
రియల్ హీరో సోనూ సూద్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించిన రెండున్నారేళ్ల చిన్నారికి సోనూసూద్ శస్త్ర చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం చిన్నారికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఏడు గంటల పాటు బాలికకు వైద్యులు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా పూర్తి చేశారని తాజాగా సోనూ సూద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆపరేషన్‌కు ముందు, తర్వాత ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. బిహార్‌లోని చిన్న గ్రామంలో నాలుగు కాళ్లు, చేతులతో చౌముఖి జన్మించింది.
చదవండి: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు: వీడియో వైరల్
ఇటివల తనకు జరిగిన శస్త్ర చికిత్స విజయంతం కావడంతో చౌముఖి త్వరలో ఇంటికి వెళ్లేందకు సిద్ధంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. కాగా కరోనా సమయంలో సోనూ సూద్ ఎంతోమందికి చేయూతను ఇచ్చారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీల కోసం ప్రత్యేక బసు సదుపాయం కల్పించి వారి సొంత రాష్ట్రాలకు తరలించారు. ఇతర దేశాల్లో సైతం చిక్కుకుపోయిన వారిని కూడా ప్రత్యేక విమానాల ద్వారా దేశానికి రప్పించారు. ఇలా మొదటి లాక్‌డౌన్ నుంచి సోనూ సూద్ పేదలకు ఆర్థిక సాయం అందిస్తూ నిరంత సామాజీక సేవలు చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment