కృష్ణాడెల్టాకు నీరిస్తే తెలంగాణకే లబ్ధి
కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికే లబ్ధి చేకూరిందని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇలా డెల్టాకు నీరు విడుదల చేయడం వల్ల తెలంగాణ ప్రాంతానికి 237 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ఉత్పత్తి అయ్యిందని ఆయన అన్నారు. దీని వల్ల తెలంగాణలో విద్యుత్ కొరత బాగా తగ్గిందని ఉమామహేశ్వరరావు చెప్పారు.
అయితే.. సాగర్ నుంచి 7 టీఎంసీల నీరు విడుదలైతే, ప్రకాశం బ్యారేజికి వచ్చింది మాత్రం 3 టీఎంసీలేనని, అందువల్ల డెల్టా ప్రాంత తాగునీటి అవసరాలు తీరేందుకు మిగిలిన నీరు కూడా విడుదల చేయాలని మంత్రి ఉమా మహేశ్వరరావు కోరారు.