MS Dhoni 42nd Birthday Celebration: MS Dhoni Birthday 52 And 77 Feet Cut Out Display In Two Telugu States, Pics Viral - Sakshi
Sakshi News home page

#MSDhoni: ధోని బర్త్‌డే.. ఆకాశమంత కటౌట్‌, సినీ హీరోలను మించేలా!

Published Thu, Jul 6 2023 7:56 PM | Last Updated on Thu, Jul 6 2023 8:12 PM

MS Dhoni Birthday Huge Cut-Outs Displayed In Two-Telugu States Viral - Sakshi

జూలై 7(శుక్రవారం).. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని 42వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్‌ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ 16వ సీజన్‌ చాలు ధోని క్రేజ్‌ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్‌కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్‌ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో చూసే అవకాశం ఉంది.

ఇక రేపు(జూలై 7న) ధోని బర్త్‌డే వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అతని అభిమానులు పెద్ద ఎత్తున ప్లాన్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోని పుట్టినరోజు పురస్కరించుకొని భారీ ఎత్తున సెలబ్రేషన్స్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) ధోనికి పెద్ద ఎత్తున కటౌట్లు ఏర్పాటు చేశారు.

ధోనీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‍లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో 52 అడుగుల పొడవైన కటౌట్‍ను అభిమానులు ఏర్పాటు చేశారు. టీమిండియా జెర్సీ, బ్యాట్ పట్టుకొని ఉన్న ధోనీ ఉన్న కటౌట్‍ను ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‍లో 77 అడుగుల పొడవు ఉన్న ధోనీ కటౌట్‍ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.ఏపీలోని నందిగామలో ఈ కటౌట్ పెట్టినట్లు సమాచారం. సినీ హీరోలకు తీసిపోని విధంగా ధోనికి కటౌట్‌ ఏర్పాటు చేయడం అతని క్రేజ్‌ ఏంటనేది తెలుపుతోంది.

ఇక క్రికెటర్లకు ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన వాటిలో ఇదే అది పెద్ద కటౌట్ అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్‍లో ధోనీ ఉన్నట్టుగా ఈ కటౌట్ ఉంది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధోనీ కటౌట్‍లకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధోనీ క్రేజ్ మాములుగా లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

భారత క్రికెట్ చరిత్రలో  ఎంఎస్‌ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‍గా నిలిచాడు. ‘మిస్టర్ కూల్’ ధోనీ సారథ్యంలో టీమిండియా 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలిచింది. మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిన ఏకైక భారత కెప్టెన్‍గా కీర్తి సాధించాడు.  2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‍గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్‌లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్‌లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు.

చదవండి: #MarkWood: యాషెస్‌ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్‌ బంతి.. ఖవాజాకు మైండ్‌ బ్లాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement