అభిమాని ప్రేమకు ఫిదా అయిపోయిన సోనూసూద్‌ కుటుంబం | A Stranger Person Left Sweet Note To Sonu Sood | Sakshi
Sakshi News home page

అభిమాని ప్రేమకు ఫిదా అయిపోయిన సోనూసూద్‌ కుటుంబం

Published Sat, Feb 24 2024 8:44 AM | Last Updated on Sat, Feb 24 2024 10:30 AM

A Stranger Person Left Sweet Note To Sonu Sood - Sakshi

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కు  ఓ అజ్ఞాత అభిమాని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తాజాగా ఆయన తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ వారందరితో కలిసి ఆయన భోజనం చేశాడు. తినడం అయ్యాక బిల్‌ చెల్లించాలని తన వద్దకు ఎవరూ రాలేదు. దీంతో సోనూసూద్‌ వెళ్లి బిల్లు ఎంత అయిందని అక్కడి సిబ్బందిని కోరాడు. దీంతో ఫుడ్‌ బిల్లు మొత్తం ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లించాడని చెప్పారు.

రెస్టారెంట్‌ సిబ్బంది మాటలకు సోనూసూద్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆశ్బర్యపోయారు. ఆ అజ్ఞాత వ్యక్తి సోనూసూద్‌కు ఇలా ఒక నోట్‌ కూడా రాసి ఉంచాడు.  'దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున చిన్న కృతజ్ఞత ఇది' అంటూ ఒక చిన్న కాగితంపై రాసి ఉంచాడు. తాజాగా ఈ విషయాన్ని సోనూ భాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా షేర్ చేశాడు.  'ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు.. కానీ, మా డిన్నర్‌ బిల్లు మొత్తం చ్లెలించి ఈ స్వీట్‌ నోట్‌ను వదిలేసి వెళ్లారు. నా హృదయాన్ని అతను గెలుచుకున్నాడు.' అంటూ సోనూ  పేర్కొన్నాడు.  

కొవిడ్‌ సమయంలో లాక్‌డౌన్ వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.. అప్పట్లో ఆయన పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం కూడా నిస్వార్థ సేవాగుణంతో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను ఆయన సంపాదించుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement