182 టీఎంసీలకు నాగార్జున సాగర్ నీటి నిల్వ
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 3,69,866 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 537.4 అడుగుల వద్ద 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 130 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో పది గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. తుంగభద్రలో కూడా వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311 మీటర్ల(సముద్రమట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాదహెచ్చరికను జారీచేసి నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది.
గోదావరిలో తగ్గుతున్న వరద
వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద క్రమేణా తగ్గుతోంది దీంతో మేడిగడ్డ బరాజ్‌లోకి 3.62 లక్ష లు, తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 6.26, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 8.07 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వచి్చన వరదను వచి్చనట్టుగా వదిలేస్తున్నారు. భద్రా చలం వద్ద వరద 8.41 లక్షల క్యూసె క్కులకు తగ్గడంతో నీటిమట్టం 40 అడుగులకు తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment