సీఎం జగన్‌ సాహసి.. చంద్రబాబు ఆంధ్రా ద్రోహి | Ambati Rambabu Comments on Sagar Issue | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సాహసి.. చంద్రబాబు ఆంధ్రా ద్రోహి

Published Sun, Dec 3 2023 5:33 AM | Last Updated on Sun, Dec 3 2023 5:34 AM

Ambati Rambabu Comments on Sagar Issue - Sakshi

సత్తెనపల్లి: మన రాష్ట్ర భూభాగంలో మన వాటా ప్రకారం నీటిని తీసుకోవడానికి పోలీసు యాక్షన్‌ చేస్తే అది దండయాత్ర ఎలా అవుతుందని, ఓట్ల రా­జ­­కీ­య­మని ఎలా అంటారని రాష్ట్ర జల వనరుల శా­ఖ మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఇది మన రాష్ట్ర హక్కుల సాధన అని చెప్పా­రు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్ర­బాబు అలసత్వం, నిర్లక్ష్యం వల్లే మన హక్కు­లను కోల్పోయి, ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాహసి అని, ఓటు­కు నోట్లు కేసులో భయపడి నీటి విని­యోగాన్ని, మన హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు ఆంధ్ర దోహి అని అన్నారు.

మంత్రి అంబ­టి శనివారం పల్నాడు జిల్లా సత్తెన­పల్లిలో విలేక­రుల సమావేశంలో మాట్లాడు­తూ.. పచ్చ పత్రికలు ఇష్టానుసారం రోత రాతలు రాస్తు­న్నా­యని మండి­పడ్డారు. కృష్ణా జలాల్లో మ­న వాటా నీటిని పొందడంలో ఉమ్మ­డి ఆంధ్రప్రదేశ్‌ నుంచి నష్ట­పోతున్నామ­న్నా­రు. శ్రీ­శై­లం డ్యామ్‌ నుం­చి విద్యుత్‌ ఉత్పత్తి కో­సం తెలంగాణ విచ్చలవిడిగా నీటిని వాడుకుంటోందని చెప్పారు. 30 టీఎంసీల వరకు మనకు అవ­కా­శం ఉన్నా ప్రస్తుతం 13 టీఎంసీల వరకే ఉపయోగించుకునే దుస్థితి నెలకొందన్నారు. చంద్ర­బాబు సీఎంగా ఉండగా నీటి యాజమాన్యా­న్ని తెలంగాణకు అప్పజెప్పడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు.

ఇప్పుడు వ్యూహత్మకంగా అడుగులు వేశామని, మ­న హక్కులను కాపాడుకు­న్నా­మని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టంచేశా­రు. తెలంగాణలో గెలుపోటములతో తమకు సంబంధం లేదని, మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్సార్‌సీపీ పోరాడు­తుందని అన్నారు. హక్కుల సాధనను హర్షించని వారు ఆంధ్రప్రదేశ్‌ ద్రోహులే­నని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భ­వించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే చంక­లు గుద్దుకునేందుకు సిద్ధంగా ఉండటం ఆ పార్టీ దిగ­జారుడుత­నానికి నిదర్శనమ­న్నారు.

తెలంగాణలో టీడీపీ అదృశ్యం అవుతుందన్నారు. పవన్‌ మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నాడని, పూర్తి కాలపు రాజకీయా­లకు పనికి రాడని తెలిపా­రు. తెలంగాణలో పోటీ చేసిన జనసేన పార్టీ ఓడి­పోయేందుకు కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ సహకరించిందని, ఏపీలో అదే టీడీపీకి పవన్‌ ఎలా సహకరిస్తు­న్నా­డని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి దుష్ట చతుష్టయంతో కలిసిపోయారని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement