
గత రెండు మూడు రోజులుగా సోనూసూద్ గురించి ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏ సంబంధం లేనివారికే ఎన్నో ఇచ్చిన ఆయన ఫాదర్స్‌డేను పురస్కరించుకుని పెద్ద కొడుకు ఇషాన్‌కు సుమారు రూ.3 కోట్ల విలువైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చారంటూ వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఈ కారులో సోనూ ఫ్యామిలీ షికారుకు కూడా వెళ్లిందంటూ కథనాలు అల్లేశారు.
తాజాగా ఈ వార్తలపై సోనూసూద్ స్పందించాడు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పాడు. తన కొడుక్కు కారు కొనలేదని స్పష్టం చేశాడు. కేవలం ట్రయల్ కోసమే కొత్తకారును ఇంటికి తీసుకొచ్చామే తప్ప దాన్ని కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చాడు. అయినా ఫాదర్స్‌డే రోజు పిల్లలు తనకేదైనా ఇవ్వాలి కానీ తానెందుకు వాడికి కారు బహుమతిగా ఇస్తాననని ప్రశ్నించాడు.
అయితే చాలామంది ఈ ఊహాగానాలు నిజమేనని నమ్మినప్పటికీ తనకు మద్దతిస్తూ మాట్లాడటం సంతోషాన్నిచ్చిందన్నాడు. ఇక ఫాదర్స్‌డే రోజు కొడుకులిద్దరితో కాలక్షేపం చేయడాన్ని ఎంతో అమూల్యమైన కానుకగా సోనూసూద్ అభివర్ణించాడు.
చదవండి: కాలినడకన వచ్చిన అభిమానిని చూసి చలించిపోయిన సోనూసూద్
Comments
Please login to add a commentAdd a comment