నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధులు | srilanka Buddhists visits nagarjuna konda | Sakshi
Sakshi News home page

నాగార్జున కొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధులు

Published Sat, Jan 28 2017 7:11 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

srilanka Buddhists visits nagarjuna konda

గుంటూరు:
శ్రీలంకకి చెందిన 48మంది, కాశ్మీర్‌లోని లడాక్‌కు చెందిన 8మంది బౌద్ధుల బృందం నాగార్జునకొండను శనివారం సందర్శించింది. వీరు కొండపై ఉన్న మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల్లోని మ్యూజియంలో రాతిబండలపై చెక్కి ఉన్న కళారూపాలను ఆసక్తిగా వీక్షించారు.

కొండపై దలైలామా నాటిన బోధి మొక్క వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత పునర్నిర్మిత మహాస్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను చూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement