
సాక్షి, హైదరాబాద్: రీల్ లైఫ్‌లో విలన్ అయినా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ రియల్ లైఫ్‌లో హీరోగా నిలిచాడు నటుడు సోనూసూద్. తనమత బేధాలు లేకుండా ఎంతోమందిని ఆదుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. యూత్‌కు ఫేవరెట్ స్టార్ అయిపోయాడు. అయితే అతడు తనకు దేవుడని కీర్తిస్తున్నాడు వికారాబాద్‌కు చెందిన ఓ యువకుడు. నటుడి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర మొదలు పెట్టాడు.
నాకు సోనూసూద్ అంటే ఎంతో ఇష్టం. దేశం మొత్తానికి సాయం చేసిన ఆయన నాకు దేవుడితో సమానం. ఆ దేవుడి దగ్గరకు వెళ్లాలని సంకల్పించాను. ఆయనను కలిసి మాట్లాడితే నా జన్మ ధన్యమైతుందని భావిస్తున్నాను. నేను పాదయాత్ర చేపడతాను అనగానే నా తల్లిదండ్రులు భయపడ్డారు, కానీ తర్వాత ఒప్పుకున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా రోజూ 40 కిమీ నడుస్తున్నాను, రాత్రి ఎక్కడో చోట నిద్రిస్తున్నా. సోనూసూద్ ఫొటో చూసి చాలామంది నాకు సాయం చేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment