నాగార్జునకొండపై బౌద్ధుల సందడి
నాగార్జునకొండపై బౌద్ధుల సందడి
Published Tue, Nov 29 2016 8:36 PM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
విజయపురి సౌత్: నాగార్జునకొండపై మంగళవారం కర్ణాటక రాష్ట్రానికి చెందిన 20 మంది బౌద్ధులు సందడి చేశారు. కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలు, లోహ పాత్రలు, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో నెలకొల్పిన రాతిబండలపై చెక్కిన కళారూపాలను సందర్శించారు. కొండపై దలైలామా నాటిన బోధి మొక్కను వీక్షించారు. అనంతరం పునర్నిర్మిత మహాస్తూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను తిలకించారు. సాగర్ చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు.
Advertisement