మళ్లింపు జల వివాదం మరింత జఠిలం
గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటి వాటాలపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించేందుకు ఏపీ సర్కారు పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఎత్తిపోతలను చేపట్టిన నేపథ్యంలో ఆ మేరకు ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై తెలంగాణ, ఏపీల మధ్య నెలకొన్న వివాదం ఎటూ తేలడంలేదు. గతేడాది ఏపీ ఏకంగా 53 టీఎంసీల మేర గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలించుకున్నా రాష్ట్రానికి చుక్క వాటా ఇవ్వకపోవడం వివాదాన్ని జఠిలం చేస్తోంది. ఇది గత ట్రిబ్యునల్ తీర్పును ధిక్క రించడమేనని తెలంగాణ చెబుతున్నా.. ఏపీ నుంచి స్పందన లేకపోవడం, కృష్ణాబోర్డు, ఏకే బజాజ్ కమిటీలు ఈ అంశంపై చేతులెత్తే యడంతో వివాదం మరింత ముదిరింది.
గోదావరి ట్రిబ్యునలే తేల్చాలి...
అయితే పోలవరం, పట్టిసీమల ద్వారా ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలపై ఏపీ మరోమారు తెలంగాణను ఇరకాటంలో పెట్టే యత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చే అధి కారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు లేదని ఏపీ కొత్త వాదనను తెరపైకి తెస్తోంది. ఆ అధికా రం గోదావరి వివాద పరిష్కార ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందంటోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ జలాలపై గోదావరి ట్రిబ్యున ల్ మాత్రమే పునఃసమీక్ష చేయగలదని, బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కు ఆ అధికారం లేదని తేల్చిచెప్పిం ది. కాగా, గత ఏడాది జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పట్టిసీమ నీటి తరలింపు అంశం కేడబ్ల్యూడీటీ–2 తేల్చాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తమైనం దున ఈ అంశంలో జోక్యం చేసుకోబోమని కృష్ణా బోర్డు చెబుతోంది. దీనిపై నియమిం చిన ఏకే బజాజ్ కమిటీ కూడా చేతులెల్తేసింది.
వాటా దక్కాల్సిందే..
1978 గోదావరి అవార్డు ప్రకారం..పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి.80 టీఎంసీల కేటాయింపు ల్లో 21టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు పోగా 45 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి వస్తాయని ఒప్పందంలో ఉంది. ప్రస్తుతం ఎగువ రాష్ట్రం తెలంగాణే అయి నందున ఈ నీటి వాటా హక్కు తమదే అని తెలంగాణ అంటోంది. పోలవరం కాకుండా ఇంకా ఏదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదా వరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణంలో పైరాష్ట్రాలకు వాటా ఉం టుందని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి అవార్డు తీర్పుల ప్రకారమే పట్టిసీమ కింద దక్కే 45 టీఎంసీలలో ఎస్‌ఎల్‌బీసీకి 30 టీఎంసీలు, మరో 15 టీఎంసీలు ఉదయ సముద్రానికి కేటాయించాలని రాష్ట్రం ఇటీవలే కేంద్రాన్ని కోరింది.