nagarjuna konda
-
నాగార్జునకొండకు లాంచీలు పునఃప్రారంభం
నాగార్జునసాగర్: నాగార్జునకొండకు శనివారం నుంచి లాంచీల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కృష్ణా నదిలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో టీఎస్‌టీడీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లాంచీలను నాగార్జునకొండకు నిలిపి వేశారు. వర్షం, గాలి తగ్గడంతో ప్రస్తుతం లాంచీలు మొదలయ్యాయి. వర్షం కారణంగా విద్యాసంస్థలకు వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నాగార్జునసాగర్ సందర్శనకు తరలి వచ్చారు. లాంచీలు నిత్యం ఉదయం 9గంటల తర్వాత మొదలవుతాయి. మధ్యాహ్నం 2గంటల వరకు పర్యాటకుల సంఖ్యను బట్టి నాగార్జునకొండకు ట్రిప్పులు ఉంటాయి. -
పర్యాటకులకు గుడ్‌న్యూస్; సాగర్‌లో లాంచీ ప్రయాణం షురూ
నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో పర్యాటక శాఖ నాగార్జునసాగర్ జలాశయంలో లాంచీలను నడుపుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ జలాశయంలో జాలీ ట్రిప్పులు మాత్రమే తిప్పుతోంది. నాగార్జునకొండ (ఆర్కియాలజీ మ్యూజియం) ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉండటంతో తెలంగాణ ఏర్పాటైన దగ్గరినుంచి ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలను నాగార్జునకొండకు అనుమతించలేదు. ఇటీవల ఫారెస్ట్ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీ మనోహర్‌రావు సోమవారం తెలిపారు. మ్యూజియం తెరుచుకుంటే లాంచీలను నాగార్జునకొండకు నడపనున్నట్లు వెల్లడించారు. నాగార్జునకొండకు వెళ్లడానికి పెద్దలకు టికెట్ ధర రూ.150, పిల్లలకు రూ.120లుగా ఉంది. చదవండి: మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి -
ఆలోచన ఘనం.. నిర్మాణం శూన్యం!
సాక్షి, గుంటూరు: సుమారు 500 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూముల్లో సర్వే నిర్వహించి ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది. అనంతరం వైఎస్సార్ అకాల మరణం, తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కె.రోశయ్య మైసూరులోని బృందావన్ గార్డెన్స్, బెంగళూరులోని లాల్బాగ్ గార్డెన్ల తరహాలో ఇక్కడ అత్యాధునికంగా పార్కును అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటి పర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి నూతన పర్యాటక విధాన ముసాయిదాను ఆమోదించారు. పర్యాటక అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ప్రాజెక్టు భూములను అనేక సార్లు పర్యాటకశాఖ అధికారులు సందర్శించి హైదరాబాద్, ముంబాయి నగరాలకు చెందిన ఆర్కిటెక్చర్స్‌తో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నిధుల విడుదలలో నెలకొన్న జాప్యంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. టీడీపీలో రేటు మారింది మెగా టూరిజం ప్రాజెక్టుకు తెలుగుదేశం ప్రభుత్వం 2015లో 250 ఎకరాల స్థలాన్ని కేటాయించి దశల వారీగా మరికొంత స్థలంతో పాటు నిధులు మంజూరు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీనిచ్చింది. 2013లో టూరిజం శాఖ మెగా టూరిజం ప్రాజెక్టు స్థలాన్ని కేటాయించమని కోరినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఎకరం 1.80లక్షల రూపాయలు ఉండగా ప్రస్తుతం ఎకరం 2.50లక్షల రూపాయలుగా పెరిగింది. చూసి వెళ్తున్నారు.. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో మెగా టూరిజం ప్రాజెక్టును అభివృద్ధి పర్చాలని భావించింది. ఈ నేపథ్యంలో 2015 డిసెంబర్ 29న ముంబాయి ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్‌చంద్ర తన సొంత హెలికాఫ్టర్‌లో మెగా టూరిజం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి ఈ ప్రాంతం ఎంతో నచ్చిందని చెప్పటంతో ప్రాజెక్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ పడినట్లయ్యింది. 2017 ఫిబ్రవరిలో కూడా ఎస్ఎల్ గ్రూపు ప్రతినిధులు మరో సారి మెగాటూరిజం ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. ఇప్పటి వరకు వారు చూసి వెళ్లడమే కానీ ప్రాజెక్టు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఎన్నెన్నో అందాలు.. విజయపురిసౌత్ పరిధిలో చూడచక్కని చారిత్రక ప్రదేశాలైన నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి. దేశ, విదేశీ పర్యాటకులు కారులో ఇక్కడకి చేరుకోవాలంటే హైదరాబాద్ శంషాబాద్ విమానశ్రయం నుంచి కేవలం రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇక్కడ ఇన్ని సౌకర్యాలతో పాటు కనువిందు చేసే ప్రకృతి అందాలకు తోడు మెగా టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి. మెగా టూరిజం ప్రాజెక్టులో చూడచక్కని అందాలతో ఎమ్యూజ్మెంట్ పార్కులు, సినిమా స్టూడియోలు, స్విమ్మింగ్‌పూల్స్, స్టార్ హోటళ్లు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతమైన విజయపురిసౌత్‌లో వందలాది ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఇక్కడ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే సినీ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో ఇచ్చిన హామీకి ఇప్పటి వరకు మోక్షం లభించలేదు. -
నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధులు
గుంటూరు: శ్రీలంకకి చెందిన 48మంది, కాశ్మీర్‌లోని లడాక్‌కు చెందిన 8మంది బౌద్ధుల బృందం నాగార్జునకొండను శనివారం సందర్శించింది. వీరు కొండపై ఉన్న మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల్లోని మ్యూజియంలో రాతిబండలపై చెక్కి ఉన్న కళారూపాలను ఆసక్తిగా వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధి మొక్క వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పునర్నిర్మిత మహాస్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను చూశారు. -
నాగార్జునకొండపై బౌద్ధుల సందడి
విజయపురి సౌత్: నాగార్జునకొండపై మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 20 మంది బౌద్ధులు సందడి చేశారు. కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలు, లోహ పాత్రలు, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో నెలకొల్పిన రాతిబండలపై చెక్కిన కళారూపాలను సందర్శించారు. కొండపై దలైలామా నాటిన బోధి మొక్కను వీక్షించారు. అనంతరం పునర్నిర్మిత మహాస్తూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను తిలకించారు. సాగర్ చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు. -
నేడు లాంచీల ప్రారంభం
నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి నాగార్జున కొండకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. లాంచీలను బుధవారం నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో నాగార్జునసాగర్‌లో ఉన్న లాంచీ స్టేషన్ విభజన అనంతరం ఏపీకి వెళ్లడంతో లాంచీలు కూడా వారే తీసుకున్నారు. దీంతో తెలంగాణ ఏర్పడ్డాక రూ. 4 కోట్ల వ్యయంతో లాంచీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం లాంచీలు, టికెట్ కౌంటర్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. దీంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు సాగర్‌కు మంత్రుల రాక నాగార్జునసాగర్‌కు బుధవారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు రానున్నట్లు పర్యాటక శాఖ ఎండి క్రిస్టీనా తెలిపారు. హిల్‌కాలనీలో ఎర్ట్ డ్యాం వెంట గల డౌన్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్, లాంచీని ప్రారంభిస్తారని తెలిపారు.