1200 కి.మీ. సైకిల్‌ యాత్ర, దండేసి దండం పెట్టిన సోనూసూద్‌ | Sonu Sood Fan Travel 1200 Km On Cycle To Meet Him | Sakshi
Sakshi News home page

Sonu Sood: అభిమానికి పూలదండతో స్వాగతం పలికిన సోనూసూద్‌

Published Sun, Jul 18 2021 10:25 AM | Last Updated on Sun, Jul 18 2021 11:48 AM

Sonu Sood Fan Travel 1200 Km On Cycle To Meet Him - Sakshi

తెరమీద కరడుగట్టిన రాక్షసుల్లా కనిపించే విలన్లకూ వెన్నలాంటి మనసుంటుందని నిరూపించాడు నటుడు సోనూసూద్‌. కరోనాకు ముందు వరకు సోనూసూద్‌ అందరికీ విలన్‌గానే సుపరిచితుడు. కానీ కరోనా కష్ట కాలంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందిస్తూ వచ్చాడు. కోవిడ్‌ బారినపడినవారికి ఔషధాలు అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ నిరుపేదల గుండెల్లో దేవుడిగా కొలువు దీరాడు.

ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సోనూసూద్‌ చేస్తుండటంతో ప్రతి ఒక్కరూ అతడిని అభినందిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సోనూ అభిమానులు కూడా ఆయనను ఒక్కసారి కలిస్తే జన్మ ధన్యమైనట్లేనంటూ పాదయాత్రలు కూడా చేశారు. అయితే తనను కలవడానికి ఇంత కష్టపడొద్దని ఆయన అభిమానులకు సూచించారు. అయినా సరే తనతో కలిసి సెల్ఫీ దిగాలని ఇప్పటికీ ఎంతోమంది సుదూర తీరాలనుంచి ముంబై పయనమవుతూనే ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా మరో అభిమాని సోనూసూద్‌ను కలిశాడు. 1200 కి.మీ. సైకిల్‌ తొక్కుకుంటూ నటుడి ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే ఇంటి బయటకు వచ్చిన సోనూసూద్‌ అతడిని సాదరంగా స్వాగతించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ప్రేమతో నటుడి పాదాల మీద పూలు చల్లాడు. నటుడి మెడలో పూలమాల వేయబోతుండగా సోనూసూదే తిరిగి దాన్ని అభిమాని మెడలో వేసి నమస్కరించడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement