నేడు లాంచీల ప్రారంభం
నేడు లాంచీల ప్రారంభం
Published Tue, Aug 2 2016 11:13 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM
నాగార్జునసాగర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత ఈ ప్రాంతం నుంచి నాగార్జున కొండకు లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. లాంచీలను బుధవారం నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గతంలో నాగార్జునసాగర్‌లో ఉన్న లాంచీ స్టేషన్ విభజన అనంతరం ఏపీకి వెళ్లడంతో లాంచీలు కూడా వారే తీసుకున్నారు. దీంతో తెలంగాణ ఏర్పడ్డాక రూ. 4 కోట్ల వ్యయంతో లాంచీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం లాంచీలు, టికెట్ కౌంటర్ల నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. దీంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నేడు సాగర్‌కు మంత్రుల రాక
నాగార్జునసాగర్‌కు బుధవారం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, విద్యుత్‌శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిలు రానున్నట్లు పర్యాటక శాఖ ఎండి క్రిస్టీనా తెలిపారు. హిల్‌కాలనీలో ఎర్ట్ డ్యాం వెంట గల డౌన్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్, లాంచీని ప్రారంభిస్తారని తెలిపారు.
Advertisement
Advertisement