నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్‌.. వీడియో వైరల్‌ | Lionel Messi Cutout Hits Streets Of Kerala Ahead Of FIFA World Cup 2022 | Sakshi
Sakshi News home page

FIFA World Cup: నది మధ్యలో మెస్సీ 30 అడుగుల కటౌట్‌.. వీడియో వైరల్‌

Nov 3 2022 8:58 PM | Updated on Nov 3 2022 8:58 PM

Lionel Messi Cutout Hits Streets Of Kerala Ahead Of FIFA World Cup 2022 - Sakshi

నవంబర్‌ 20 నుంచి ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ మొద‌లుకానుండ‌డంతో ప్రపంచ‌వ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫీవ‌ర్ మొద‌లైంది. కేర‌ళ‌లో కొంద‌రు అభిమానులు అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్స్ మీద త‌మ అభిమానాన్ని ప్రపంచానికి తెలియ‌జేసేందుకు వెరైటీగా ఆలోచించారు. 30 అడుగుల ఎత్తైన లియొనెల్ మెస్సీ క‌టౌట్‌ ఏర్పాటు చేశారు. కోజికోడ్ జిల్లాలోని పుల్లవూర్‌కు చెందిన కొంద‌రు యువ‌కులు అర్జెంటీనా ఫ్యాన్స్ అసోసియేష‌న్‌గా ఏర్పడ్డారు.

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో త‌మ ఫేవ‌రెట్ టీం, ఫేవ‌రెట్ అట‌గాడికి మ‌ద్దతుగా వాళ్లు కురున్‌గ‌ట్టు క‌డవు న‌ది మ‌ధ్యలో మెస్సీ క‌ట‌వుట్ పెట్టారు. ‘త్వరలో ప్రారంభం కానున్న ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ఈవెంట్‌ని మ‌రింత స్పెష‌ల్‌గా మార్చాల‌నుకున్నాం. అందుకోసం మెస్సీ నిలువెత్తు క‌టౌట్ పెట్టాం’ అని పేర్కొన్నారు. రోడ్డు మీదుగా మెస్సీ క‌టౌట్‌ని తీసుకొస్తున్న ఫొటోలు, వీడియోల్ని రిజ్వాన్ అనే యూజ‌ర్ ట్విటర్‌లో పెట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: పాక్‌కు మరోసారి టీమిండియానే దిక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement