బంగ్లాదేశ్‌లో ఓ మహిళ ఆవేదన.. స్పందించిన సోనూ సూద్! | Bollywood Actor Sonu Sood Reacts On Video Of A Bangladeshi Woman Asking For Help From Indian Govt, Tweet Inside | Sakshi
Sakshi News home page

Sonu Sood: దయచేసి వారిని ఇండియాకు తీసుకురండి.. సోనూ సూద్‌ రిక్వెస్ట్!

Published Tue, Aug 6 2024 4:02 PM | Last Updated on Tue, Aug 6 2024 4:49 PM

Bollywood Actor Sonu Sood Reacts On A video Form Bangladesh

బంగ్లాదేశ్‌లో అల్లర్ల నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆ దేశ ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చేశారు. దీంతో ఆందోళనకారులు ఆమె ఇంటిని ముట్టడించి చేతికి దొరికిన వాటిని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న హిందూవులపై సైతం దాడులు చేస్తున్నారు. తమను కాపాడాలంటూ ఓ మహిళ వేడుకుంటున్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌ స్పందించారు. దయచేసి బంగ్లాదేశ్‌లో ఉన్న మన భారతీయులందరినీ ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనదేశంలో సురక్షితంగా ఉంటారని తెలిపారు. ఇది కేవలం మన ప్రభుత్వ బాధ్యతే కాదు.. దేశ పౌరులుగా మనందరి బాధ్యత ‍అని సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement