
Sonu Sood Epic Reply to Netizen: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అప్పటి నుంచి ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగానూ ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన, లేదా సర్జరీలు వంటి కోసం ఆర్థిక సాయం కావాలంటూ సోనూ సూద్‌కు ట్వీట్ చేస్తుంటారు.
చదవండి: కాబోయే భార్యకు రణ్‌బీర్ కాస్ట్‌లీ గిఫ్ట్! అదేంటో తెలుసా?
ఇలాంటివి తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి వారికి సాయం అందిస్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఓ బాలుడికి సోనూ ఫౌండేషన్ ద్వారా ఇటీవల హార్ట్ సర్జరీ చేయించారు సోనూ సూద్. ప్రస్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఇదే విషయాన్ని సోనూకు తెలియజేస్తూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఆయనకు ట్వీటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజన్ సోనూకు ఫన్నీ ట్వీట్ చేశాడు. తాను భార్యాబాధితుడినని, తనకు కూడా చికిత్స చేయించాలంటూ సోనూ సూద్‌ను కోరాడు. దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: స్పెషల్ హీరోయిన్.. సో స్పెషల్
‘సోదరా సోనూసూద్ మీరు అందరికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా రక్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా? ఉంటే దయచేసి సహాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి సోనూ సూద్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘అది ప్రతీ భార్య జన్మ హక్కు బ్రదర్.. ఆ రక్తంతో నాలాగే మీరు కూడా బ్లడ్ బ్యాంకు ప్రారంభించండి’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు.
यह हर बीवी का जन्म सिद्ध अधिकार है भाई,
— sonu sood (@SonuSood) April 13, 2022
मेरी मानो उसी खून से एक ब्लड बैंक खोल लो 🤣 https://t.co/bXOPLzDS74
Comments
Please login to add a commentAdd a comment