water increased
-
మూడు, నాలుగు రోజుల్లో నిండనున్న సాగర్
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు 3,69,866 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 537.4 అడుగుల వద్ద 182.95 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 130 టీఎంసీలు అవసరం. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సాగర్ నిండుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,64,019 క్యూసెక్కుల నీరు చేరుతుండంతో పది గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,31,370 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 24,917, ఎడమ కేంద్రం నుంచి 35,315 వెరసి 4,91,602 క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్‌లోకి చేరుతున్న వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. తుంగభద్రలో కూడా వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,98,109 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 1,79,973 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.మంత్రాలయం వద్ద తుంగభద్ర నీటిమట్టం 311 మీటర్ల(సముద్రమట్టానికి)కు చేరుకుంది. దీంతో మంత్రాలయం వద్ద అధికారులు ప్రమాదహెచ్చరికను జారీచేసి నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరగనుంది. గోదావరిలో తగ్గుతున్న వరదవర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద క్రమేణా తగ్గుతోంది దీంతో మేడిగడ్డ బరాజ్‌లోకి 3.62 లక్ష లు, తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 6.26, దుమ్ముగూడెం(సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 8.07 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. వచి్చన వరదను వచి్చనట్టుగా వదిలేస్తున్నారు. భద్రా చలం వద్ద వరద 8.41 లక్షల క్యూసె క్కులకు తగ్గడంతో నీటిమట్టం 40 అడుగులకు తగ్గింది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎట్టకేలకు నిండింది. మహారాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియా నుంచి భారీగా వరద జలాలు వచ్చి చేరుతుండటంతో మూడేళ్ల అనంతరం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ నుంచి 83 వేల క్యూసెక్కుల భారీ వరద పోటెత్తడంతో సోమవారం ఉదయం 16 గేట్లను ఎత్తి 75 వేల క్యూసెక్కుల వరద నీటిని గోదావరి నదిలోకి వదిలారు. అలాగే కాకతీయ కాలువ ద్వారా మరో ఐదు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా మూడు వేల క్యూసెక్కులు.. మొత్తం 83 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి ప్రాజెక్టులోకి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 (90 టీఎంసీ) అడుగులు. మూడేళ్ల తర్వాత..: మూడేళ్ల అనంతరం ఎస్సారెస్పీ గేట్లను ఎత్తారు. 2016 సెప్టెంబర్‌లో ఇలాగే భారీగా వరద జలాలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి అప్పట్లో లక్షలాది క్యూసెక్కులు నదిలోకి వదిలారు. 2013లోనూ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఇలా ప్రతి మూడేళ్లకు ఒకసారి గేట్లు ఎత్తే పరిస్థితి నెలకొంది. గత ఏడాది 2018 అక్టోబర్ 21న ప్రాజెక్టులో కేవలం 41 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. 2017లోనూ ప్రాజెక్టు పూర్తిగా నిండలేదు. 2015లో ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరింది. కానీ ఈసారి అక్టోబర్‌లో ప్రాజెక్టు నిండటం అరుదని నీటి పారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు పోటెత్తారు. -
సోమశిల జలాశయానికి పెరుగుతున్న నీరు
-
ధవళేశ్వరం వద్ద పెరిగిన నీటి ఉధృతి
-
పెరిగిన శ్రీశైలం నీటిమట్టం
శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 815.50 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి 29వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 28,448 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 37.6570 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. శ్రీశైల జలాశయ పరిసర ప్రాంతాలలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 4.3613 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో డ్యాం నీటిమట్టం 7.30 అడుగుల మేరకు పెరిగింది. -
802 అడుగులకు శ్రీశైలం డ్యాం నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు (కర్నూలు): తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రానికి 3.2884 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో డ్యాం నీటిమట్టం సుమారు ఏడు అడుగుల మేర పెరిగింది. తుంగభద్ర నుంచి వచ్చే జలాలే కాకుండా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా జలాశయంలోకి వరద నీరు నెమ్మదిగా వచ్చి చేరుతోంది. 795.10 అడుగులుగా ఉన్న నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 801.90 అడుగులకు చేరుకుంది.