శ్రీశైలం ప్రాజెక్టు (కర్నూలు): తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీశైలం జలాశయంలోకి బుధవారం సాయంత్రానికి 3.2884 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో డ్యాం నీటిమట్టం సుమారు ఏడు అడుగుల మేర పెరిగింది. తుంగభద్ర నుంచి వచ్చే జలాలే కాకుండా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా జలాశయంలోకి వరద నీరు నెమ్మదిగా వచ్చి చేరుతోంది. 795.10 అడుగులుగా ఉన్న నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 801.90 అడుగులకు చేరుకుంది.