నాగార్జునసాగర్: ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ)’ బృందం మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించింది. తొలుత విజ యవిహార్ అతిథిగృహంలో తెలంగాణ, ఆంధ్ర ఇంజనీర్లతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు (కేఆర్‌ఎంబీ) సభ్యులతో ఎన్డీఎస్‌ఏ అధికారులు సమావేశమయ్యారు. 2009లో వచ్చిన భారీ వరదల నుంచి డ్యామ్‌ను ఏవిధంగా కాపా డారు? వచ్చిన వరదను ఎలా విడుదల చేశారన్న అంశాలపై చర్చించారు. తర్వాత ప్రధాన డ్యామ్ ను, ప్రాజెక్టు లోపలి గ్యాలరీలను, అక్కడి సీపేజీ (జాలు నీరు)లను పరిశీలించారు.
సీపేజీ నీటి మళ్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రా జెక్టు స్పిల్‌వేపై ఉన్న వాక్‌వే బ్రిడ్జి మీదుగా వెళ్లి స్పి ల్‌వేను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి, స్పిల్ వేకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ వివ రాలను ఆరా తీశారు. స్పిల్‌వే దిగువన బకెట్ పో ర్షన్ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఎన్డీఎస్‌ఏ బృందంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్‌కుమార్, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్‌డీఎస్‌వో) సీఈ ప్రమీల, ఇత ర ఇంజనీర్లు ఉన్నారు. ఈ పరిశీలనలో తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ వి.అజయ్‌కుమార్, డ్యామ్ ఎస్‌ఈ పీవీఎస్ నాగేశ్వర్‌రావు, ఇతర ఇంజనీర్లు పాల్గొనగా.. ఏపీ నుంచి చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, ఎస్‌ఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ కేంద్రం పరిశీలన
ఎన్డీఎస్‌ఏ బృందం బుధవారం సాగర్ డ్యాం దిగు వన ఉన్న విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనుంది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ని.. తిరిగి జలాశయంలోకి ఎత్తిపోసే సమయంలో నీరేమైనా వృథా అవుతుందా? సీజన్‌లో బయటికి ఎంతనీరు వెళుతుందనే అంశాలను పరిశీలించనున్నట్టు తెలిసింది. గురువారం కూడా సాగర్ ప్రాజెక్టు పరిధిలో పరిశీలన కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment