శ్రీశైలంప్రాజెక్టు: శ్రీశైలం జలాశయ నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 815.50 అడుగులకు చేరుకుంది. జూరాల నుంచి 29వేల క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 28,448 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 37.6570 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. శ్రీశైల జలాశయ పరిసర ప్రాంతాలలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం నుంచి శుక్రవారం వరకు 4.3613 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో డ్యాం నీటిమట్టం 7.30 అడుగుల మేరకు పెరిగింది.