సేవలకు సలాం.. సోనూసూద్‌కు అరుదైన గౌరవం | Statue Of Actor Sonu Sood Erected In Khammam District | Sakshi
Sakshi News home page

సేవలకు సలాం.. సోనూసూద్‌కు అరుదైన గౌరవం

Published Sat, Oct 9 2021 3:55 PM | Last Updated on Thu, Oct 14 2021 4:33 PM

Statue Of Actor Sonu Sood Erected In Khammam District - Sakshi

గార్లపాడులో ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న సోనూసూద్‌ విగ్రహం  

బోనకల్‌: కరోనా, లాక్‌డౌన్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతోమందికి సహాయం చేసిన సినీ నటుడు సోనూసూద్‌కు ఓ అభిమాని కుటుంబం విగ్రహం ఏర్పాటు చేసింది. ఎందరివో కష్టాలు తీర్చి రియల్‌ హీరో అనిపించుకున్న సోనూసూద్‌పై అభిమానంతో అరుదైన గౌరవం ఇచ్చారు ఆ నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు. బోనకల్‌ మండలం గార్లపాడుకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు, మరియమ్మ దంపతులు కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. (చదవండి: Rain Alert: హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం)

కోవిడ్‌ సమయంలో నిరుపేదలకు సేవలందించిన సోనూసూద్‌కు ఆ కుటుంబమంతా అభిమానులుగా మారారు. దీంతో కూలీ పనులు చేసి కూడగట్టుకున్న రూ.25 వేలతో విజయవాడలో విగ్రహాన్ని చేయించారు. దసరాలోగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.
చదవండి:
దిల్‌షుఖ్‌నగర్‌ థియేటర్లోకి భారీగా వరద నీరు, 40 వాహనాలు ధ్వంసం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement