సాక్షి, నల్గొండ జిల్లా: నాగార్జున సాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రేపు(సోమవారం) ఉదయం 8 గంటలకు క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది.
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలకు గానూ.. 268.8689 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయానికి 3లక్షల 22 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. 37,873 క్యూసెక్కులు ఔట్ ఫ్లోగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు రావడంతో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
సాగర్ దిగువన ఉన్న కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment