 15 తర్వాత పునస్సమీక్షించాలని నిర్ణయించారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య పలు విడతలుగా చర్చలు జరిగినా, ఓ నిర్ణయానికి రావడంలో విఫలమయ్యారు.
దాంతో కృష్ణాబోర్డు స్వయంగా తానే ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తదితరులు చర్చిస్తున్నట్లు సమాచారం. కృష్ణాబోర్డు నిర్ణయంపై తెలంగాణ సర్కారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.