Sonu Sood Announces Free Coaching Scholarships For IAS Aspirants, Here's How To Apply - Sakshi
Sakshi News home page

Sonu Sood: ‘రియల్‌ హీరో’ మరో కీలక నిర్ణయం.. ‘సంభవం’ పేరుతో..

Published Sat, Jun 12 2021 4:33 PM | Last Updated on Sat, Jun 12 2021 6:44 PM

Sonu Sood Announces Free Coaching For IAS Aspirants - Sakshi

‘రియల్‌ హీరో’ సోనూ సూద్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐఏఎస్ కావాలని కలలుకనే పేద విద్యార్థుల అండగా నిలవాలని డిసైడ్‌ అయ్యాడు. ‘సంభవం’ పేరుతో వారికి ఆర్థికంగా సహకరించేందుకు ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘ఐఏఎస్ కోసం సిద్ధం కావాలనుకుంటున్నారా.. మీ బాధ్యత మేం తీసుకుంటాం. ‘సంభవం’ప్రారంభం గురించి ప్రకటిస్తున్నందుకు థ్రిల్లింగ్‌గా ఉంది’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. స్కాలర్‌షిప్స్ కోసం www.soodcharityfoundation.org వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సోనూ సూద్ తెలిపాడు. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు జూన్ 30లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని కోరాడు. 

కాగా, గతేడాది లాక్‌డౌన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్‌ సొంత ఖర్చులతో ఇళ్లకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి ఏ కష్టమొచ్చిన సాయం అందిస్తూ పేదల పాలిట దేవుడిగా మారాడు.

చదవండి: 
పద్మ అవార్డు: ట్రెండింగ్‌లో సోనూసూద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement