
జాతీయ స్థాయి షూటర్, జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల కోనికా లాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఆశించిన స్థాయి ప్రదర్శన లేకపోవడంతో ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోల్‌కతాలో మాజీ ఒలింపియన్ జాయ్‌దీప్ కర్మాకర్ వద్ద కోనికా శిక్షణ పొందుతోంది. సొంత రాష్ట్రం తరఫున మంచి ప్రదర్శన ఇవ్వడంతో నటుడు సోనూసూద్ ఆమెకు ప్రత్యేక రైఫిల్ కొనిచ్చి ప్రోత్సహించాడు. ఇటీవల అనూహ్య రీతిలో నలుగురు షూటర్లు ఆత్మహత్యకు పాల్పడటం చర్చకు దారి తీస్తోంది.