Krishna flood
-
మూడు, నాలుగు రోజుల్లో నిండనున్న సాగర్
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 3,69,866 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 537.4 అడుగుల వద్ద 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 130 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో పది గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. తుంగభద్రలో కూడా వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311 మీటర్ల(సముద్రమట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాదహెచ్చరికను జారీచేసి నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది. గోదావరిలో తగ్గుతున్న వరదవర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద క్రమేణా తగ్గుతోంది దీంతో మేడిగడ్డ బరాజ్‌లోకి 3.62 లక్ష లు, తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 6.26, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 8.07 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వచి్చన వరదను వచి్చనట్టుగా వదిలేస్తున్నారు. భద్రా చలం వద్ద వరద 8.41 లక్షల క్యూసె క్కులకు తగ్గడంతో నీటిమట్టం 40 అడుగులకు తగ్గింది. -
‘కృష్ణా’లో నీటి లభ్యత 2,048 టీఎంసీలే
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 3,144.41 టీఎంసీలు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇందులో వాడుకోదగినవి 2,048.25 టీఎంసీలు మాత్రమేనని తేల్చింది. ‘కృష్ణా’లో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు (పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు)గా 1976లో బచావత్ ట్రిబ్యునల్ తేల్చింది. బచావత్ ట్రిబ్యునల్ లెక్కగట్టిన దానికంటే ప్రస్తుతం ‘కృష్ణా’లో వాడుకోదగినవిగా సీడబ్ల్యూసీ తేల్చిన జలాలు 12 టీఎంసీలు తక్కువగా ఉండటం గమనార్హం. కృష్ణా నదిలో వరద రోజులు తగ్గడం.. వరద వచ్చినప్పుడు ఒకేసారి గరిష్టంగా రావడం.. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టి మళ్లించే సదుపాయాలు లేకపోవడంవల్ల కడలిలో కలిసే జలాల పరిమాణం అధికంగా ఉందని.. అందువల్లే ‘కృష్ణా’లో వాడుకోదగిన జలాల పరిమాణం తగ్గుతోందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని నదులలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే.. వాడుకోడానికి అవకాశం ఉన్నది 34.51 శాతమే ► దేశంలోని నీటి లభ్యతలో గంగా నది మొదటి స్థానంలో నిలిస్తే. గోదావరి రెండో స్థానంలో ఉంది. ‘కృష్ణా’ మూడో స్థానంలోనూ.. మహానది, నర్మద నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. పెన్నా నది 15వ స్థానంలో నిలిచింది. ► హిమాలయ నదులు, ద్వీపకల్ప నదుల్లో ఏడాదికి సగటున 70,601.08 టీఎంసీల లభ్యత సామర్థ్యం ఉంది. ఇందులో వినియోగించుకోవడానికి అవకాశమున్నది 24,367.12 టీఎంసీలే(34.51 శాతం). వరదలను ఒడిసిపట్టి, మళ్లించే సామర్థ్యం లేకపోవడంవల్ల 65.49 శాతం (46,233.96 టీఎంసీలు) జలాలు కడలిలో కలుస్తున్నాయి. ► గంగా నది పరివాహక ప్రాంతం (బేసిన్) 8,38,803 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగాలో నీటి లభ్యత సామర్థ్యం ఏటా 17,993.53 టీఎంసీలు ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 8,828.66 టీఎంసీలు. ► అలాగే, గోదావరి బేసిన్ 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో నీటి లభ్యత సామర్థ్యం ఏడాదికి సగటున 4,157.94 టీఎంసీలు. ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 2,694.5 టీఎంసీలే. పెన్నాలో జలరాశులు అపారం ఇక పెన్నా నది వర్షఛాయ (రెయిన్ షాడో) ప్రాంతమైన కర్ణాటకలోని నందిదుర్గం కొండల్లో పురుడుపోసుకుని.. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల మీదుగా ప్రవహించి 597 కి.మీల దూరం ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దేశంలో అతిపెద్ద నదుల్లో పెన్నాది 15వ స్థానం. ఈ నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 389.16 టీఎంసీలని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో వాడుకోదగిన జలాలు 243.67 టీఎంసీలని తేల్చింది. గత నాలుగేళ్లుగా పెన్నా బేసిన్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటం వల్ల నీటి లభ్యత పెరిగిందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
కృష్ణాలో పెరుగుతున్న వరద..
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరగ్గా.. బేసిన్లో వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,54,343 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ.. స్పిల్ వే పదిగేట్లను 12 అడుగులు ఎత్తి 3,19,350, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,348.. కలిపి 3,81,698 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3,40,387 క్యూసెక్కులు చేరుతున్నాయి. జలాశయంలో 589 అడగుల్లో 309.05 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే 18 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 3,00,774 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2,56,309 క్యూసెక్కులు చేరుతోంది. 169.72 అడగుల్లో 37.95 టీఎంసీల నీటిని నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 2,62,583 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,86,684 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం కూడా కృష్ణాలో ఇదేరీతిలో వరద కొనసాగనుంది. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక గోదావరిలో పోలవరం ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,20,635 క్యూసెక్కుల వరద చేరుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 13.90 అడుగులకు చేరింది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 13,11,835 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 42.50 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33.510 మీటర్లకు చేరింది. -
మళ్లీ మహోగ్రం.. పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టికి దిగువన తుంగభద్ర, వేదవతి, భీమా పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణాలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,26,201 క్యూసెక్కులు చేరుతుండగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 12,500, హంద్రీ–నీవా ద్వారా 1,125, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,091 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్‌వే పది గేట్లను 15 అడుగుల మేర పైకి ఎత్తి 3,76,670 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. బుధవారం నుంచి గురువారం వరకు కుడిగట్టు కేంద్రంలో 15.201 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.761 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. 589 అడుగుల్లో సాగర్ శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 4,23,819 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్‌లో 589 అడుగుల్లో 309.06 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 75.50 మీటర్లకుగానూ 73.46 మీటర్లకు చేరుకుంది. పులిచింతలలోకి 3,67,262 క్యూసెక్కులు చేరుతుండగా 169.55 అడుగుల్లో 37.73 టీఎంసీలను నిల్వ చేస్తూ 3,98,349 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వందేళ్లలో రికార్డు వరద.. పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి సానువుల్లో జన్మించి దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే హగరి లోయ గుండా ప్రవహించే వేదవతి (హగరి) వందేళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చింది. అనంతపురం జిల్లాలోని భైరవానితిప్ప ప్రాజెక్టు నిండిపోయింది. ప్రాజెక్టు(బీటీపీ)లోకి 62,085 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బీటీపీ చరిత్రలో ఇదే అత్యధిక వరద. బీటీపీ నుంచి దిగువకు వదిలేస్తున్న జలాలు తుంగభద్ర మీదుగా సుంకేశుల బ్యారేజ్‌లోకి, అక్కడి నుంచి శ్రీశైలంలోకి చేరుతున్నాయి. పెన్నా పరవళ్లు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెన్నా నది మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని అప్పర్ పెన్నార్ ప్రాజెక్టులోకి 16,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటి నిల్వ ఇప్పటికే గరిష్ట స్థాయి 1.52 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి 21,030 క్యూసెక్కులు చేరుతున్నాయి. పీఏబీఆర్ సామర్థ్యం 11.1 టీఎంసీలు కాగా నిర్మాణ లోపంతో గరిష్ట స్థాయిలో నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. పీఏబీఆర్‌లో 5.78 టీఎంసీలను నిల్వ చేస్తూ 13,770 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్‌లోకి 15,329 క్యూసెక్కులు చేరుతున్నాయి. రిజర్వాయర్ నీటి నిల్వ గరిష్ట స్థాయి 4.96 టీఎంసీలకు చేరుకోవడంతో 16,125 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మిడ్ పెన్నార్ చరిత్రలో ఇదే అత్యధిక వరద. చాగల్లు రిజర్వాయర్‌లోకి 24,990 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 1.8 టీఎంసీలు కాగా 0.86 టీఎంసీలను నిల్వ చేసి 25 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. చాగల్లు చరిత్రలోనూ ఇదే గరిష్ట వరద. గండికోట ప్రాజెక్టులోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా నీటి నిల్వ గరిష్టంగా 25.37 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మైలవరం రిజర్వాయర్‌లో 9.98 టీఎంసీలకుగానూ 5 టీఎంసీలను నిల్వ చేస్తూ 32 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు 78 టీఎంసీలకుగానూ ఇప్పటికే 72.14 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 11,893 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు కాలువ ద్వారా 8 వేలు, విద్యుదుత్పత్తి చేస్తూ 2,453 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. కండలేరు రిజర్వాయర్‌లోకి 7,790 క్యూసెక్కులు చేరుతుండటంతో నిల్వ 47 టీఎంసీలకు చేరుకుంది. మరో 21 టీఎంసీలు చేరితే కండలేరు నిండిపోనుంది. సోమశిల రిజర్వాయర్‌కు దిగువన కొత్తగా నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 0.45 టీఎంసీలు, నెల్లూరు బ్యారేజ్‌లో 0.4 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి సోమశిలకు వరద ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నారు. సంగం, నెల్లూరు బ్యారేజ్‌లలోకి పెరిగే వరద ప్రవాహాన్ని బట్టి మిగులు జలాలను గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేయనున్నారు. నేడు బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక! ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజ్‌లోకి 2,73,222 క్కూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 15,472 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,57,750 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి బ్యారేజ్‌లోకి శుక్రవారం ఉదయానికి నాలుగు లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేస్తున్నారు. -
కృష్ణా, గోదావరిలో మరింత తగ్గిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) వర్షపాత విరామంతో నదుల్లో వరద ప్రవాహం క్రమేణ తగ్గుతోంది. జూరాల, సుంకేశుల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్న కృష్ణాజలాల ప్రవాహం 1,76,232 క్యూసెక్కులకు తగ్గింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి, హంద్రీ–నీవా ద్వారా 21,288 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ, స్పిల్ వే మూడు గేట్లను పదడుగులు ఎత్తి మొత్తం 1,46,469 దిగువకు వదులుతున్నారు. సాగర్‌లోకి 97,724 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువల ద్వారా 20,039 క్యూసెక్కులు తరలిస్తున్నారు. ప్రధాన విద్యుత్కేంద్రం, స్పిల్ వే గేట్ల ద్వారా 76,305 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక్కడ 171.14 అడుగుల్లో 38.55 టీఎంసీలను నిల్వచేస్తూ.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 58,562 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,10,527 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,037 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిగిలిన 95,490 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సాధారణ స్థాయికి గోదావరి వర్షాలు తెరపి ఇవ్వడంతో ఉపనదుల్లో వరద తగ్గి గోదావరిలో ప్రవాహం సాధారణ స్థాయికి చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 4,89,531 క్యూసెక్కులు చేరుతుండగా, గోదావరి డెల్టాకు 9,467 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 4,80,064 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. స్థిరంగా వంశ‘ధార’ వంశధార నదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 24,399 క్యూసెక్కులు చేరుతుండగా, వంశధార ఆయకట్టుకు 2,231 క్యూసెక్కులను, 19,636 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 8,649 క్యూసెక్కులు చేరుతుండగా, ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులను విడుదల చేస్తూ, 1,851 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. -
గోదావరి, కృష్ణాలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో వర్షాలు తగ్గడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.8 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంలో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,05,222 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,94,222 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు కృష్ణాలో వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్, భీమాపై ఉన్న ఉజ్జయిని డ్యామ్‌లు నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలంలో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 2,25,787 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువ ద్వారా 9,104, ఎడమ కాలువ ద్వారా 8,108, ఏఎమ్మార్పీ ద్వారా 2,400, వరద కాలువ ద్వారా 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,195 క్యూసెక్కులు, స్పిల్ వే 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,73,580 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586 అడుగుల్లో 301.1 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న జలాల్లో పులిచింతలలోకి 2,01,752 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,31,213 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 8 వేలు వెరసి 1,39,213 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 169.71 అడుగుల్లో 37.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,36,531 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,901 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 1,23,630 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీ: వంశధార, నాగావళి నదులు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 48,583 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆయకట్టుకు 1,665 క్యూసెక్కులు, కడలిలోకి 38,307 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 23,330 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 21,256 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
వడివడిగా ఒడిసిపడుతూ
సాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉద్ధృతికి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌లు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. కడలిలో కలిసే సమయంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించుకున్నా వాటిని నికర జలాల్లో(కోటా) కలపకూడదన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కృష్ణా బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ అన్ని ప్రాజెక్టులనూ వరద జలాలతో నింపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుడిగట్టు ప్రధాన కాలువ ద్వారా వరద జలాలను తరలిస్తూ– తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లో అంతర్భాగమైన ప్రాజెక్టులను నింపడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 14 వేల క్యూసెక్కులతో ప్రారంభించి గరిష్టంగా 44 వేల క్యూసెక్కులను తరలించి ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన నింపేలా చర్యలు చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువలోకి 1,688 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ సామర్థ్యం కంటే అధికంగా అంటే 40 టీఎంసీల కంటే ఎక్కువగా తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని రీతిలో పెన్నా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ప్రాజెక్టులకు జలకళ చేకూరింది. కృష్ణా ఉప నదులైన వేదవతి, హంద్రీలు ఉరకలెత్తుతుండటంతో వాటిపై ఉన్న భైరవానితిప్ప ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. తుంగభద్ర డ్యామ్‌లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువ(ఎల్లెల్సీ)లకు కోటా జలాలు వస్తాయి. తుంగభద్ర డ్యామ్ దిగువన తుంగభద్రలో నీటి లభ్యత మెరుగ్గా ఉండటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందనున్నాయి. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. -
కృష్ణా, గోదావరి పోటాపోటీ
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్/ధవళేశ్వరం/విజయపురిసౌత్/గాంధీనగర్(విజయవాడ సెంట్రల్)/: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి నదులు వరద ఉధృతితో పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్ర మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రమాద హెచ్చరికను ఎగురవేసి ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే.. మహారాష్ట్ర, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశాలలో కురుస్తున్న వర్షాలకు పెన్ గంగ, ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉరకలెత్తుతుండటంతో గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహం పెరుగుతోంది. ఇక్కడ మంగళవారం సా.6 గంటలకు 9,74,666 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 44 అడుగులకు చేరుకుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. మరోవైపు..కృష్ణా, గోదావరి నదుల్లో బుధవారం వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అప్రమత్తం చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత.. కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరదకు తోడు వాగులు, వంకల వరద తోడవవుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. మంగళవారం సా.6 గంటలకు 2,72,943 క్యూసెక్కులు చేరుతుండటంతో.. ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,95,559 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,617 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.7 అడుగుల్లో 213.88 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక సాగర్‌లోకి 1,91,646 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 577.6 అడుగుల్లో 276.09 టీఎంసీలకు చేరుకుంది. మరో 36 టీఎంసీలు వస్తే రెండ్రోజుల్లో సాగర్ నిండిపోతుందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రకాశం బ్యారేజ్‌లోకి భారీ వరద సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదులుతున్న నీటికి మూసీ, వైరా జలాలు తోవడవుతండటంతో పులిచింతలలోకి 30,197 క్యూసెక్కులు చేరుతున్నాయి. ముప్పు నివారణ కోసం ప్రాజెక్టులో కొంతభాగాన్ని ఖాళీచేస్తూ.. స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 51,831 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 40.07 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి దిగువకు వదిలేస్తున్న నీటికి.. పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుంటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,07,985 క్యూసెక్కులు చేరుతోంది ఇక్కడ నుంచి 70 గేట్లు ఎత్తి 1,00,590 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరదెత్తిన వంశధార.. ఇక ఒడిశా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వంశధారలో వరద ఉధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 21,004 క్యూసెక్కులు చేరుతుండగా.. ముంపు ముప్పును నివారణకు 22,040 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నది నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 10,200 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోలవరం వద్ద అప్రమత్తం ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకూ వరద ప్రవాహాన్ని అంచనావేస్తూ.. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తూ వరదను సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు. మంగళవారం సా.6 గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 6,92,948 క్యూసెక్కులు చేరుతుండటం.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 33.06, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 23.14 మీటర్లకు చేరుకుంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు.. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 7,81,627 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
శ్రీశైలంలోకి 1.46 లక్షల క్యూసెక్కులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొళగుంద: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు 1,46,278 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 51.43 టీఎంసీలకు చేరుకుంది. ఇది నిండాలంటే ఇంకా 164 టీఎంసీలు అవసరం. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 831.90 అడుగులకు చేరుకుంది. అలాగే, కృష్ణా బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కృష్ణా, ప్రధాన ఉప నదులు తుంగభద్ర, బీమా వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 1.33 లక్షల క్యూసెక్కుల (11.50 టీఎంసీలు)ను,, తుంగభద్ర డ్యామ్ నుంచి అన్నిగేట్లు ఎత్తి 1.41 లక్షల క్యూసెక్కులు (12.21 టీఎంసీలు)ను విడుదల చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన నీరు వచ్చినట్లు కిందకు విడుదల చేస్తున్నారు. ఈ మొత్తం ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. బీమాపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 34 టీఎంసీలు చేరితే నిండిపోతుంది. ఇదే రీతిలో బీమాలో వరద కొనసాగితే.. ఆరు రోజుల్లో ఉజ్జయిని నిండిపోతుంది. ఆ తర్వాత ఉజ్జయిని గేట్లు ఎత్తి బీమా వరదను దిగువకు విడుదల చేయక తప్పని పరిస్థితి. బీమా వరద జూరాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. సీజన్ ఆరంభంలోనే ఉజ్జయిని ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం రెండు దశాబ్దాల్లో ఇదే ప్రథమం.2019, 2020, 2021 తరహాలో ఈ ఏడాదీ రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తుంగభద్ర వరదతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల రిజర్వాయర్ కూడా పోటెత్తుతోంది. దీంతో పదిగేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. -
Andhra Pradesh Rains: వానలే వానలు.. వరదెత్తిన నదులు
సాక్షి,అమరాతి/సాక్షినెట్‌వర్క్: పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, కృష్ణా నదులు వరదెత్తాయి. తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో శనివారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తుండటంతో తెలంగాణలోని ఎస్సారెస్సీ రెండు రోజుల్లో నిండనుంది. ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో సమ్మక్క బ్యారేజీ వద్దకు ఆదివారం ఉదయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంచేరింది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం అర్ధరాత్రికి భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరుకోనుంది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో.. వరద ముప్పును తప్పించడానికి ముందుగా పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీలను అధికారులు ఖాళీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,67,782 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 6,350 క్యూసెక్కులు విడుదల చేసి, మిగులుగా ఉన్న 1,60,432 క్యూసెక్కులను ధవళేశ్వరం ఆర్మ్, ర్యాలీ ఆర్మ్, మద్దూరు ఆర్మ్, విజ్జేశ్వరం ఆర్మ్‌లలోని మొత్తం 175 గేట్లు ఎత్తి కడలిలోకి వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఎగువ నుంచి భారీ వరదను దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి పోలవరం ప్రాజెక్టు వద్దకు 10–12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 30.1 మీటర్లకు చేరింది. దీంతో మొత్తం 48 రేడియల్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇదిలా ఉండగా, ఎప్పుడూ లేని విధంగా జూలైలోనే భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాల వల్ల కూడా పనులు చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. గంటకు 25 సెంటీమీటర్ల చొప్పున గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. దీంతో దిగువ కాఫర్ డ్యామ్, గ్యాప్–2 పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కాగా, ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జల వనరుల శాఖ అధికారులు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ.. వరద ముప్పును తప్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణ కంటే తుంగభద్రకే ఎక్కువ వరద కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, ఉప నదులు పోటెత్తాయి. కృష్ణా కంటే దాని ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 91 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం గరిష్ట సామర్థ్యం 101 టీఎంసీలు. దీంతో కొద్ది గంటల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆ వరద జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా మూడు నాలుగు రోజుల్లో శ్రీశైలానికి చేరుకుంటాయి. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టిలోకి 75 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ 79.74 టీఎంసీలకు చేరుకుంది. ఆల్మట్టి, దాని దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయాలు నిండాలంటే మరో 55 టీఎంసీలు అవసరం. మరో రెండు రోజులు పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో కృష్ణా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఆ రెండు జలాశయాలు నిండితే.. ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకోనుంది. తెలంగాణలోని మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంతో పులిచింతల్లోకి వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతలకు దిగువన పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి 20 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఉత్తరాంధ్రలోనూ వరదలు బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజీలోకి 4,135 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,343 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్టకు చేరుకుంటున్నాయి. దీంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 4,900 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 2,778 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ప్రాజెక్టు కాలువలకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న 2,307 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉరకలెత్తుతుండటంతో చెరువులు.. చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల్లోకి వరద జలాలు చేరుతున్నాయి. మరో 5 రోజులు వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఏలూరు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో సగటున 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 9.2 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనరసుపేటలో 8.2, ఎన్టీఆర్ జిల్లా అట్లప్రగడ కొండూరులో 8.1, ఏలూరు జిల్లా లింగపాలెం, చింతలపూడి, కొయ్యలగూడెం, నూజివీడులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తిరువూరు, కుక్కునూరు, గజపతినగరం, భీమడోలు, దవళేశ్వరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, కైకలూరు తదితర ప్రాంతాల్లో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ► ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, పడమటి వాగు, వైరా, మున్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కట్టలేరు ఉధృతితో గంపల గూడెం మండలంలో 14 గ్రామాలకు రాకపోకలు నిలిపోయాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పత్తి, వరి పంటలకు ఊపిరి పోస్తున్నాయి. వరినాట్లు, పసుపు పంట వేసుకొనేందుకు ఈ వర్షాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లా పొల్లూరు, మోతుగూడెం పిక్నిక్ స్పాట్ సమీపంలో దుయం భారీ కొండ చరియలు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రానికి ఉద్యోగులు మరో మార్గం గుండా చుట్టూ తిరిగి వెళ్లారు. ఏపీ జెన్కో ఇంచార్జ్ సీఈ వెంకటేశ్వరరావు, ఈఈ బాబురావు కొండ చరియలు పడిన ప్రాంతాన్ని సందర్శించారు. రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. -
నదులన్నీ కడలి వైపు ఉరకలు
సాక్షి, అమరావతి: వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి, పెన్నా నదులు కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. శ్రీశైలంలోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 1.64 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు చేరుతుండటంతో నీటి నిల్వ 168.63 టీఎంసీలకు పెరిగింది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న నీటిలో 10,480 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి చేరుతుండటంతో నీటి నిల్వ 305.86 టీఎంసీలకు చేరుకుంది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ ఉరకలెత్తుతుండటం.. దానికి కృష్ణా వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 45,608 క్యూసెక్కులు చేరుతోంది. నీటి నిల్వ 32.25 టీఎంసీలకు చేరుకుంది. సిŠప్ల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,513 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,10,191 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 7,991 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 1,02,200 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదా‘వడి’ పెరుగుతోంది గోదావరిలోకి భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.32 లక్షల క్యూసెక్కులు వస్తోంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 3.27 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి వంశధార, నాగావళి పరవళ్లు ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా వంశధార, నాగావళిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి వంశధార నుంచి 7,133 క్యూసెక్కులు చేరుతుండగా.. 7వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి ప్రవాహంతో తోటపల్లి, నారాయణపురం ఆనకట్టల్లో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో నారాయణపురం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల నాగావళి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. పెన్నా బేసిన్లో రిజర్వాయర్లు కళకళ పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగింది. గండికోట ప్రాజెక్టు ఇప్పటికే నిండిపోయింది. సోమశిల ప్రాజెక్టులోకి 22,792 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 70.40 టీఎంసీలకు చేరుకుంది. మరో 8 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు నిండిపోతుంది. కండలేరులో నీటి నిల్వ 53.76 టీఎంసీలకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 15 టీఎంసీలు అవసరం. నాతవరం: తాండవ జలాశయ నీటిమట్టం మంగళవారం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అప్రమత్తమైన ప్రాజెక్ట్ అధికారులు స్పిల్‌వే గేట్ల ద్వారా వరద నీటిని తాండవ నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా.. మంగళవారం మధ్యాహ్నానికి 379.2 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,500 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలో చేరుతోంది. రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా 1200 క్యూసెక్కులు నదిలోకి విడుదల చేశారు. రైవాడ ప్రమాదస్థాయి నీటి మట్టం 114.25 మీటర్లు కాగా.. ప్రస్తుతం 108.25 మీటర్లకు చేరింది. కోనాం ప్రమాద స్ధాయి నీటిమట్టం 101.24 మీటర్లు కాగా.. ప్రస్తుతం 98.45 మీటర్లు, మేఘాద్రిగెడ్డ ప్రమాదస్థాయి నీటిమట్టం 61 అడుగులు కాగా.. 58 అడుగులకు చేరింది. పెద్దేరు ప్రమాదస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా మంగళవారం సాయంత్రానికి 136.60 మీటర్లకు చేరింది. -
రేపు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి కృష్ణానది వరద ప్రవాహానికి.. సుంకేశుల నుంచి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. ప్రాజెక్టులో 883.5 అడుగుల్లో నీటి మట్టాన్ని నిర్వహిస్తూ.. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి వరద జలాలను దిగువకు వదిలేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రాల నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జున సాగర్‌లోకి 4.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 573.5 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 264 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 48 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికి సాగర్‌లో నీటి నిల్వ 300 టీఎంసీలకుపైగా చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాగర్ గేట్లను ఎత్తేస్తామని అధికారులు తెలిపారు. సాగర్‌లో విద్యుదుత్పత్తి చేస్తూ విడుదల చేస్తున్న జలాల్లో పులిచింతల ప్రాజెక్టులోకి 38,701 క్యూసెక్కులు చేరుతున్నాయి. పులిచింతలలో విద్యుదుత్పత్తి చేస్తున్న తెలంగాణ సర్కార్ 38,701 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ఇందులో ప్రకాశం బ్యారేజీలోకి 35,346 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 8,634 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 26,712 క్యూసెక్కులను.. 36 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
‘కృష్ణా’లో వరద హోరు
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం.. పి.గన్నవరం: పశ్చిమ కనుమల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, ఉప నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. దీంతో సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.17 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 150 టీఎంసీలకు చేరుకుంది. ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కార్ దిగువకు వదులుతున్న 25,427 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు చేరుతున్నాయి. సాగర్‌కు దిగువన మూసీ ప్రవాహం కృష్ణా నదిలోకి కొనసాగుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 10,600 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని కూడా తెలంగాణ సర్కార్ దిగువకు వదిలేస్తోంది. ఈ ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 37,712 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాలువలకు 4,322 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 33,390 క్యూసెక్కులను 45 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 35 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యాయి. మరోవైపు వరద ఉధృతితో తుంగభద్ర డ్యామ్ నిండిపోయింది. దీంతో గేట్లు ఎత్తేసి దిగువకు 1.49 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆ జలాలు మంగళవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరనున్నాయి. గోదా‘వడి’ తగ్గింది.. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు 5,76,833 క్యూసెక్కుల వరద చేరింది. స్పిల్ వే వద్ద వరద నీటిమట్టం 31.88 మీటర్లకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా పోలవరం స్పిల్ వే 42 గేట్ల నుంచి దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 7,93,468 క్యూసెక్కులకు తగ్గడంతో నీటిమట్టం 10.85 మీటర్లకు తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 10,200 క్యూసెక్కులు వదిలి.. మిగులుగా ఉన్న 7,83,268 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి వచ్చే వరద మంగళవారం మరింత తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలోని వశిష్ట, వైనతేయ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిలంక, బూరుగులంక గ్రామాలతోపాటు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులో ఉన్న అనగర్లంక, పెదమల్లంక, సిర్రావారిలంక, అయోధ్యలంక, కనకాయలంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. -
గోదావరి 'ఉగ్రరూపం'
సాక్షి, అమరావతి/కొవ్వూరు: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోటెత్తి ప్రవహిస్తోంది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు పొంగి గోదావరికి వరద పెరిగింది. తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి బ్యారేజీలు, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కడెం జలాశయాల గేట్లన్నీ ఎత్తేసి దిగువకు భారీగా వరదను విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గంటగంటకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. నీటిమట్టం 27.7 మీటర్లకు చేరింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువనుంచి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పోలవరం వద్దకు నాలుగు లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 62,219 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మిగులుగా ఉన్న 63,608 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నేడు ప్రకాశం బ్యారేజీకి 30 వేల క్యూసెక్కులు? ఎగువ నుంచి వస్తున్న వరదకు తుంగభద్ర ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 21 వేల క్యూసెక్కులను వదిలేస్తుండటంతో శ్రీశైలం నీటిమట్టం పెరగడం లేదు. ప్రస్తుతం శ్రీశైలంలో 846 అడుగుల్లో 72.05 టీఎంసీల నీరుంది. తుంగభద్ర జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పశ్చిమ కనుమల్లో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో శ్రీశైలంలోకి మరో రెండు రోజుల్లో భారీవరద వచ్చే అవకాశం ఉందని అ«ధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 13 వేల క్యూసెక్కులు వస్తుండగా.. మూడువేల క్యూసెక్కులను డెల్టాకు విడుదల చేస్తూ మిగిలిన పదివేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో భారీవర్షాలు కురిసిన నేపథ్యంలో మున్నేరు, కట్టలేరు నుంచి వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరిలో వ్యక్తి గల్లంతు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన నెల్లూరి నగేష్ (50) అనే వ్యక్తి కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఎరువుల దుకాణం నడుపుకునే నగేష్ గురువారం నల్లజర్లలో రైతులకు ఎరువులు ఇచ్చేందుకు ఆటోలో వచ్చాడు. పని ముగిశాక అక్కడి నుంచి కొవ్వూరు చేరుకుని నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యాడు. -
కృష్ణా నది.. అదే ఉధృతి
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, అమరావతి బ్యూరో: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలోకి వరద విజృంభణ కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5,42,339 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 5,38,867 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ సీజన్లో.. జూన్ 1 నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు ప్రకాశం బ్యారేజీనుంచి 903.949 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గరిష్టంగా సముద్రంలో కలవడం గమనార్హం. శ్రీశైలంలోకి 5.98 లక్షల క్యూసెక్కులు.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,98,775 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా దిగువకు 5,90,087 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆదివారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. నాగార్జునసాగర్‌లోకి 5,39, 930 క్యూసెక్కులు చేరు తుండగా.. అంతే పరిమాణంలో దిగు వకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 5,62,371 క్యూసెక్కులు చేరుతుండగా 15 గేట్లను ఎత్తేసి అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. కాగా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గోదావరి నుం చి చేరుతున్న 2,72,652 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పెన్నా నదిలో స్థిరంగా వరద కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన గుంటూరు జిల్లాలో కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లూరు మండలం.. బొమ్మవానిపాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, భట్టిప్రోలు మండలం.. వెల్లటూరు, తాడేపల్లి మండలం.. చిర్రావూరుల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, కొల్లూరు కరకట్ట దిగువన వరద ప్రవాహంలో ఆవులవారిపాలెంకు చెందిన సనకా శంకరరావు (48), దాచేపల్లి మండలం పొందుగలలో జాన్ అహ్మద్ (18) గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా వెల్లటూరులో నీట మునిగిన పంట పొలాలను పడవలో వెళ్తూ పరిశీలిస్తున్న మంత్రులు శ్రీరంగనాథరాజు, సుచరిత, ఎమ్మెల్యే మేరుగ, అధికారులు -
మహోగ్ర వేణి
సాక్షి, అమరావతి, ఏపీ నెట్వర్క్: కృష్ణవేణి మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 7.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి వచ్చే వరద 6.92 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 11 గంటలకు 9 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. కృష్ణా నదీ గర్భంలో... ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనంతోపాటు 36 అక్రమ కట్టడాలను వరద చుట్టుముట్టింది. భారీగా వరద వస్తుందనే సమాచారాన్ని అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి మూడు రోజుల క్రితమే తెలియజేసిన అధికారులు.. తక్షణమే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించింది. కృష్ణా డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 6.89 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు దిగువన లింగాలగట్టు గ్రామానికి ముప్పు పొంచి ఉండటంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న జలాలకు మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 20 క్రస్ట్‌గేట్ల ద్వారా 8,55,857 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లంకల్ని ముంచిన వరద గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కొల్లూరు మండలంలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించి.. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా రేషన్ సరుకులు, కొవ్వొత్తులు, కూరగాయలు పంపాలని ఆదేశించారు. దాచేపల్లి మండలం రామాపురంలో మత్స్యకారుల కాలనీ నీట మునిగింది. ఇళ్ల పైనుంచి వరద ప్రవహిస్తోంది. పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీ నుంచి 32,929 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇదిలావుంటే.. గోదావరిలో ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,78,644 క్యూసెక్కులు చేరుతున్నాయి. శాంతించిన ఏలేరు తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఏలేరు వరద తగ్గుముఖం పట్టింది. ఏలేరు రిజర్వాయర్‌లో బుధవారం నుంచి రోజుకు 17 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేయగా శుక్రవారం ఉదయం 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలో ఇంకా ముంపు పూర్తిగా వీడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రుల పర్యటన ముంపునకు గురైన లంక ప్రాంతాల ఆక్వా రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు గ్రామాలైన శ్రీపర్రు కాజ్వే, జాలిపూడి, గుడివాకలంకలలో వారు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజలు, రైతులు ఆందోళనపడొద్దని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. -
కృష్ణాలో మళ్లీ పెరిగిన వరద
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలతో పాటు, తుంగభద్ర డ్యామ్ నుంచి, హంద్రీ నది నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో సోమవారం రాత్రి 9.30 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,01,944 క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏడు వేలు, హంద్రీ–నీవాకు 1,403 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న జలాలను ఆరు గేట్లు, కుడి గట్టు విద్యుత్కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీకి సోమవారం రాత్రి లక్ష క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా. -
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణా, పెన్నా, వంశధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర, హంద్రీ వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 1,58,230 క్యూసెక్కులు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు 1,66,994 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 6 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 1,39,685 క్యూసెక్కులు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 27,309 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం మధ్యాహ్నానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 86,330 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ► పులిచింతల ప్రాజెక్టులో 174.73 అడుగుల్లో 45.36 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 96,560 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 9700 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 87,775 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా కడలిలోకి వదులుతున్నారు. సోమశిలలోకి పెన్నా వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 95,491 క్యూసెక్కులు చేరుతుండగా.. కండలేరుకు 10,407 క్యూసెక్కులు వదులుతున్నారు. నేడు, రేపు తేలికపాటి వర్షాలు సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తులో, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో అమలాపురంలో 2 సెం.మీ., కైకలూరు, కుక్కునూరు, నూజివీడు, డెంకాడ, పూసపాటిరేగ, చెన్నెకొత్తపల్లిలో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పెన్‌గంగ, ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు 4,02,581 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.44 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు 8 వేల క్యూసెక్కులు మళ్లించి.. 2.36 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణాలో మరింత తగ్గిన ప్రవాహం ► కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత తగ్గింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి, విద్యుత్ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 37,297 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 215.3263 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.90 అడుగులకు చేరుకుంది. రాయలసీమ ప్రాజెక్టుల నీటి వాటా విడుదల కోసం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ► నాగార్జున సాగర్‌లోకి 15,357 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తికి వినియోగిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి ప్రవాహం 2,500 క్యూసెక్కులకు తగ్గింది. ► ప్రకాశం బ్యారేజీలోకి 31,630 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు మళ్లించి.. 27,739 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
వరదలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కృష్ణానదిలోకి భారీగా వరదజలాలు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లొస్పై వివరాలు తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈమేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను ఖాళీచేయించాలన్నారు. ఎప్పటికప్పుడు వరదను అంచనా వేసుకుని ఆమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలోనూ వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. ముంపు బాధితులకు ఆహారం, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టంచేశారు. -
‘సీమ’లో మూడు ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: కృష్ణా వరదను ఒడిసి పట్టి రాయలసీమ సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించే మూడు ఎత్తిపోతల పథకాలకు రూ.4.27 కోట్లతో తొలి దశ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. గత సెప్టెంబర్ 2వ తేదీన పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పీఏడీఏ) పరిధిలో చేపట్టాల్సిన పనులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మూడు ఎత్తిపోతల పథకాలకు పరిపాలనా అనుమతి ఇస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఆర్ సిద్ధమయ్యాక పనులు చేపట్టేందుకు రెండో దశ పరిపాలన అనుమతి మంజూరవుతుంది. వీటి ఆధారంగా టెండర్లు పిలుస్తారు. 1,050 క్యూసెక్కుల ఎత్తిపోత ఇలా.. గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 1,050 క్యూసెక్కుల చొప్పున కాలేటివాగు రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి 350 క్యూసెక్కులను ఎత్తిపోసి చక్రాయిపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో చెరువులను నింపుతారు. కాలేటివాగు రిజర్వాయర్ నుంచి 700 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి హంద్రీ–నీవా ప్రధాన కాలువలో 473 కి.మీ వద్దకు తరలిస్తారు. వెలిగల్లు, శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్లను నింపుతారు. ఈ పనుల డీపీఆర్ తయారీకి రూ.3.58 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.1,272 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. వేముల, వేంపల్లిలో 15 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ గాలేరు–నగరి ప్రధాన కాలువ నుంచి రోజుకు 240 క్యూసెక్కులను లిఫ్ట్ చేసి అలవపాడు చెరువు నింపుతారు. అక్కడి నుంచి పులివెందుల బ్రాంచ్ కెనాల్(పీబీసీ)లో 52 కి.మీ. వద్ద ఎత్తిపోసి వేముల, వేంపల్లి మండలాల్లో 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తారు. దీని డీపీఆర్ తయారీకి రూ.18 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.57 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి యర్రబల్లి చెరువును నింపడంతోపాటు పరిసర ప్రాంతాల్లోని లింగాల, పులివెందుల మండలాల్లో చెరువులు కూడా నింపుతారు. ఈ పనుల డీపీఆర్‌కు రూ.51 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు చేపట్టడానికి రూ.108 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. నీటి కష్టాల నుంచి విముక్తి.. వైఎస్సార్ జిల్లాలో పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో వెలిగల్లు రిజర్వాయర్ నిరి్మంచినా వర్షాభావంతో ఆయకట్టుకు నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పులివెందుల, లింగాల మండలాల్లో సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు గాలేరు–నగరి జలాలను వినియోగించుకునే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదముద్ర వేయడంతో నీటి కష్టాలు తీరనున్నాయి. -
శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద
సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం జలాశయంలోకి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న నీటిని పది గేట్లను ఎత్తి, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 4.35 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి నాగార్జునసాగర్‌లోకి 4.47 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.34 లక్షల క్యూసెక్కులను 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆ ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేస్తూ 4.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల వద్ద వరదను నియంత్రిస్తూ ప్రజలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతోంది. బ్యారేజీలోకి 2.10 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1.88 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకూ 589.937 టీఎంసీల కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. ఉత్తుంగ తరంగంలా.. నాలుగు రోజులుగా తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 1.44 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో 1.69 లక్షల క్యూసె క్కులు దిగువకు విడుదల చేశారు. దాంతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయి కి చేరింది. మంత్రాలయం, కర్నూలు వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి భారీగా వరద చేరుతోంది. బుధవారం ఎగు వ నుంచి భారీ వరద దిగువకు విడుదల చేయగా.. గురువారం కూడా నదీ పరీవాహక ప్రాంతం లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయా నికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. శ్రీశైలంలోకి మరింత వరద.. నదీ పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం పోటెత్తింది. ఆల్మట్టిలోకి 2.11 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు 2.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయం నుంచి 3.71 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఉజ్జయినిలోకి భీమా వరద ప్రవా హం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో మిగులుగా ఉన్న 65 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాలలోకి 3.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.84 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. -
ఏడోసారి వరద
సాక్షి, అమరావతి: ఈ సీజన్లో శ్రీశైలం జలాశయంలోకి ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం ఏడోసారి తరలి వస్తోంది. పశ్చిమ కనుమల్లో ఆదివారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో కృష్ణా వరద ప్రవాహం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి భారీ ఎత్తున చేరుతోంది. ప్రధాన ఉపనది తుంగభద్రలోనూ వరద ప్రవాహం పెరిగింది. భీమాలోనూ వరద ఉద్ధృతమైంది. ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర జలాశయాల్లోకి వచ్చిన వరద ప్రవాహాన్ని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం శ్రీశైలం జలాశయంలోకి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వరద ప్రవాహం నెలాఖరు వరకూ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలో 57 వేల క్యూసెక్కులు వస్తుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 77 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 209.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ తరుణంలో తాజాగా ఏడో దఫా శ్రీశైలంలోకి వరద ప్రవాహం వస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మొత్తమ్మీద ఈ సీజన్లో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీశైలంలోకి 1,415.84 టీఎంసీల వరద ప్రవాహం వచ్చింది. పుష్కర కాలం తర్వాత శ్రీశైలంలోకి వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గోదావరి, వంశధారలో స్థిరంగా వరద గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 82,797 క్యూసెక్కుల గోదావరి ప్రవాహం వస్తుండగా అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 6,151 క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో బంగాళాఖాతంలోకి వదులుతున్నారు. -
నష్ట పరిహారం.. ఇక 15 శాతం అదనం
సాక్షి, మచిలీపట్నం: ఆపత్కాలంలో అన్నదాతను ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. కళ్లెదుటే కష్టం అంతా వరదార్పణం కావడంతో పుట్టెడు నష్టాల్లో ఉన్న జిల్లా రైతాంగానికి కొండంత భరోసా కల్పించింది. సాధారణంగా విపత్తుల సమయంలో ఇచ్చే నష్ట పరిహారానికి మించి 15 శాతం అదనంగా రైతులకు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు క్షేత్ర పరిశీలన చేసిన అధికారులు ఉద్యాన వన పంటల నష్టంపై ప్రభుత్వానికి తుది నివేదికను అందించారు. ఇక వ్యవసాయ పంటలకు సంబంధించి నేడు తుది నివేదిక సమర్పించనున్నారు. పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 10 మండలాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురయ్యాయి. ఆగస్టు 13వ తేదీన ప్రారంభమైన వరదలు ఏకంగా వారం రోజుల పాటు కొనసాగాయి. దీంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. నష్టంపై అధికారులు తుది నివేదికను తయారు చేశారు. వారం రోజుల పాటు క్షేత్ర స్థాయి పరిశీలన వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లాయి. 19వ తేదీ నుంచి వారం రోజుల పాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో రైతు వారీగా పంటలను సర్వే చేశాయి. 33 శాతానికి మించి వాటిల్లిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు అంచనాలను రూపొం దించారు. ఆ విధంగా జిల్లాలో 1,134 మంది రైతులకు చెందిన 818 హెక్టార్లలో రూ.1.19 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు, 7,051 మంది రైతులకు చెందిన 4021.872 హెక్టార్లలో రూ.7.60కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా లెక్క తేల్చారు. 14 మండలాల్లో పంట నష్టం ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించారు. ఉద్యాన పంటలకే అపార నష్టం వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలకే అపార నష్టం వాటిల్లింది. తోట్లవల్లూరు మండలంలో ఏకంగా 2,382.86 హెక్టార్లు, మోపిదేవి మండలంలో 338.93 హెక్టార్లు, చల్లపల్లి మండలంలో 296.70హెక్టార్లు, అవనిగడ్డ మండలంలో 287.38 హెక్టార్లు, ఇబ్రహీం పట్నంలో 204.16 హెక్టార్లు, కంచికచర్ల మండలంలో 120.95 హెక్టార్లు, చందర్లపాడు మండలంలో 104.05 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన వన పంటల నష్టానికి సంబంధించి తుది నివేదికలను బుధవారం రాత్రికి ప్రభుత్వానికి పంపించారు. వ్యవసాయ పంటలు ఇలా.. వ్యవసాయ పంటల విషయానికి వచ్చేసరికి ప్రాథమిక అంచనాలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ 33 శాతం కంటే ఎక్కువగా నష్టపోయిన పంటలనే పరిగణనలోకి తీసుకోవడంతో నష్ట తీవ్రత తగ్గింది. అలాగే కంచికచర్ల, చందర్లపాడు, తోట్లవల్లూరుల్లో పరిశీలన జరగాల్సి ఉంది. ఇదీ కూడా పూర్తికాగానే.. ప్రభుత్వానికి తుది నివేదిక అందించనుట్లు అధికారులు పేర్కొన్నారు. స్కేల్ ఆఫ్ రిలీఫ్ కంటే 15 శాతం అదనంగా పరిహారం గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.15 ప్రకారం స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద వరి, వేరుశనగ, పత్తి, చెరకు హెక్టార్‌కు రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.12,500, అపరాలు, సన్‌ఫ్లవర్, సోయాబీన్, గోధుములకు రూ.10వేలు, పొగాకుకు రూ.10వేలు, జొన్న, సజ్జలు, రాగులు, సజ్జలు, నువ్వులుకు రూ.6,800, కొర్రా, సామా, వరిగ, మస్టర్డ్ పంటలకు రూ.5వేలు, పొలంలో ఇసుక మేటు వేస్తే రూ.12,200, పంట భూమి కోతకు గురైతే రూ.37,500 చొప్పున చెల్లిస్తారు. ఇక కేంద్రమైతే వర్షాధారమైన భూముల్లో పంటలకు హెక్టార్‌కు రూ.6,800లు, సాగునీటి వనరుల కింద సాగయ్యే పంటలకు రూ.13,500లు, ఇసుక మేట వేస్తే రూ.12,200లు, కోతకు గురైతే రూ.37,500లు చెల్లిస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కేల్ ఆఫ్ రిలీఫ్ కింద చెల్లిస్తున్న మొత్తానికి 15 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించడంతో వరద బాధిత రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఉదారంగా ఆదుకున్న సందర్భం లేదని చెబుతున్నారు. ఇదే తొలి అడుగు.. వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు రూ.3వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని కూడా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. గడిచిన రెండు నెలలుగా కృష్ణా, గోదావరి వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా ముందుకు రావడం నిజంగా ముదవాహమని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత పూర్తి స్థాయి నష్టం వివరాలు ఇలా వ్యవసాయ పంటలు పంట రకం జరిగిన నష్టం(హెక్టార్లలో) పత్తి 493 వరి 119 చెరుకు 127.3 మొక్కజొన్న 53.78 కందులు,పెసలు, మినుములు 25.73 ఉద్యానవన పంటలు పంట రకం జరిగిన నష్టం(హెక్టార్లలో) అరటి 843.682 చింత 1665.906 కూరగాయలు 584.312 కంద 678.514 మామిడి 2.4 బొప్పాయ 89.6 నిమ్మ 0.4 జామ 14.59 తమలపాకు 43.22 పూలతోటలు 9.2 మిరప 89.648 బేర్ యాపిల్ 0.4 నష్టం ఇలా.. ఉద్యాన పంటలు 4,021.872 హెక్టార్లు వ్యవసాయ పంటలు 818 హెక్టార్లు (ఇంకా పెరుగుతుంది) నష్టపోయిన మొత్తం రైతులు 8,185 -
చంద్రబాబు మాట వింటే అధోగతే
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి ఇటీవల వచ్చిన వరదలను సమర్థవంతంగా నియంత్రిస్తూ రాయలసీమకు ఇప్పటికే 46 టీఎంసీల మిగులు జలాలను మళ్లించామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేసి ఉంటే రాయలసీమకు చుక్క నీరైనా వచ్చేదా? అని నిలదీశారు. ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదికి గతంలో వచ్చిన చిన్నపాటి వరదలనే నియంత్రించలేక శ్రీశైలం ప్రాజెక్టు పవర్‌హౌస్‌ను ముంచేసిన చంద్రబాబు ఇప్పుడు తనను చూసి వరద నియంత్రణ నేర్చుకోవాలని మాట్లాడుతుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. అనిల్‌కుమార్ యాదవ్ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘తుపాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా కమీషన్ల కోసం సమీక్షలు నిర్వహించిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కృష్ణా నది వరదలపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించలేదంటూ విమర్శించడం దారుణం. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ వరదలపై అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. వరదలు వస్తుండడాన్ని ముందే పసిగట్టి కృష్ణా నది గర్భంలో కట్టుకున్న తన ఇల్లు మునిగిపోతుందని హైదరాబాద్‌కు పారిపోయిన చంద్రబాబు వరదలు తగ్గాక అక్కడక్కడ పర్యటించి, ప్రభుత్వంపై విమర్శలు చేసి, మళ్లీ హైదరాబాద్‌కు జారుకున్నారు. బాబు అవగాహనా రాహిత్యానికి నిదర్శనం కృష్ణా నది వరదలపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చిన నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు కిందికి వదిలేసి ఉంటే వరద ప్రభావం ఉండేది కాదని ఓవైపు చెబుతున్న చంద్రబాబు మరోవైపు రాయలసీమకు నీళ్లు ఇవ్వడం లేదని, సముద్రంలోకి వృథాగా 290 టీఎంసీలు విడుదల చేశారని అనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు అంటే 44 వేల క్యూసెక్కులను రాయలసీమకు విడుదల చేయాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 881 అడుగులు ఉండాలన్న విషయం 14 ఏళ్లు అధికారం వెలగబెట్టిన చంద్రబాబుకు తెలియదా? వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, సోమశిల రిజర్వాయర్లకు ఇప్పటికే 46 టీఎంసీలను తరలించాం. ఈ నెల 4 నుంచే హంద్రీ–నీవాకు, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయడం ప్రారంభించాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,500 క్యూసెక్కులు విడుదల చేశాం. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నడూ 32 వేల క్యూసెక్కులకు మించి విడుదల చేయలేదు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఈ నెల 9న శ్రీశైలంలో నీటి నిల్వ 879 అడుగులకు చేరుకోగానే గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు విడుదల చేశాం. సాగర్‌లో నీటి మట్టం క్రస్ట్ గేట్ల స్థాయికి అంటే 545 అడుగులకు చేరుకోగానే ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 12న ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలాం. పులిచింతల ప్రాజెక్టు గేట్లను అదే రోజున ఎత్తి.. ఎగువ నుంచి వస్తున్న వరదను శ్రీశైలం, సాగర్, పులిచింతలను భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని విడుదల చేశాం. దీనివల్ల వరద ప్రభావం ప్రకాశం బ్యారేజీపై తక్కువగా పడింది. ఈ నెల 17న ఆరు గంటలపాటు మాత్రమే బ్యారేజీకి 8.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. మిగిలిన రోజుల్లో ఏనాడూ ఏడు లక్షల క్యూసెక్కులు దాటలేదు. చంద్రబాబు చెప్పినట్టు వచ్చిన నీటిని వచ్చినట్టు విడుదల చేసి ఉంటే ప్రకాశం బ్యారేజీలోకి 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చేది. రైతులు ఆనందంలో ఉంటే బాబు కడుపు కాలుతోంది శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ ఏడాది 879 టీఎంసీల ప్రవాహం వస్తే ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్టంగా 8.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2009లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 715 టీఎంసీలు వచ్చినా అప్పట్లో ప్రకాశం బ్యారేజీలోకి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్నిబట్టి చూస్తే వరద నియంత్రణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు స్పష్టమవుతోంది. పులిచింతలలో ఇప్పటికే 43 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు అంటే 45.77 టీఎంసీలను నిల్వ చేస్తాం. కృష్ణాకు వచ్చిన వరదల వల్ల ప్రాజెక్టులు నిండి, మంచి పంటలు పండుతాయని రైతులు ఆనందంలో ఉంటే.. చంద్రబాబు కడుపు కాలి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నదీ గర్భంలో ఇల్లు నిరి్మంచుకుంటే చంద్రబాబుదైనా, గజనీదైనా మునిగిపోక తప్పదు. వరద వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుంది’’ అని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు. రాయలసీమకు తరలించిన మిగులు జలాలను లెక్కలోకి తీసుకోవద్దని కృష్ణా బోర్డును కోరుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని నిర్మూలించేందుకే పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి పనులకు రివర్స్ టెండర్లు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. -
దిగజారుడు విమర్శలు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ప్రతిపక్ష నేత చంద్రబాబు వరదలతో సానుభూతి పొందేందుకు దిగజారి విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటిని ముంచడానికే కృష్ణా నదికి వరదలు సృష్టించారని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరమన్నారు. నదికి ఎవరైనా వరదలు సృష్టించగలరా? అని విస్మయం వ్యక్తం చేశారు. ‘గుండె నొప్పో... మరొకటో వస్తే హైదరాబాద్ లేదా ముంబై వెళ్లొచ్చు. చంద్రబాబు చేతి నొప్పికి హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందా?’ అని సూటిగా ప్రశి్నంచారు. వరదలపై రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయతి్నంచడం దుర్మార్గమన్నారు. ‘నదీ గర్భంలో కట్టిన ఇంట్లో నివసించడమే తప్పు. ముంచేస్తున్నారని ఆరోపించడం ఏమిటి?’ అని అన్నారు. టీడీపీ హయాంలో జలవనరుల శాఖ మంత్రి కృష్ణా నదిలోని 21 అక్రమ కట్టడాలను నెల రోజుల్లో తొలగిస్తామని 2014 డిసెంబర్లో ప్రకటించారని గుర్తు చేశారు. పచ్చపుష్పాల దు్రష్పచారం ముఖ్యమంత్రి జగన్ హిందూ వ్యతిరేకి అంటూ కమలవనంలో ఉన్న పచ్చపుష్పాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అంబటి మండిపడ్డారు. అమెరికాలో అగ్గిపెట్టెలు, ఒత్తులతో జ్యోతులను అంటించడం నేరంగా పరిగణిస్తారని అందుకే జగన్ ఎల్రక్టానిక్ జ్యోతిని వెలిగించారని అంబటి వివరణ ఇచ్చారు. మాణిక్యాలరావు దేవాదాయ మంత్రిగా ఉన్నపుడు విజయవాడలో 40 దేవాలయాలు కూల్చేస్తే ఎందుకు స్పందించ లేదని నిలదీశారు. సదావర్తి భూములను చంద్రబాబు తాబేదార్లు మింగబోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో అన్ని మతాలు బాగుండాలని కోరుకునే పార్టీ తమదని, తాము వైఎస్సార్ వారసులమని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందువల్లే తనపై కేసులు మోపుతున్నారన్న కోడెల వ్యాఖ్యలను అంబటి ఖండించారు. రాజధాని విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా చంద్రబాబు ఆలకించలేదని, ఇది వాస్తవం, ఇక వివాదం ఏముందని ప్రశ్నించారు. -
భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం
సాక్షి, అమరావతి: కృష్ణానదికి వచ్చిన భారీ వరదను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, శ్రీశైలం డ్యాం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా కట్టడి చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా తగిన ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం డ్యాం నుంచి 6 రోజుల పాటు సగటున 8 లక్షల క్యూసెక్కులు వదిలినా అన్ని ప్రాజెక్టులను నింపుకుంటూ ప్రకాశం బ్యారేజీ నుంచి సగటున 6 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదలడం ద్వారా దిగువనున్న ప్రాంతాలు సాధ్యమైనంత వరకు మునగకుండా కాపాడినట్లు పేర్కొన్నారు. 13న ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 270 టీఎంసీలకు పైగా సముద్రంలో కలిసిందన్నారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటే టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ప్రాజెక్టులు నింపకుండా నీళ్లు కిందకు వదిలేశారని, మరోసారి నీళ్లని ఆపి ఒకేసారి వదలడం ద్వారా చంద్రబాబు ఇల్లును ముంచే కుట్ర చేశారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 15 రోజుల్లో సీమ ప్రాజెక్టులన్నీ నింపుతాం... రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రతిపక్ష పార్టీ నేతలు అక్కసుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, దీనికి అనుగుణంగా కొన్ని పత్రికలు, చానల్స్ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నింపకుండా నీళ్లు కిందకు వదలేస్తున్నారంటూ కనీసం కాలవల సామర్థ్యం మీద అవగాహన కూడా లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాయలసీమలోని ప్రాజెక్టులకు 35 టీఎంసీలను తరలించామని, మరో 15 రోజులు పాటు వరద కొనసాగే అవకాశం ఉండటంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ నింపగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పధ్నాలుగు మండలాల్లో 53 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని,6 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. 81 బోట్లు గల్లంతు అయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపు ప్రభావానికి గురవ్వగా, 4,300 హెక్టార్లలో వ్యవసాయం, 4,086 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందన్నారు. 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలిందని, నష్టంపై ఇంకా సర్వే జరుగుతోందన్నారు. -
కృష్ణా వరదను ఒడిసిపట్టి..!
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ముంపు ముప్పు తగ్గడంతోపాటు ప్రాణ నష్టం తప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను నింపుతూనే అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తరలించి తెలుగుగంగలో భాగమైన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, గాలేరు–నగరిలో భాగమైన గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లకు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువన కృష్ణా వరద ఉధృతిని నియంత్రించడం వల్లే ప్రకాశం బ్యారేజీపై పెద్దగా ప్రభావం పడలేదని విశ్లేషిస్తున్నారు. బ్యారేజీలోకి వచ్చిన వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేశారు. ఈనెల 17న బ్యారేజీకి గరిష్టంగా 7.49 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల నది సహజ ప్రవాహానికి అడ్డంకులు తలెత్తాయి. ఫలితంగా బ్యారేజీ ఎగువన వరద నీటి మట్టం పెరిగి కొండవీటి వాగులోకి వరద ఎగదన్ని పెనుమాక, ఎర్రబాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అక్రమ కట్టడాలను తొలగిస్తే వరద ప్రవాహం ఎగదన్నేదే కాదని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సమర్థంగా వరదను నియంత్రించకుంటే 2009 కంటే అధికంగా నష్టం వాటిల్లేదని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. గోదావరి వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు సాధారణంగా అందించే సహాయ ప్యాకేజికి అదనంగా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం తెలిసిందే. బాధితులకు తక్షణమే నిత్యావసరాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్వాసితులను పునరావాస ప్రాంతాలకు తరలించడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంది. హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటి తరలింపు కృష్ణా వరద ఈనెల 1న శ్రీశైలానికి చేరింది. భారీ ప్రవాహం వస్తుండటంతో ఈనెల 6 నుంచే హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు జలాలను తరలించే ప్రక్రియ చేపట్టారు. ఆగస్టు 7 నాటికి శ్రీశైలంలో నీటి మట్టం 870.9 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలింపు మొదలైంది. అదే రోజు కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 10న శ్రీశైలం గేట్లు ఎత్తేశారు. కనీస మట్టం చేరగానే సాగర్ ఆయకట్టుకు విడుదల.. నాగార్జునసాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ఈనెల 8 నాటికి 513.3 అడుగులకు చేరుకోవడంతో కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్‌లో నీటి మట్టం కనీస స్థాయికి చేరుకున్న వెంటనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈనెల 13న సాగర్ 26 గేట్లు ఎత్తేసి దిగువకు వరదను విడుదల చేశారు. అప్పటికి సాగర్‌లో 260.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీపై భారం పడకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా సాగర్ పూర్తి స్థాయిలో నిండకుండానే దిగువకు వరదను విడుదల చేశారు. ఆ తర్వాత వస్తున్న వరదతో సాగర్‌లో ఖాళీని భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని నియంత్రించారు. పులిచింతల ముంపు గ్రామాలను కూడా ముందే ఖాళీ చేయించి ప్రాజెక్టులో గరిష్టంగా 36 టీఎంసీలు నిల్వ చేశారు. -
జల దిగ్బంధంలో లంక గ్రామాలు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదికి వరద పోటెత్తడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు లంక గ్రామాలు కకావికలమయ్యాయి. పొలాలతోపాటు, గ్రామాల్లోకీ వరద నీరు ప్రవేశించడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కృష్ణా జిల్లాలో కృష్ణానది కరకట్టను అనుకొని ఉన్న తోట్లవల్లూరు, పమిడిముక్కల, ఘంటశాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే పులిగెడ్డ అక్విడెక్టుపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో ఉద్యాన, వ్యవసాయ పంటలకు, చేపల చెరువులకు నష్టం వాటిల్లింది. గుంటూరు జిల్లాలో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద మద్దూరు గ్రామంలోకి నీరు రావటంతో పాటు, రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు పడవల్లో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. రేపల్లె మండలం పెనుమూడి, పల్లెపాలెం గ్రామాల్లో వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం జువ్వలపాలెంలోని సబ్‌స్టేషన్‌లోకి నీరు రావటంతో 8 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీట మునిగిన పంట పొలాలు.. అపార నష్టం తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో ఉద్యాన పంటలు 13,089 ఎకరాల్లో నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. గుంటూరు జిల్లాలో దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి, తాడేపల్లి, కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో 12,262.5 ఎకరాల్లో వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కృష్ణా జిల్లాలో 7097.5 ఎకరాల్లో వరి, 3,495 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 50 ఎకరాల్లో మల్బరి పంటలు నీట మునిగాయి. 165 గృహాలు వరద ప్రభావానికి దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 41 పునరావాస కేంద్రాలకు 8,100 మందిని, గుంటూరు జిల్లాలో 14 మండలాల్లోని 53 గ్రామాల్లో 3,543 మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు వరద సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అంత్యక్రియలకూ కష్టకాలం భట్టిప్రోలు(వేమూరు), కొల్లూరు : కృష్ణానదికి వరద రావడంతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లే మార్గం లేక గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో మృతి చెందిన నూతక్కి రామయ్య(75)కు కరకట్టపైనే దహన సంస్కారాలు చేశారు. కొల్లూరు మండలం గాజుల్లంకలో మృతి చెందిన మత్తి జనభాయమ్మకు అక్కడ అంత్యక్రియలు నిర్వహించే వీలులేక పడవలో కొల్లూరుకు తరలించారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో దహన సంస్కారాలకు వరద నీటిలో ఇబ్బందులు చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరద కృష్ణా నది గర్భాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వరద ముంచెత్తుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని వరద నీరు చుట్టుముట్టినా తన నివాసాన్ని ఖాళీ చేసేందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. హెలిప్యాడ్, గార్డెన్, చుట్టుపక్కలున్న తోటలన్నీ నీట మునిగినా ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది ఇల్లు ఖాళీ చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నోటీసు ఇవ్వడానికి వెళ్లిన వీఆర్వో ప్రసాద్‌ను సెక్యూరిటీ సిబ్బంది లోనికి అనుమతించక పోవడంతో దానిని గోడకు అంటించారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 నివాసాలకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఉప్పొంగిన కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/మాచర్ల: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో వరద పోటెత్తడంతో శనివారం సాయంత్రం 6 గంటలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 6.25 లక్షల క్యూసెక్కులను కర్ణాటక సర్కార్ దిగువకు విడుదల చేసింది. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి పెరగడంతో తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. మరో ప్రధాన ఉప నది భీమా మూడు రోజులుగా ఉరకలెత్తుతోంది. దీంతో ఉజ్జయిని జలాశయం గేట్లు ఎత్తి భారీగా జలాలను దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు 4,49,950 క్యూసెక్కులు చేరుతుండటంతో జలాశయంలో నీటిమట్టం 883.1 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ పది గేట్లను 20 అడుగుల పైకెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి శనివారం రాత్రి 9 గంటల సమయానికి 6,12,931 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దిగువ ప్రాంతాలకు 5,69,266 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 15 ఏళ్లలో ఇదే భారీ వరద గడచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే 230 టీఎంసీలకు పైగా వచ్చాయి. ముందెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఆగస్ట్ 9న ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయడం గమనార్హం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పటి తరహాలోనే.. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో నాలుగు రోజుల్లో నాగార్జునసాగర్.. మరో వారం రోజుల్లో పులిచింతల ప్రాజెక్ట్ నిండే అవకాశం ఉంది. మరో 10, 15 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉండటంతో ఆదివారం సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏపీ జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్, తెలంగాణ మంత్రి జి.జగదీశ్వర్‌రెడ్డి నీటిని విడుదల చేస్తారు. కుడి కాలువకు గండి సాగర్ కుడి కాలువకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం లింగాపురం శివారులోని 11వ మైలు వద్ద శనివారం రాత్రి గండి పడింది. ఈ కాలువకు మూడు రోజుల క్రితం నీటిని విడుదల చేయగా.. లింగాపురం రహదారిలో మల్లెతోట వద్ద గండిపడి నీరంతా చంద్రవంక నదిలోకి చేరుతోంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో భారీ గండి పడింది. -
వచ్చేస్తోంది జల‘సాగరం’
సాక్షి, హైదరాబాద్: పదిహేను రోజులుగా ఎగువన కురుస్తున్న కుంభవృష్టితో కృష్ణానదికి భారీ వరదలొస్తున్నాయి. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో 3, 4 రోజులుగా రోజుకు సగటున 25 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుండడంతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మరో రెండు, మూడ్రోజుల్లో శ్రీశైలం నిండనుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు (ఎన్నెస్పీ)కు నీటిని విడుదల చేస్తారు. సాగర్‌కు నీరు త్వరలోనే వస్తోందనే వార్తతో పరీవాహక ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. సకాలంలో కురవని వర్షాలు, సాగర్‌లో అడుగంటిన నీటి మట్టాలతో జూన్, జూలైలో ఖరీఫ్ డీలాపడగా.. ఇకపై పుంజు కోనుంది. ఇప్పటికే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా 82వేల క్యూసెక్కుల నీటిని వినియోగి స్తుండగా.. సాగర్‌కు 74వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 135 టీఎంసీల నీరుంది. శ్రీశైలంకు డబుల్ వరద కర్ణాటకలోని ప్రాజెక్టుల నుంచి భారీగా వరద కిందకు వదులుతున్నారు. దీనికితోడు మహారాష్ట్ర లో భీమానదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టు సైతం పూర్తిస్థాయిలో నిండి అక్కడి నుంచి 1.25లక్షల క్యూసెక్కులకు పైగా భారీ ప్రవాహాలు దిగువకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దిక్కుల నుంచి ఉధృతంగా వస్తున్న వరదలతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోనుంది. గురువా రం నుంచి 5లక్షల క్యూసెక్కుల మేర వరద ఈ ప్రాజెక్టులోకి చేరే అవకాశముంది. 2 రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టానికి చేరుకోనుంది. మరో 59 టీఎంసీలు నిండితే.. ఎగువన వర్షాలతో మరింత వరద వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి నిల్వలను ఖాళీ చేయాలని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. ఆల్మట్టిలో 90టీఎంసీల మేర మాత్రమే ఉంచి 4లక్షల క్యూసెక్కులు, నారాయణ పూర్లో 22 టీఎంసీలు మాత్రమే ఉంచి 4.64 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఈ నీరంతా జూరాలకు వస్తోంది. ప్రస్తుతం జూరాలకు 3.25లక్షల క్యూసెక్కుల వరద నమోదవుతుండగా, 3.47లక్షల క్యూసె క్కుల నీటి ని శ్రీశైలానికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలానికి బుధవారం ఏకంగా 2.81 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. దీంతో ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 215.8టీఎంసీలకుగానూ 156 టీఎంసీల నీరు చేరింది. శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయానికల్లా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుందని నీటిపారుదల అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 17 సెం.మీ. కుండపోత వర్షం కురిసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. తాగునీటికి పక్కనపెట్టి.. మిగతాది సాగుకు ఏఎమ్మార్పీ కింద, హైదరాబాద్ జంట నగరాలకు, మిషన్ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకై సాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 30 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు విడుదలయ్యే అవకాశం ఉంది. రేపు కృష్ణా బోర్డు సమావేశం శ్రీశైలం, సాగర్‌లో ఉన్న లభ్యత జలాలు, వాటి పంపకంపై చర్చించేందుకు ఈ నెల9న కృష్ణా బోర్డు భేటీ కానుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు తమ తమ అవసరాలపై చర్చించనున్నాయి. ఇందులోనే సాగర్ కింది తాగు, సాగు అవసరాలపై చర్చ జరగనుంది. -
కృష్ణా వరద తగ్గుముఖం
► ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిలుపుదల ► దిగువకు తగ్గిన ప్రవాహాలు ► శ్రీశైలంలో విద్యుదుత్పత్తిపై తెలంగాణ తర్జనభర్జన సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో గత కొన్ని రోజులుగా వర్షాల కారణంగా స్థిరంగా కొనసాగిన ప్రవాహాలు తగ్గుముఖం పట్టడంతో కర్ణాటక నుంచి జూరాల, శ్రీశైలానికి ప్రవాహాలు తగ్గిపోయాయి. గురువారం ఆల్మట్టికి కేవలం 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా ఆ నీటిని స్వీయ అవసరాలకు మళ్లించారు. అలాగే నారాయణపూర్‌కు 5,947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ఫ్లో 8,049 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో జూరాలకు వరద 20 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఇందులో నెట్టెంపాడు కాల్వలకు 1,500 క్యూసెక్కులు, భీమా కాల్వలకు 2,100 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ కాల్వలకు 630 క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే జూరాల కుడి, ఎడమ కాల్వల అవసరాలకు మరో 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 26,430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి గురువారం ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 33.72 టీఎంసీల నిల్వ ఉంది. మరోవైపు నాగార్జునసాగర్ కింద తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ పరిధిలో వపర్ స్లూయిస్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువ సాగర్‌కు వదలాలన్న అంశంపై తెలంగాణ తర్జనభర్జన పడుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 809 అడుగుల నీటిమట్టంలో 33.72 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ఇందులో 775 అడుగులకుపైన 13.72 టీఎంసీల మేర నీటిని తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణకు 804 అడుగులకు ఎగువ ఉన్న నీటితో విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉండగా 804 అడుగులకు ఎగువన లభ్యత నీరు కేవలం 2.08 టీఎంసీలు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తిపై నీటిపారుదలశాఖ, జెన్కో అధికారులు సమావేశమై లభ్యత నీటితో ఎన్ని రోజులపాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు, దిగువకు వచ్చే నీటి పరిమాణం ఎంత, ఎగువ నుంచి ఉన్న ప్రవాహాలు తదితరాలపై చర్చించారు. అయితే లభ్యత నీరు పెరిగితే విద్యుదుత్పత్తి చేద్దామని ఇరువైపుల నుంచి ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. అయినా మరోసారి ఉన్నతస్ధాయిలో చర్చించి తుది నిర్ణ యానికి రానున్నారు.