Minister KTR Birthday: Celebrities And Politicians Pour Birthday Wishes - Sakshi
Sakshi News home page

Happy Birthday KTR: సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా.. సాయానికి త్వరగతిన రిప్లై

Published Sat, Jul 24 2021 8:28 AM | Last Updated on Sat, Jul 24 2021 1:28 PM

Happy Birthday KTR From Celebrities To Ordinary Citizens Pour Wishes To KTR - Sakshi

యువనేతగా కేటీఆర్‌కు ఉన్న భారీ ఫాలోయింగ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆపదలో ఉన్నవాళ్లెందరికో.. ముఖ్యంగా కరోనా టైంలో సాయం అందించి హీరోగా జేజేలు అందుకున్నాడాయన. ఇవాళ కల్వకుంట్ల తారక రామారావు 45వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువల్లా వస్తున్నాయి.

‘ఈ ఏడాది రాబోయే రోజుల్లోనూ అంతా మీకు మంచే జరగాలి. మీ సానుకూల ధోరణి, దూరదృష్టి.. లక్షల మందికి మార్గదర్శకం. ‘కేటీఆర్‌.. మీరొక సూపర్‌స్టార్‌’. నాకే కాదు.. మొత్తం తెలంగాణకే మీరొక బార్న్‌ సూపర్‌స్టార్‌. మీ ఆప్యాయ కౌగిలింత కోసం.. అంటూ స్నేహాన్ని ప్రదర్శించాడు రియల్‌ హీరో సోనూసూద్‌. దీనికి బదులిచ్చిగా కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఇక మంత్రి హరీష్‌ రావు విషెస్‌కి.. ‘థ్యాంక్స్‌ బావా’ అని బదులిచ్చాడు కేటీఆర్‌. ప్రొడ్యూసర్లు బండ్ల గణేశ్‌, పీవీపీ ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా.. బదులిచ్చాడు కేటీఆర్‌. అంతేకాదు సాయం కోసం ట్వీట్లు చేస్తు‍న్నవాళ్లకు సైతం త్వరగతిన స్పందన ఇస్తున్నారు. 

పెగాసస్‌ వల్ల పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కాల్‌ చేయలేకపోయానంటూ ఓ యూజర్‌ చమత్కరించగా.. ‘థ్యాంక్స్‌’ అంటూ బదులిచ్చాడు కేటీఆర్‌. సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా సోషల్‌ మీడియాలో విషెస్‌ చెబుతుండగా.. ఓపికగా చాలామందికి బదులిస్తున్నాడాయన.  

ప్రజా సేవలో అలుపెరుగని నాయకుడు,ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన యోధుడంటూ పార్టీ కార్యకర్తల నుంచి బడా నేతల దాకా అంతా పొగడ్తలతో.. కేటీఆర్‌కు బర్త్‌డే శుభాకాంక్షలతో ముంచెతుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement