సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన ప్రతిపక్ష నేత చంద్రబాబు వరదలతో సానుభూతి పొందేందుకు దిగజారి విమర్శలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇంటిని ముంచడానికే కృష్ణా నదికి వరదలు సృష్టించారని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరమన్నారు.
నదికి ఎవరైనా వరదలు సృష్టించగలరా? అని విస్మయం వ్యక్తం చేశారు. ‘గుండె నొప్పో... మరొకటో వస్తే హైదరాబాద్ లేదా ముంబై వెళ్లొచ్చు. చంద్రబాబు చేతి నొప్పికి హైదరాబాద్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందా?’ అని సూటిగా ప్రశి్నంచారు. వరదలపై రాజకీయం చేసి లబ్ధి పొందాలని ప్రయతి్నంచడం దుర్మార్గమన్నారు. ‘నదీ గర్భంలో కట్టిన ఇంట్లో నివసించడమే తప్పు. ముంచేస్తున్నారని ఆరోపించడం ఏమిటి?’ అని అన్నారు. టీడీపీ హయాంలో జలవనరుల శాఖ మంత్రి కృష్ణా నదిలోని 21 అక్రమ కట్టడాలను నెల రోజుల్లో తొలగిస్తామని 2014 డిసెంబర్‌లో ప్రకటించారని గుర్తు చేశారు.
పచ్చపుష్పాల దు్రష్పచారం
ముఖ్యమంత్రి జగన్ హిందూ వ్యతిరేకి అంటూ కమలవనంలో ఉన్న పచ్చపుష్పాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అంబటి మండిపడ్డారు. అమెరికాలో అగ్గిపెట్టెలు, ఒత్తులతో జ్యోతులను అంటించడం నేరంగా పరిగణిస్తారని అందుకే జగన్ ఎల్రక్టానిక్ జ్యోతిని వెలిగించారని అంబటి వివరణ ఇచ్చారు. మాణిక్యాలరావు దేవాదాయ మంత్రిగా ఉన్నపుడు విజయవాడలో 40 దేవాలయాలు కూల్చేస్తే ఎందుకు స్పందించ లేదని నిలదీశారు.
సదావర్తి భూములను చంద్రబాబు తాబేదార్లు మింగబోతే ఎందుకు మాట్లాడలేదని ప్రశి్నంచారు. రాష్ట్రంలో అన్ని మతాలు బాగుండాలని కోరుకునే పార్టీ తమదని, తాము వైఎస్సార్ వారసులమని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందువల్లే తనపై కేసులు మోపుతున్నారన్న కోడెల వ్యాఖ్యలను అంబటి ఖండించారు. రాజధాని విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయవద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పినా చంద్రబాబు ఆలకించలేదని, ఇది వాస్తవం, ఇక వివాదం ఏముందని ప్రశ్నించారు.
దిగజారుడు విమర్శలు
Published Thu, Aug 22 2019 4:23 AM | Last Updated on Thu, Aug 22 2019 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment