
సాక్షి, అమరావతి: ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు వల వేస్తే పడలేదు. ఇప్పుడు సోనూ సూద్‌కు గాలం వేశాడు. నిస్వార్థ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్. త్వరలోనే వీళ్ల సంగతి ఆయనకు తెలియకపోదు. ఇమేజి పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అదే విధంగా ‘ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోకపోతే ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆక్రోశం ఎందుకో? నిమ్మాడ నుంచి కరకట్ట కొంప వరకు రీసౌండ్ ఎందుకు వస్తోంది?. పచ్చ మీడియా విషపు రాతలు ఎందుకు రాస్తోంది?. విశాఖపై రాయలసీమ రౌడీల కన్ను అంటూ విషం చిమ్మిన మీడియా. ఆక్రమణలు తొలగిస్తుంటే కక్ష సాధింపు అంటోంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌లో సూటిగా ప్రశ్నించారు.
చదవండి: వరుసగా మూడో ఏడాది వైఎస్‌ఆర్ వాహనమిత్ర అమలు: సీఎం జగన్