సాక్షి, హైదరాబాద్: నీటి వినియోగంపై తెలంగాణ–ఏపీ రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం తలెత్తేలా ఉంది. తెలంగాణకు నీటి సరఫరా నిలిపివేయాలంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తాజాగా ఏపీ లేఖ రాయడమే ఇందుకు కారణం. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలను ఏపీకి 63.13 శాతం, తెలంగాణకు 36.87 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఏపీ మొత్తం 75.74 శాతం నీటిని వినియోగించుకుంది. అంటే పది శాతం నీటిని అధికంగా వాడుకుంది. తెలంగాణ విషయానికి వస్తే... 24.26 శాతం నీటిని మాత్రమే వినియోగించుకుంది. తెలంగాణ కేవలం 34.10 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోగా.. ఇంకా 48.4 టీఎంసీలను వాడుకోవాల్సి ఉంది. అయితే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్‌ఎస్పీ)కు పంపకూడదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ఇప్పటికే 110 టీఎంసీలు తీసుకెళ్లింది. తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నందున, తెలంగాణ శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా నీటిని ఎన్‌ఎస్పీకి విడుదల చేస్తే నీటి మట్టం తగ్గి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఏపీ బోర్డుకు లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment